రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?

రాధికా మర్చంట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని సంపన్న కుటుంబైన అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్నారు రాధికా మర్చంట్.

"రాధికను చూసిన క్షణాన నా గుండె ఝల్లుమంది. తను పరిచయమై ఏడేళ్లవుతున్నా, నిన్ననే కలిసినట్లు ఉంది. రాధికను కలుసుకోవడం 100 శాతం నా అదృష్టంగానే భావిస్తున్నాను."

రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది.

ఆ వేడుకలో అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య గురించి తన మనసులోమాటను పంచుకున్నారు.

మూడు రోజుల వేడుకలో బిల్‌గేట్స్, మార్క్ జూకర్‌బర్గ్, రిహానాల వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

భారత్‌లోని సంపన్న కుటుంబమైన అంబానీ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టనున్నారు రాధిక. ముఖేష్ అంబానీ ముగ్గురు సంతానంలో చిన్నవారు అనంత్ అంబానీ.

2022 డిసెంబర్‌లో తన తొలి సంప్రదాయ నృత్య ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు రాధిక.

ఈ ప్రదర్శన ముంబయిలోని జియా వరల్డ్ సెంటర్‌లో నిర్వహించారు. చాలామంది సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాధిక మర్చంట్, అనంత్ అంబానీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాధిక మర్చంట్, అనంత్ అంబానీ

ఎవరీ రాధిక మర్చంట్?

ఫార్మసీ సంస్థ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక.

ముంబయిలోనే రాధిక విద్యాభ్యాసం సాగింది. ముంబయిలోని కేథడ్రల్ అండ్ జోన్ కోనన్ స్కూల్, ఎకోలో మోడ్రన్ వరల్డ్ స్కూల్‌లో చదువుకున్నారు.

న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

ఇస్ప్రవా సంస్థలో సేల్స్ ఎగ్జిక్యుటివ్‌గా పనిచేశారు.

ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఆమె కూడా ఒకరు.

రాధికా మర్చంట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2022 డిసెంబర్‌లో తొలి ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు రాధిక.

డిసెంబర్ 2022లో తొలిసారి..

చదువు మాత్రమే కాకుండా భరత నాట్యంలోనూ ప్రవేశం ఉంది. చాలా ఏళ్లుగా సాధన చేస్తున్నారు.

2022లో తొలి ప్రదర్శన ఇచ్చిన సమయంలో వార్తల్లో నిలిచారు రాధిక.

రాధిక లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, వ్యాపారమే కాక పౌర హక్కులు, ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యంపై కూడా ఆమెకు ఆసక్తి ఉంది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

ఫొటో సోర్స్, ANI

“ఆమెను చూసిన క్షణాన నా గుండె ఝల్లుమంది”

కొద్దికాలం కిందట రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో అనంత్, రాధికలకు నిశ్చితార్థం జరిగింది.

అయితే, వీరిద్దరూ కాలేజీ సమయంలోనే ఒకరినొకరు కలుసుకున్నారని చెప్తుంటారు.

అనంత్ అంబానీ చెప్పిన వివరాల ప్రకారం, ఇద్దరికీ ఏడేళ్లుగా పరిచయం ఉంది.

ఈషా అంబానీ వివాహ వేడుక తరువాత రాధిక అంబానీ కుటుంబంతో కనిపించారు.

శనివారం అనంత్ అంబానీ వేదికపై రాధిక గురించి తన మనసులో మాటను చెప్తూ, “రాధికను చూసినప్పుడు నా గుండె ఝల్లుమంది. ఆమెను కలిసి ఏడేళ్లవుతున్నా నిన్ననే కలిసినట్లుగా ఉంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)