వీగిన అవిశ్వాస తీర్మానం.. మణిపుర్ మహిళలపై జరిగిన నేరాల గురించి ప్రధాని మోదీ ఏమన్నారు?

ఫొటో సోర్స్, ANI
మణిపుర్ అంశంపై కాంగ్రెస్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది.
తీర్మానంపై లోక్‌సభలో మూడు రోజులపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చకు సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం, ఆ తర్వాత తీర్మానంపై మూజువాణి ఓటింగ్ జరిగాయి.
ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని ప్రసంగంలో ఏముంది?
ప్రధాని దాదాపు గంటన్నరపాటు కాంగ్రెస్, ఇతర పక్షాలను విమర్శించడంపై దృష్టి సారించారు. దీనిపై ఆగ్రహించిన విపక్షాలు, ప్రధాని ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కల్పించుకుని, మణిపుర్ అంశంపై ప్రశ్నలు అడిగిన ప్రతిపక్షాలకు సమాధానాలు వినే ధైర్యం లేదన్నారు.
మణిపుర్‌లో చాలా కుటుంబాలు కష్టాల్లో పడ్డాయని, చాలా మంది తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయారన్న ప్రధాని, మహిళలపై తీవ్రమైన నేరాలు జరిగాయని, ఇవి క్షమించరానివని చెప్పారు.
మణిపుర్‌లో మళ్లీ శాంతి నెలకొంటుందని, ఆ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తాను హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు. ఇందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలి పెట్టబోమన్నారు.
కొందరు ఇక్కడ జరుగుతున్న ఘటనలను భారత మాత మరణంతో సమానమని వ్యాఖ్యానించడం ద్వారా దేశాన్ని అవమానించారని పరోక్షంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మణిపుర్‌లో పరిస్థితులు కుదుటపడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అక్కడ అరాచకం సృష్టిస్తున్నవారిని కఠినంగా శిక్షించడం ఖాయమని ప్రధాని చెప్పారు. దేశ ప్రజలంతా మణిపుర్ వాసులకు అండగా ఉన్నారన్నారు.
మణిపుర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా అనేక పథకాలను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలలో సమస్యలకు మూలం కాంగ్రెస్ పార్టీయేనని మోదీ విమర్శించారు.
‘‘ఎవరు అధికారంలో ఉన్న సమయంలో అక్కడ మహాత్మా గాంధీ చిత్రాలను స్కూళ్లు, ఆఫీసుల్లో పెట్టడానికి నిరాకరించారో, ఎవరి హయాంలో అక్కడ జాతీయ గీతాన్ని స్కూళ్లలో పాడటాన్ని అడ్డుకున్నారో, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తిరుగుబాట్లు ఎగిసిపడ్డాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో మిజోరాంపై సైన్యం దాడి చేసిందని, సొంత దేశంపైనే దాడి చేయించిన ఘనత ఆ పార్టీదని మోదీ విమర్శించారు.
ఈశాన్య రాష్ట్రాల ఉద్వేగాలను కాంగ్రెస్ ఎప్పుడూ అర్ధం చేసుకోలేదని ప్రధాని ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
ఆరంభం నుంచి ప్రతిపక్షాలపై విమర్శలు
అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానంలో మోదీ, ఆది నుంచి విపక్షాల వైఖరిని తప్పుబడుతూ వచ్చారు. ప్రతిపక్షాలు ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం తమ ప్రభుత్వానికి మంచిదేనన్నారు.
‘‘ఇప్పుడు మళ్లీ ప్రజల ఆశ్వీర్వాదంతో ఎన్డీయే, బీజేపీ గత రికార్డులను బద్ధలు కొడుతూ తిరిగి ఘన విజయం సాధిస్తాయని ప్రతిపక్షాలకు అర్దమైంది’’ అని మోదీ చెప్పారు.
ఈ అవిశ్వాసం ద్వారా ప్రజల్లోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. ‘‘మీరు ఈ చర్చ ద్వారా ఏం సాధించారు. మీ పక్షాలు చాలా విచారంగా ఉన్నట్లు నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. పార్లమెంటులో విపక్షాలు ఎంత బలంగా ఫీల్డింగ్ చేసినా ఫోర్‌లు, సిక్స్‌లు పోతూనే ఉన్నాయి’’ అన్నారు.
ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, ఏదో ఘోరం జరిగిపోతున్నట్లుగా ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నాయని మోదీ అన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంతో తమ ప్రభుత్వం ఎలాంటి విజయాలు సాధించిందో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్వయంగా వెల్లడించిందని చెప్పారు.
‘‘మోదీ మీ సమాధి తవ్వుతున్నాం’’ అన్నది విపక్షాలకు ఇష్టమైన నినాదమని ప్రధాని అన్నారు. హెచ్‌ఏఎల్, ఎల్ఐసీల విషయంలో విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, కాని ఇప్పుడా రెండూ ఎంతో వృద్ధిలో ఉన్నాయని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ కీర్తిని పెంచుతుంటే, కొందరు మాత్రం ప్రపంచ వేదికలపై దేశం పరువు తీస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు దేశ సైనికుల ధైర్య సాహసాలకన్నా శత్రువుల సామర్ధ్యం మీదనే నమ్మకం ఎక్కువని విమర్శించారు.
ప్రతిపక్షాల దగ్గర ఒక రహస్య శక్తి ఉందన్న మోదీ, ఆ శక్తివల్ల వారు ఎవరిని విమర్శిస్తే వారు అంతగా వెలిగిపోతున్నారని, 2028లో మరోసారి అవిశ్వాస తీర్మానం వస్తుందని తాను భావిస్తున్నానని మోదీ అన్నారు.
బీజేపీలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు.
ఇండియాగా పేరు మార్చుకుంటే తప్ప తమకు అదృష్టం కలిసిరాదని యూపీఏ భావించిందని మోదీ ఎద్దేవా చేశారు. ఒక పాడుబడ్డ వాహనాన్ని తీసుకొచ్చి, అత్యాధునిక ఎలక్ట్రిక్ వెహికల్‌గా చూపేందుకు బెంగళూరు సమావేశంలో యూపీఏ ప్రయత్నించిందన్నారు. ఈ కొత్త కూటమిలో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి అభ్యర్ధేనని విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మణిపుర్‌పై చర్చ ఇంతేనా?
ఒక పక్క ప్రధానమంత్రి ప్రసంగం సాగుతుండగానే, ఇంత వరకు మణిపుర్ గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని కాంగ్రెస్ విమర్శించింది.
‘‘ఇప్పటి వరకు 50 నిమిషాలు గడిచాయి, ఇంత వరకు మణిపుర్ గురించి ఒక్క మాట కూడా లేదు. ఎందుకిలా నరేంద్ర మోదీ’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌తోపాటు పలు విపక్ష పార్టీలు మణిపుర్ అంశం గురించి ప్రధాని మాట్లాడటం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ తర్వాత సాయంత్రం 6.40 గంటలప్పుడు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మణిపుర్ అంశంపై ప్రధానిలో ఏ మాత్రం సీరియస్‌నెస్ కనిపించలేదని కొన్ని విపక్ష పార్టీల సభ్యులు సభ అనంతరం వ్యాఖ్యానించారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ లోక్‌సభ సభ్యులు విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














