అనసూయ సేన్‌గుప్తా: కాన్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న ఈమె ఎవరు?

అనసూయ సేన్‌గుప్తా

ఫొటో సోర్స్, @CUP_O_T

ఫొటో క్యాప్షన్, అనసూయ సేన్‌గుప్తా

బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బోజనోవ్ చిత్రం 'ది షేమ్‌లెస్' సినిమాలో నటనకుగాను భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్‌‌సెర్టెన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

దిల్లీలో ఓ బ్రోతల్ హౌస్‌లో ఉండే రేణుక ఒక రాత్రి పోలీసును హత్య చేసి పారిపోయిన కథే ఈ చిత్రం.

ఉత్తర భారతదేశంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో రేణుక ఆశ్రయం పొందుతుంది. అక్కడే ఆమె దేవికను కలుస్తుంది. దేవిక కూడా సెక్స్ వర్కర్‌గా జీవితాన్ని గడుపుతున్న యువతి.

రేణుక, దేవికలిద్దరూ చట్టం, సమాజం నుండి తప్పించుకోవడానికి ఒక ప్రమాదకరమైన మార్గంలో బయలుదేరుతారు. స్వేచ్ఛను పొందడమే వారి లక్ష్యం.

అనసూయ సేన్‌గుప్తా

ఫొటో సోర్స్, @CUP_O_T

ఫొటో క్యాప్షన్, అనసూయ సేన్‌గుప్తా

సెక్స్ వర్కర్ల జీవితాలపై అనేక సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలలో సెక్స్ వర్కర్ల పాత్రలు అనేకం కనిపిస్తాయి.

అలాంటి కథాంశంతో బల్గేరియన్ దర్శకుడు తీసిన చిత్రంలో అద్భుతమైన నటనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అనసూయ సేన్‌గుప్తా గెలుచుకున్నారు.

జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన అనసూయ సేన్‌గుప్తా ది కోల్‌కతా. తాను నటనను వృత్తిగా ఎంచుకోవాలని అనుకోలేదని, జర్నలిజం వైపు వెళ్లాలని భావించానని ఆమె చెప్పారు.

2013లో ముంబయి వచ్చిన ఆమె, సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయడం ప్రారంభించారు.

'మై కోల్‌కతా' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘నా మనసుకు దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్‌లలో సంజీవ్ శర్మ సాత్ ఉచక్కే (2016), శ్రీజిత్ ముఖర్జీ తీసిన 'ఫర్గెట్ మీ నాట్' అనేవి ఉంటాయని చెప్పారు.

తన జీవితంలో అనుకోకుండా అనేక ఘటనలు జరిగాయని అనసూయ చెప్పారు. రేణుక పాత్ర కూడా ఆమెకు అనుకోకుండానే దక్కింది. ఓ ఫ్రెండ్ చేసిన రిక్వెస్ట్ ద్వారా ఆమెకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

అనసూయ సేన్‌గుప్తా

ఫొటో సోర్స్, @CUP_O_T

ఫొటో క్యాప్షన్, అనసూయ సేన్‌గుప్తా

ఫేస్‌బుక్ ఫ్రెండ్ బోజనోవ్ హిందీ సినిమాకు ఆడిషన్ కోసం తనను ఆహ్వానించారని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అనసూయ ఇలా రాశారు. “జూన్ 2020లో, కాన్‌స్టాంటిన్ నాకు మెసేజ్ చేశాడు. తాను తీయబోయే ‘ది షేమ్‌లెస్’ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఆడిషన్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.’’

తననే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావని మొదట కాన్‌స్టాంటిన్‌ను అడిగినట్లు ఆమె చెప్పారు.

అనసూయ తన ఆడిషన్ టేప్‌ని పంపగా, కాన్‌స్టాంటిన్ బోజనోవ్ వెంటనే ఓకే చేసినట్లు ఆమె వెల్లడించారు.

ఈ సినిమా నేపాల్, ముంబయిలలో చిత్రీకరించారు.

అనసూయ సేన్‌గుప్తా

ఫొటో సోర్స్, @CUP_O_T

ఫొటో క్యాప్షన్, అనసూయ సేన్‌గుప్తా

ఈ అవార్డును భారతదేశంలోని క్వీర్ కమ్యూనిటీ( ఎల్జీబీటీక్యూ+)కి అంకితం చేస్తున్నట్లు అనసూయ వెల్లడించారని వెరైటీ మేగజైన్ వెబ్‌సైట్ పేర్కొంది.

“సమానత్వం కోసం పోరాడటానికి మీరు క్వీర్‌ కావాల్సిన అవసరం లేదు. బానిసత్వం బాధాకరమని తెలుసుకోవడానికి బానిసలుగా మారాల్సిన పనిలేదు. మంచి మనుషులుగా ఉంటే చాలు.” ఆమె అన్నట్లు ఈ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)