కీరన్ పొలార్డ్: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు వెస్టిండీస్ క్రికెటర్ రావడంపై పాకిస్తాన్ అభిమానుల విమర్శలు ఎందుకు?

ఫొటో సోర్స్, KIERON.POLLARD55 @INSTAGRAM
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతోంది.
ఈ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరవుతున్నారు. అందులో వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ కూడా ఉన్నారు. ఆయన కూడా పెళ్లికి ముందు జరుగుతున్న వేడుకులకు వెళ్లారు.
దీనికి సంబంధించిన ఫోటోలను పోలార్డ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆయన బాలీవుడ్ నటులు, ఇతర అతిథులతో కలిసి కనిపించారు.
అయితే, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, CHIRAG CHOTALIYA/EPA-EFE/REX/SHUTTERSTOCK
అసలేం జరిగింది?
అంబానీ ఫ్యామిలీ యాజమానిగా ఉన్న ముంబయి ఇండియన్స్, ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
పొలార్డ్ 2010 నుంచి ముంబయి జట్టుతో ఉన్నారు. జట్టు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించారు.
అంతేకాదు ఆయన అంబానీ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారనీ చెబుతారు. ఈ నేపథ్యంలో వివాహానికి హాజరయ్యేందుకు భార్యతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు పొలార్డ్.
అయితే, ఇదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పొలార్డ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్నారు పొలార్డ్. టోర్నీ కూడా మొదలైంది.
అయితే, లీగ్‌ను మధ్యలో వదిలిపెట్టి జామ్‌నగర్ చేరుకున్నారు పొలార్డ్.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, భారత్ అభిమానులు ఏమంటున్నారు?
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి పీఎస్‌ఎల్ మ్యాచ్‌లకు దూరం కావాలని పొలార్డ్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
పోలార్డ్ చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి, ఇలా లీగ్ మధ్యలోనే వెళ్లడంపై అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, అంబానీ కుటుంబంతో పొలార్డ్‌కు ఉన్న అనుబంధం, పీఎస్ఎల్ గురించి భారత అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఫరీద్ ఖాన్ అనే పాకిస్తాన్ నెటిజన్ దీనిపై ఒక పోస్టు చేస్తూ "ఐపీఎల్ సమయంలో ఎవరైనా ఆటగాడు ఇలా మధ్యలోనే వదిలేసి వివాహానికి హాజరు కావడానికి పాకిస్తాన్‌కు వస్తారా?" అని ప్రశ్నించారు.
''అతనికి నాలుగు రోజులు సెలవు ఇవ్వడంతో జామ్‌నగర్ వెళ్లిపోయారు, అనంత్ అంబానీ పెళ్లికి గ్లోబల్ స్టార్స్ చేరుకుంటున్నారు, ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌ని వదిలి అక్కడికి వెళ్తున్నారు'' అని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫర్హాన్ అన్సారీ అనే మరో నెటిజన్ ఇలా టోర్నమెంట్‌ను మధ్యలోనే వదిలేయడం సరైనదేనా? అని ప్రశ్నించారు.
రిజ్వాన్ అనే నెటిజన్ "పీఎస్ఎల్ మధ్యలో ఒక వివాహానికి హాజరవడానికి పొలార్డ్ భారత్ వెళ్లాడు, పీఎస్ఎల్‌పై ఆయనకు గౌరవం లేదు" అని రాశారు.
చాలామంది భారత అభిమానులు కూడా ఈ విషయంపై స్పందించారు. వివాహం కారణంగానే పొలార్డ్ ఆదివారం కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు వెళ్లడం లేదని చెప్పారు.
విపిన్ తివారీ అనే నెటిజన్ "కరాచీ కింగ్స్‌లోని ఏకైక అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ముఖేష్ అంబానీ కొడుకు వివాహానికి భారత్ వచ్చారు. అంబానీ కొడుకు పెళ్లి పీఎస్ఎల్ కంటే పెద్దది" అని తెలిపారు.
యష్ అనే నెటిజన్ "అంబానీ కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావడానికి పొలార్డ్ భారత్ వచ్చారు, పీఎస్ఎల్‌ను ఎవరూ పట్టించుకోరు" అంటూ కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ అనంత్ అంబానీ?
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న జామ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పాటు జరిగే ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్‌లో 50,000 మందికి పైగా హాజరవుతున్నారు.
జామ్‌నగర్ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ విమానాలు చేరుకోనున్న దృష్ట్యా ఆ ఎయిర్ పోర్టుకు 10 రోజుల పాటు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కూడా ఇచ్చారు.
వేడుక కోసం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, ప్రముఖ గాయని రిహానా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, పలు దేశాల ప్రధానులు, ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు తరలివచ్చారు.

ఫొటో సోర్స్, ANI NEWS AGENCY
బ్యాక్-టు-బ్యాక్ చార్టర్డ్ ఫ్లైట్‌లు, ప్రముఖ గాయని రిహన్నా ప్రదర్శన, బాలీవుడ్ నటీనటుల రాక, 'జంగిల్' డ్రెస్ కోడ్ ఇవన్నీ వివాహానికి ముందు జరిగే వేడుకలలోని కొన్ని విశేషాలు.
అంబానీ ముగ్గురు పిల్లలలో ఒకరు ఈ అనంత్ అంబానీ. ఆయన వయసు 28 ఏళ్లు.
ఆయన పలు రిలయన్స్ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్, రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లకు అనంత్ డైరెక్టర్ కూడా.
ఆయన కాబోయే భార్య రాధిక (29), ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు.
2018లో అంబానీ కూతురు ఇషా పెళ్లి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా భావించేవారు. దీని ఖరీదు రూ.700 కోట్లు అని సమాచారం.
ముంబయిలో జరిగిన ఈ వివాహ వేడుకలో అమెరికన్ సింగర్ బియాన్స్ ప్రదర్శన ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- జీఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి కేసులో ప్రధాన అభియోగం ఐటీసీ అక్రమాలేనా
- కత్తి మింగడమనే కళ వైద్య రంగాన్ని ఎలా మార్చింది?
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?
- సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














