మణిపుర్‌: ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో నడిపించిన ఘటనపై దేశం ఎలా రగులుతోంది, సుప్రీం కోర్టు ఏమన్నది?

మణిపుర్ హింస

ఫొటో సోర్స్, Getty Images

మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన భయానక వీడియో బుధవారం బయటకొచ్చింది.

గత రెండున్నర నెలలుగా అక్కడ మెయితెయ్, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మట్లాడారు. మణిపుర్‌లో మహిళల పట్ల జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ తన హృదయం బాధతో నిండిపోయిందని అన్నారు.

ఇలాంటి చర్యలతో దేశాన్ని అవమానిస్తున్నారని, దోషులను వదిలిపెట్టబోమని చెప్పారు. మణిపుర్‌లో జరుగుతోన్న హింసపై ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారి.

మణిపుర్‌ ఘటనలపై మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చాలా కాలంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ మహిళలపై లైంగిక వేధింపులు మే 4వ తేదీన తౌబాల్ జిల్లాలో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘ఈ ఘటన మే 4న జరిగింది. ఇందులో కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి ఆ కోణాల్లోనే దర్యాప్తును ప్రారంభించాం. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం’’ అని మణిపుర్ పోలీసులు చెప్పారు.

దోషులకు ఉరి శిక్ష విధించేందుకు ప్రయత్నిస్తామని మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి, జులై 28ని విచారణ తేదీగా ఖరారు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మణిపుర్ మహిళలు

ఫొటో సోర్స్, parliament

ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి కేంద్రం, ప్రతిపక్ష పార్టీల ప్రముఖ నేతలు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

ఈ విషయంలో అధికార పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రయత్నించాయి.

ఈ అంశంపై మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌తో మాట్లాడానని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమంటూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో భయానకం, అమానవీయమని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మణిపుర్ మహిళలు

ఫొటో సోర్స్, ANI

ఎఫ్‌ఐఆర్‌లో ఏం రాశారు?

కుకీ-జోమీ కమ్యూనిటీకి చెందిన ఈ మహిళలపై మే 4న మెయితెయ్ ఆధిపత్యం ఉండే తౌబల్ జిల్లాలో లైంగిక వేధింపులు జరిగాయని ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.

ఈ లైంగిక వేధింపులపై మే 18వ తేదీన కాంగ్‌పోక్పి జిల్లాలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తర్వాత ఈ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

నిందితులను పట్టుకోవడానికి మణిపుర్ పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారని ఈ ఘటనపై విడుదల చేసిన ఒక ప్రెస్‌నోట్‌లో మణిపుర్ పోలీస్ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి మేఘచంద్ర సింగ్ పేర్కొన్నారు.

వీడియోలో వేధింపులు ఎదుర్కొంటున్న ఒక మహిళ వయసు సుమారు 20ఏళ్లు, మరో మహిళ వయసు 40 ఏళ్లుగా ఉంటుందని చెబుతున్నారు.

బయటకొచ్చిన వీడియోలో ఇద్దరు మహిళలు మాత్రమే కనిపిస్తున్నారని, మరో 50 ఏళ్ల మహిళను కూడా ఆ మూక దుస్తులు విప్పమని బలవంతం చేసిందని తమ ఫిర్యాదులో మహిళలు తెలిపారు.

ఒక యువతిపై పట్టపగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మే 3వ తేదీన 800-1000 మంది వ్యక్తులు ఆధునిక ఆయుధాలతో తౌబాల్ జిల్లాలో ఉన్న తమ గ్రామంపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ వ్యక్తులు ఇళ్లను దోచుకోవడంతో పాటు నిప్పంటించడం మొదలుపెట్టారని చెప్పారు.

పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఇద్దరు మహిళలు, మరో యువతి, ఆ యువతి తండ్రి, సోదరుడితో కలిసి అడవుల్లోకి పరుగులు తీశారు.

ఫిర్యాదు ప్రకారం, ఆ సమయంలో ఈ మహిళలను పోలీసులు రక్షించగలిగారు. వారిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో మూక వారిని అడ్డుకుంది.

తరువాత, ఆందోళనకారులు ఈ మహిళలను పోలీసుల నుంచి లాక్కున్నారు. తర్వాత ఆ యువతి తండ్రిని అక్కడికక్కడే చంపేశారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం, మూక ముందు ఈ ముగ్గురు మహిళలు నగ్నంగా నడవాల్సి వచ్చింది. యువతిని బహిరంగంగా సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె19 ఏళ్ల సోదరుణ్ని కూడా అక్కడే చంపేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

మణిపుర్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

అయిదు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ

ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఈ ఘటనపై ఒక ప్రకటనను విడుదల చేసింది. బాధితుల గుర్తింపును వెల్లడించే వీడియోలను విడుదల చేయడం ద్వారా బాధితుల పట్ల నిందితులు మరింత అమానవీయంగా వ్యవహరించారని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపడతామని మహిళా సంఘం ప్రకటించడంతో లోయలోని అయిదు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూను ప్రకటించింది.

తూర్పు ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్, బిష్ణుపూర్, కక్చింగ్, తౌబాల్ జిల్లాల్లో కర్ఫ్యూను విధించారు. మణిపుర్‌లోని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాగాలాండ్, అస్సాం నుంచి ఇద్దరు ఉన్నతాధికారులను మణిపుర్‌లో సీఆర్‌పీఎఫ్ నియమించినట్లు ఆంగ్ల వార్తా పత్రిక ది హిందూ ఓ వార్తను ప్రచురించింది.

దీనితో పాటు మణిపుర్‌లోని కంగ్‌పోక్పి, జిరాబామ్ జిల్లాల్లో రెండు వ్యూహాత్మక ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంఫాల్‌లో కూడా సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం ఉంది.

ప్రస్తుతం మణిపుర్‌లో రాష్ట్ర పోలీసులతో పాటు సీఏపీఎఫ్‌కు చెందిన 124 కంపెనీలు,184 కాలమ్‌ల సైన్యాన్ని మోహరించారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

స్మృతి ఇరానీ, ప్రతిపక్ష నేతలు ఏం అన్నారు?

మహిళలను నగ్నంగా వీధుల్లో నడిపించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు నేతలంతా ఘాటుగానే స్పందించారు.

కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనాన్ని విమర్శించారు.

“మణిపుర్ మహిళలపై లైంగిక వేధింపుల వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ దారుణమైన హింసాకాండను ఎంతగా ఖండించినా తక్కువే. సమాజంలో పెచ్చరిల్లుతోన్న హింసకు ఎక్కువగా స్త్రీలు, పిల్లలు బాధితులుగా మారాల్సి వస్తోంది. మణిపుర్‌లో జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ ఎందుకు కళ్లు మూసుకొని కూర్చున్నారు. ఇలాంటి ఘటనలు వారిని కలవరపెట్టడం లేదా?’’ అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ మౌనమే మణిపుర్‌లో అరాచకాలకు దారి తీసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

మణిపుర్‌పై దాడి జరుగుతున్న ఈ సమయంలో తమ కొత్త రాజకీయ కూటమి ‘ఇండియా’ చూస్తూ ఊరుకోదని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

మణిపుర్‌లో జరిగిన ఘటన చాలా సిగ్గుచేటు అని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి హేయమైన చర్యలను భారత సమాజంలో సహించలేమని అన్నారు. మణిపుర్‌పై దృష్టి సారించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

‘‘వీడియోలో కనిపిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి. ఇలాంటి నేర స్వభావం ఉన్న వ్యక్తులకు భారతదేశంలో చోటు ఉండకూడదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)