వరద తీవ్రతను కళ్లకు కడుతున్న ఐదు ఫొటోలు

వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు
    • రచయిత, అహ్మెన్ ఖవాజా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అఫ్గానిస్తాన్‌లో కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన వరదల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయాలు. పలు ఇళ్లు కొట్టుకుపోయాయి.

కొన్ని వారాలుగా అఫ్గానిస్తాన్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఉత్తర అఫ్గానిస్తాన్‌లో కురిసిన ఆకస్మిక భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో 315 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. సుమారు 1,600 మందికి పైగా ఈ వరదల వల్ల గాయపడినట్లు పేర్కొన్నారు.

వరదల తర్వాత ఇంట్లో కూరుకుపోయిన బురద మట్టిని తొలగిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, SAMIULLAH POPAL/EPA-EFE/REX/Shutterstock (14477387q)

ఫొటో క్యాప్షన్, వరదల తర్వాత ఇంట్లో చేరిన బురదను తొలగిస్తున్న వ్యక్తి

భారీ వరదలకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, పశువులు చనిపోయాయని తాలిబాన్ పాలిత రెఫ్యూజీ మినిస్ట్రీ చెప్పింది.

వైద్య సదుపాయాలు, మంచినీరు వంటి కనీస అవసరాలకు సైతం కొందరు స్థానికులు ఇబ్బంది పడుతున్నట్లు సహాయక బృందాలు చెప్పాయి.

అఫ్గానిస్తాన్‌‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లులో బురద మట్టి పేరుకుపోయింది.

2024 మే 11న సమంగాన్ ప్రావిన్స్‌లోని ఫెరోజ్ నాఖ్చిర్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ముంచెత్తిన వరదలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సమంగాన్ ప్రావిన్స్‌లోని ఫెరోజ్ నాఖ్చిర్ జిల్లాలో భారీ వర్షంతో వరదలు వచ్చాయి.

బగ్లాన్ ప్రావిన్స్‌లోని ఐదు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

మృతుల్లో చాలా మంది బోర్కా జిల్లాకు చెందిన వారు.

ఈ జిల్లాలో 200 మందికి పైగా ప్రజలు బయటికి రాలేక ఇళ్లలోనే చిక్కుకుపోయారు.

బదక్షాన్, ఘోర్, హెరత్ ప్రావిన్స్‌లలో తీవ్ర నష్టం జరిగినట్లు పలు రిపోర్టులు వచ్చాయి.

2024 మే 10న బగ్లాన్ ప్రావిన్స్‌లోని నహ్రిన్ జిల్లాలో వరదలు ముంచెత్తిన తర్వాత నది పక్కనే నిల్చున్న అఫ్గాన్ ప్రజలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2024 మే 10న బగ్లాన్ ప్రావిన్స్‌లోని నహ్రిన్ జిల్లాలో వరద దృశ్యం ఇది.

పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచంలో ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశాలలో అఫ్గానిస్తాన్ ఒకటి అని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓచా) పేర్కొంది.

2021 ఆగస్టులో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇతర దేశాల నుంచి అఫ్గాన్‌కు అందే సహాయం, నిధులు చాలావరకు నిలిచిపోయాయి.

2024 మే 12న అఫ్గానిస్తాన్‌లోని బగ్లాన్‌లో ఒక గ్రామంలో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆహారం అందిస్తున్న వాలంటీర్లు

ఫొటో సోర్స్, SAMIULLAH POPAL/EPA-EFE/REX/Shutterstock (14477387f)

ఫొటో క్యాప్షన్, 2024 మే 12న బగ్లాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆహారం అందిస్తున్న వాలంటీర్లు

వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు ఐక్యరాజ్యసమితి, మానవతా ఏజెన్సీలు, ప్రైవేట్ సంస్థలు సాయం చేయాలని తాలిబాన్ ఆర్థికమంత్రి దిన్ మొహమ్మద్ హనిఫ్ కోరారు.

వరదలకు ప్రభావిత జిల్లాల్లో 3,10,000 మంది పిల్లలు నివసిస్తున్నట్లు చారిటీ సేవ్ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)