తొమ్మిది నెలల చిన్నారి హత్య కేసు, తీర్పు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న న్యాయమూర్తులు

ఫొటో సోర్స్, Greater Manchester Police
- రచయిత, మార్క్ వాడ్డింగ్టన్, రేచల్ లజరో,
- హోదా, బీబీసీ న్యూస్
ఇదో విషాద గాథ. ఓ చిన్నారి ముఖాన్ని బీన్‌బ్యాగ్‌కు అదిమిపెట్టి కట్టేయడంతో 9 నెలల పసిపాప ఊపిరాడక మరణించింది. ఈ ఘటనలో చిన్నారుల సంరక్షణను చూసే నర్సరీ వర్కర్‌ను హత్యానేరం కింద కోర్టు దోషిగా తేల్చింది.
ఈ ఘటన స్టాక్‌పోర్ట్ (యూకే)లోని చెడెల్ హల్మేలో ఉన్న టినీటోస్ నర్సరీలో 2022 మే 9న జరిగింది.
ఈ కేసుపై కోర్టులో వాదనలు ముగియడంతో పసిపాప మరణానికి కారణమైన కేట్ రఫ్లీ (37)ని న్యాయస్థానం దోషిగా నిర్థరించింది. ఆమెకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
చనిపోయిన చిన్నారి పేరు జెనెవైవీ మీహాన్. ఈ పాపను నర్సరీలో పనిచేసే కేట్ రఫ్లీ (37) ‘‘మృత్యు ప్రమాదంలోకి’’ నెట్టిందని ప్రాసిక్యూషన్ వాదించింది.
జెనెవైవీ మృతి తమకో మాయని గాయమని కుటుంబసభ్యులు తెలిపారు.
‘‘జెనెవైవీ కోసం మేం ప్రతిరోజూ చింతిస్తాం. అద్భుతమైన ఆమె జీవితాన్ని తన నుంచి లాగేసుకుకున్నారు’’ అని కుటుంబ సభ్యులు విలపించారు.
‘‘జెనెవైవీ కేవలం ఓ పసిపాప కాదు, తనూ ఓ మనిషి. తను నవ్వడానికి ఇష్టపడేది. డప్పుతో ఆడుకునేది. స్పఘెట్టి తినడం, తన అక్కతో కలిసి సయమాన్ని గడపడానికి ఇష్టపడేది తను చాలా ప్రేమగా, కొంటెగా ఉండేది’’ అని గుర్తు చేసుకున్నారు.
నర్సరీలో జెనెవైవీని ‘‘ప్రమాదకరమైన నిద్రా వాతావరణంలో’’ ఉంచడం ఆ చిన్నారి మరణానికి దారితీసిందని విచారణ సందర్భంగా పాథాలజిస్ట్ చెప్పారు.
జెనెవైవీ అస్వస్థతతో ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని బీన్‌బ్యాగ్‌కు అదిమి, ఆపైన కదలకుండా కట్టేసినట్టుగా కోర్టుకు తెలిపారు.
అయితే పిల్లలను నిద్రపుచ్చే గదిలో ఉన్న ఆరు మంచాలు నిండిపోయినప్పుడు పిల్లలను బీన్‌బ్యాగ్‌లో నిద్రపుచ్చడం సాధారణమేనని కేట్ రఫ్లీ కోర్టుకు చెప్పారు. పిల్లలు బీన్‌బ్యాగ్ నుంచి జారిపోకుండా స్ట్రాప్స్ కడతామని తెలిపారు. అవి బిగుతుగా ఉండవని చెప్పారు.
కానీ రప్లీ ఉద్దేశపూర్వకంగానే చిన్నారి చనిపోయేలా చేశారని పీటర్ రైట్ కేసీ తన వాదనల ముగింపు సందర్భంగా కోర్టుకు చెప్పారు.
‘‘ఆ చిన్నారిని బీన్‌బ్యాగ్‌పై బంధించి, కదలకుండా చేశారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Shutterstock
కన్నీళ్లు పెట్టిన జడ్జీలు
ఈ కేసులో హత్యా నేరం కింద కేట్ రఫ్లీని దోషిగా ప్రకటిస్తూ ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళా న్యాయమూర్తులతో కూడిన బృందం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.
కొంతమంది న్యాయమూర్తులు నర్సరీ సీసీటీవీ దృశ్యాలలో జెనెవైవీ కదలకుండా పడి ఉన్న దృశ్యాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘ఆ చిన్నారి బతకడానికి ఎంత పోరాడిందో స్పష్టమవుతోంది’’ రైట్ అన్నారు.
రఫ్లీ చర్యలు చిన్నారి పట్ల సహేతుకంగా లేవని, కల్లోలపరిచేలా ఉన్నాయని మే 5, 6 తేదీల నాటి సీసీటీవీ దృశ్యాలు చూపుతున్నాయి.
చిన్నారితో ఆమె చాలా దురుసుగా వ్యవహరించారని, ఇంటికి పొమ్మని, గట్టిగా అరుస్తూనే ఉంటావా అని చిన్నారికి చెప్పిందని ప్రాసిక్యూషన్ తెలిపింది.
నిందితురాలు తన వాంగ్మూలాన్ని ఇస్తూ సీసీటీవీ ఫుటేజీలో తాను అసహనంగా కనిపించిన విషయం నిజమేనని అంగీకరించారు.
తాను చిన్నారుల కోసం ప్రత్యేకించి జెనెవైవీని ఆడించడానికి పాటలు పాడేదాన్నని, రైమ్స్ తయారు చేసేదాన్నని తెలిపారు.
‘‘జెనెవైవీ జెనెవైవీ నీ అల్లరి ఆపు జెనెవైవీ’’ అంటూ ఓ సందర్భంలో పాడిన పాటను ఆమె కోర్టుకు తెలిపారు.
మరొక దాంట్లో జెనెవైవీ తన వైపు తిరిగినప్పుడు రఫ్లీ ఆమెను ఎత్తుకుని సరిగా కూర్చోవాలి అని చెప్పడం కనిపించింది.
అందులో ఎటువంటి దురుద్దేశం లేదని, కేవలం ఓ సాధారణ వ్యాఖ్యేనని చెప్పారు.
ఆమెకు నర్సరీలో 17 సంవత్సరాల అనుభవం ఉంది. జెనెవైవీని ఇతర పిల్లల్లానే చూశానని, ఎటువంటి తేడా చూపలేదని ఆమె చెప్పారు.
చిన్నారి మరణాన్ని ‘భయంకరమై, అనివార్యమైన ప్రమాదం’గా రఫ్లీ చెప్పారు.
తాను చిన్నారిని హింసించానని, 9 నెలల పసిపాపను తాను ఇష్టపడనని చెప్పడాన్ని ఖండించారు.
తాను టినీ టోస్‌లో పనిచేసినప్పుడు తగినంత సిబ్బంది లేరని రఫ్లీ కోర్టుకు చెప్పారు.

ఫొటో సోర్స్, Google
‘పూర్తి నిర్లక్ష్యం’
తిరిగిరాని జెనెవైవీ గురించి చింతిస్తున్నామని జెనెవైవీ కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమె మరణం పూడ్చలేని లోటు అన్నారు.
తీర్పు వెలువడిన అనంతరం క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ నార్త్ వెస్ట్‌కు చెందిన కరెన్ టోంగే మాట్లాడుతూ జెనెవైవీ జీవితాన్ని క్రూరంగా కుదించేశారని అన్నారు.
జెనెవైవీ పట్ల రఫ్లీ ఎటువంటి శ్రద్ద చూపకపోవడం, ప్రేమగా ఉండకపోవడం సీసీటీవీలో కనిపించిందని ఆమె తెలిపారు.
"కొన్ని వివరించలేని కారణాల వల్ల, కేట్ రఫ్లీకి జెనీవీవ్ పట్ల అయిష్టత కలిగింది, ఇది బహిరంగంగానే అందరూ చూసేలా, వినే విధంగానే ఉంది’’ అని చెప్పారు.
జెనెవైవీ సంరక్షణ బాధ్యతను రఫ్లీకి అప్పచెప్పారు. అంతటి నమ్మకమైన పని అప్పచెప్పినప్పుడు ఓ చిన్నారి జీవితానికి సంబంధించి అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారో అర్థం కాడం లేదని టోంగే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాజీవ్ గాంధీ చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఒక యువతి గంధపు మాల తీసుకుని ఆయన పాదాలను తాకేందుకు వంగగానే..
- ‘మా నాన్న సీఎం’
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- రాజీవ్ గాంధీ మరణానికి కొన్ని గంటల ముందు విశాఖలో ఏం జరిగింది?
- మొహమ్మద్ మోఖ్బర్: ‘సముద్రంలో దిగినా తడవకుండా ఉండే’ నేత ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు, ఆయన ఎవరంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














