నరేంద్ర మోదీ: అదానీ విషయంలో ప్రధాని మౌనం వెనుక ఆంతర్యమేంటి

మోదీ

ఫొటో సోర్స్, SANSAD TV

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం అనంతరం జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త అదానీతో ఉన్న సంబంధాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యమే అదానీ ఎదుగుదలకు కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు.

అయితే, రాహుల్ ప్రసంగం తరువాత ఆయన మాటల్లో కొంత భాగాన్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాని స్పీకర్ ఆదేశించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేందుకు పార్లమెంటులో ప్రధాని మోదీ లేచి నుల్చోగానే అందరూ చెవులు రిక్కించి విన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తారో అని ఆసక్తిగా చూశారు. లోక్ సభ, రాజ్యసభల్లో గంటన్నరకుపైగా మాట్లాడిన మోదీ తన ప్రసంగంలో ఎక్కడా అదానీ గురించి ప్రస్తావించలేదు.

దీంతో అదానీ విషయంలో ప్రధాని మౌనంపై సామాన్య ప్రజల నుంచి నాయకుల వరకు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తూ.. 'ఒకవేళ ప్రధాని మోదీకి అదాని స్నేహితుడు కానట్లయితే ఆ విషయం చెప్పినా సరిపోయేది. సమాధానం చెప్పరు, విచారణ చేయించరు. ప్రధాని ఆయన్ను కాపాడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా దీనిపై ట్వీట్ చేస్తూ.. 'ఆలోచనాపరులు నాలుగు ప్రశ్నలు అడిగారు. ప్రచారకులు మాత్రం ఒక్క జవాబు కూడా ఇవ్వలేకపోయారు' అన్నారు.

అదానీ విషయంలో రాహుల్ గాంధీ ప్రశ్నలకు మోదీ సమాధానమివ్వలేదన్న అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది దీనిపై వ్యగ్యంగా ట్వీట్ చేశారు. 'అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి, సేల్స్‌మన్ ఆఫ్ ద యియర్ అవార్డ్ గౌరవ ప్రధానికి దక్కుతుంది' అని ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ విషయంపై మోదీ స్పందన ఇలాగే ఉంటుందని తమకు తెలుసని, కానీ, సాధారణ ప్రజల మనసుల్లో మాత్రం అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయని.. తనపై వస్తున్న ఆరోపణలపై మోదీ పార్లమెంటుకు ఎందుకు సమాధానం చెప్పలేదు? అదానీ విషయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? అనే ప్రశ్నలు ప్రజల మనసును తొలిచేస్తున్నాయి అని మోదీ రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు.

బీజేపీ రాజకీయ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే సీనియర్ పాత్రికేయుడు విజయ్ త్రివేది దీనిపై మాట్లాడుతూ రెండు కారణాలు చెప్పారు.

మోదీ మౌనం వెనుక సాంకేతిక, వ్యూహాత్మక కారణాలున్నాయన్నారు త్రివేది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ చేసే ప్రసంగాలలో ప్రధానులు ఎవరైనా తమ ప్రభుత్వ చేస్తున్న పనులను వివరిస్తారు. మోదీ కూడా అలాగే చేశారని త్రివేది అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగంలోని చాలా భాగాన్ని రికార్డుల నుంచి తొలగించారు కాబట్టి సభలో రికార్డు కాని అంశంగా పరిగణించి సాంకేతిక కోణంలో వ్యవహరిస్తూ మోదీ దానిపై మాట్లాడపోయి ఉండొచ్చన్నారు.

అదానీ, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఇక వ్యూహాత్మకంగా చూస్తే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందిస్తే ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతో పట్టించుకోనట్లుగా వదిలేసి ఉండొచ్చన్నారు త్రివేది.

రాహుల్ గాంధీ సభలో మాట్లాడినప్పుడు కూడా ప్రధాని, హోం మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి ఎవరూ అక్కడ లేరని చెప్పారు త్రివేది.

బీజేపీ వ్యూహాత్మకంగానే ఇలా చేసిందా లేదా అనేది చెప్పడం కష్టమే అయినా రాహుల్ గాంధీని తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న సందేశం పంపించారని మాత్రం అర్థమవుతోంది అన్నారు త్రివేది.

లోక్‌సభలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో సీనియర్ జర్నలిస్ట్ నీరజ్ చౌధరి అక్కడే ఉన్నారు.

ప్రధాని దీనిపై ఏదో ఒకటి చెప్తారని అంతా ఎదురుచూశారు. కానీ, బీజేపీ, మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అదానీ ప్రస్తావనే తేలేదు అన్నారు నీరజా చౌధరి.

ఆర్‌బీఐ, సెబీ ఈ విషయంలో చేయాల్సింది చేస్తాయని, అవసరమైన చర్యలు తీసుకుంటాయని బీజేపీ చెప్తోంది. అయితే, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్న ఉద్దేశంలో ప్రధాని దీనిపై సభలో ఏమీ మాట్లాడకపోయి ఉండొచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాధిక రామశేషన్ చెప్పారు.

Rahul Gandhi

ఫొటో సోర్స్, Ani

‘మోదీది ఎన్నికల ప్రసంగం’

మోదీ తన ప్రసంగంలో రైతులు, ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, వంట గ్యాస్, కోవిడ్ వ్యాక్సీన్లు, స్టార్టప్‌లు, హైవేలు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు, జమ్ముకశ్మీర్‌కు.. ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీ పెంచడం వంటి అనేక అంశాలను ప్రస్తావించారు.

ఇదే కాకుండా విపక్షాలపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ద్రవ్యోల్బణం, తీవ్రవాద దాడులు వంటి అన్నిటికీ విపక్షాలే కారణమని ఆరోపించారు.

మోదీ ప్రసంగం తీరు చూసినవారంతా అది ఎన్నికల ప్రసంగం అంటున్నారు. అయితే, విజయ్ త్రివేది మాత్రం మోదీ కొత్తగా చెప్పిందేమీ లేదని.. ఎన్నికల ప్రసంగం కాదని అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

మోదీ మాట్లాడిన ప్రతిసారీ అది ఎన్నికల ప్రసంగంలాగానే ఉంటుందన్నారు విజయ్ త్రివేది. మోదీ కంటే ముందు ప్రధానులుగా ఉన్నవారు సభలో మాట్లాడే తీరుకు మోదీ మాట్లాడే తీరుకు పూర్తిగా తేడా ఉందని ఆయన అన్నారు.

మోదీ తన ప్రసంగంలో కొత్తగా ఏ ప్రకటనా చేయలేదని, కొత్త విషయాలూ చెప్పలేదని.. అలాంటప్పుడు అది ఎన్నికల ప్రసంగమని ఎలా అంటామని విజయ్ త్రివేది అన్నారు.

అయితే, ఏ నాయకులు మాట్లాడుతున్నప్పుడైనా వారి మనసులో ఎన్నికలు ఉంటాయన్నది కాదనలేని సత్యమని కూడా త్రివేది అభిప్రాయపడ్డారు.

మోదీ, బీజేపీ 2024 ఎన్నికల గురించి చింతించడం లేదని... ఆ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం వారిలో ఉందని, అందుకే వారు 2047 గురించి మాట్లాడుతున్నారని అన్నారాయన.

మరోవైపు నీరజ చౌధరి కూడా 2024లో విజయంపై బీజేపీకి ఎలాంటి బెంగా లేదన్నారు.

అదానీ, అశోక్ గహ్లోత్

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్, మోదీ మధ్య ఇమేజ్ యుద్ధం

రాహుల్ గాంధీ ఇటీవలే తన భారత్ జోడో యాత్ర ముగించారు. ఆ తరువాతే ఆయన పార్లమెంటులో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

భారత్ జోడో యాత్ర, పార్లమెంటులో రాహుల్ గాంధీ పవర్‌ఫుల్ ప్రసంగం ఆయన అభిమానుల్లో ఆయనపై రేటింగ్స్‌ను కచ్చితంగా పెంచాయని విజయ్ త్రివేది అన్నారు.

అయితే, ఇది బీజేపీపై కానీ, మోదీ మద్దతుదారులపై కానీ ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రఫేల్ ఒప్పందం, పెగాసస్, ఇప్పడు అదానీ వ్యవహారంపై విపక్షాలు.. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ఈ మూడు అంశాలు కూడా మోదీ ఇమేజ్‌ను దెబ్బతీయలేకపోయాయి అన్నారాయన.

రాహుల్ గాంధీ కానీ విపక్షాలు కానీ ఈ అంశాలను పార్లమెంటులో లేవనెత్తడంతో సరిపెట్టకుండా రోడ్లపై ఆందోళనల రూపంలోకి తేగలిస్తే, అది కూడా నిరంతరం చేయగలితే ఫలితముంటుందని అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

'ఇరుక్కున్న మోదీ ప్రభుత్వం'

మరో సీనియర్ జర్నలిస్ట్ నీరజ చౌధరి అభిప్రాయం వేరేలా ఉంది. అదానీ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ఇరుక్కుందన్నారామె.

తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ అదానీ వ్యవహారమేనని. దీన్నుంచి దూరంగా ఉండడం ద్వారా డామేజ్ కంట్రోల్ చేయాలని ఆయన అనుకుంటున్నారని నీరజ చౌధరి అన్నారు.

ఇప్పటికి తప్పించుకున్నా త్వరలోనైనా, ఇక ముందైనా మోదీ ప్రభుత్వం, బీజేపీ ఈ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాధిక రామశేషన్ అన్నారు.

ఈ గొడవ సంగతి ఎలా ఉన్నా సుదీర్ఘ కాలం తరువాత పార్లమెంటుకు జీవం వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారని నీరజ చౌధరి అన్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)