'షేప్ ఆఫ్ యూ' ఫేమ్ ఎద్ షీరన్ పంజాబీలో పాడితే థ్రిల్లయిన ముంబయి ఫ్యాన్స్...

ఫొటో సోర్స్, Reuters
'షేప్ ఆఫ్ యూ' పాటతో ప్రపంచవ్యాప్తంగా పాప్ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ఎద్ షీరన్ ముంబయిలో తొలిసారిగా పంజాబీ పాట పాడారు. దాంతో, ఫ్యాన్సంతా కేరింతలు కొట్టారు.
శనివారం ముంబయిలో జరిగిన షోలో ఈ ఇంగ్లిష్ పాప్ స్టార్ భారత గాయకుడు దల్జీత్ దోసాంజ్‌ను స్టేజి మీదకు పిలిచారు. వారిద్దరూ కలిసి దల్జీత్ హిట్ ట్రాక్ 'లవర్..' పాడడంతో ఆడియెన్స్ వెర్రెక్కిపోయారు.
"ఎద్ షీరన్ భాషల సరిహద్దులు దాటతారని మేం ఊహించలేదు" అని ఒక అభిమాని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
మరొకరు, "ఇప్పుడో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది" అన్నారు.
ఇంకొకరరు, "షీరన్ పంజాబీ 'పర్ఫెక్ట్' అన్నారు. పర్ఫెక్ట్ అన్నది షీరన్ విడుదల చేసిన ఒక ఆల్బమ్ కూడా.
పాట కచ్చేరీ ముగిసిన తరువాత ఇద్దరు గాయకులు ఒక వీడియో క్లిప్‌ను తమ ఇన్‌స్టా అకౌంట్లలో షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"దల్జీత్ దోసాంజ్‌తో కలిసి ముంబయిలో మొదటిసారిగా పంజాబీలో పాడాను. అదో అద్భుతమైన అనుభవం. ఇంకా ఇలాంటివెన్నో చేయాలని ఉంది" అని ఎద్ షీరన్ అన్నారు.
దల్జీత్ కుడా తాను షేర్ చేసిన వీడియోతో, "బ్రదర్ తొలిసారి పంజాబీలో పాడుతున్నారు" అని పోస్ట్ చేశారు.
ఇక కామెంట్స్ సెక్షన్లో నటుడు వరుణ్ ధవన్ వంటి వారు ఉత్సాహంతో తమ స్పందనల్ని షేర్ చేశారు. 'గ్లోబల్ డామినేషన్' అంటూ ధవన్ కామెంట్ పోస్ట్ చేశారు.
40 ఏళ్ళ దల్జీత్‌కు దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. పాశ్చాత్య సింగర్‌తో కలిసి పాడడం ఆయనకు ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది ఆయన 'చీప్ థ్రిల్స్' అనే సూపర్ సక్సెస్ పాట పాడిన సియాతో కలిసి హాస్ హాస్ అనే పాట పాడారు. ఆ పాటను వీరిద్దరూ కలిసి రూపొందించారు.
భారతీయ భాషల్లో దల్జీత్ సింగ్ మరోసారి పాపులర్ వెస్టర్న్ సింగర్‌తో కలిసి పాడడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
"అప్పుడు సియా, ఇప్పుడు ఎద్ షీరన్... దల్జీత్ అందర్నీ పంజాబీలో పాడించేలా ఉన్నారు" అని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.
ఎద్ షీరన్ తన కొత్త ఆల్బమ్ ' ఆటమ్ వేరియేషన్స్'ను గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేశారు. ఆసియా, యూరప్ టూర్‌లో భాగంగా ఆయన ముంబయ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నారు..
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








