కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్: ‘సమంతపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా’

ఫొటో సోర్స్, UGC/Samantha/FB
సమంత, నాగార్జున కుటుంబాల గురించి తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలంగాణ అటవీ శాఖమంత్రి కొండా సురేఖ చెప్పారు.
తాను ఏ పరిస్థితినైతే ఎదుర్కొంటున్నానో, తన వ్యాఖ్యల పట్ల సమంత, నాగార్జున కుటుంబానికి అలాంటి పరిస్థితి ఎదురైనట్లు గుర్తించానని ఆమె అన్నారు.
ఒక కుటుంబం గురించి అనుకోకుండా మాట్లాడానని ఆమె వివరణ ఇచ్చారు. నాగార్జున ట్వీట్ చూసిన తర్వాత తాను చాలా బాధ పడ్డానని, అందుకే వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ట్వీట్ చేసినట్లు కొండా సురేఖ చెప్పారు.
మరోవైపు గురువారం సాయంత్రం నటి రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరు వాడుకోవడం ఆపేయాలని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, రాజకీయ వివాదాలు, వివాదాస్పద వ్యవహారాలు, వ్యాఖ్యలకు చాలాకాలంగా దూరంగా ఉంటూ వస్తోంది తెలుగు చలన చిత్ర పరిశ్రమ.
హేమ కమిటీ రిపోర్ట్ మీద కూడా తెలుగు నటీనటులు ఒకరిద్దరు మాత్రమే స్పందించారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు విషయంలోనూ ఇదే జరిగింది.
అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి మూకుమ్మడిగా నిరసన వ్యక్తమైంది. నాగార్జునతో మొదలు పెట్టి ఆయన కుటుంబ సభ్యులంతా కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు.
సమంత కూడా కొండా సురేఖ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
“మహిళగా ఉండటం, బయటకు వచ్చి పని చెయ్యడం మహిళల్ని వస్తువులుగా చూసే గ్లామర్ పరిశ్రమలో నిలదొక్కుకోవడం, ప్రేమలో పడటం, దాని నుంచి బయటపడటం, ఆ తర్వాత కూడా జీవితంలో నిలదొక్కుకునేందుకు పోరాడటం...దీని కోసం చాలా ధైర్యం, శక్తి కావాలి. కొండా సురేఖగారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి దాన్ని చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను అశిస్తున్నాను. నా విడాకులు వ్యక్తిగత వ్యవహారం. దాని గురించి ఊహాగానాలు చెయ్యడం పట్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు దూరంగా ఉండటం వల్ల అపార్ధాలకు దూరంగా ఉండవచ్చు. వివరణ: నా విడాకులు పరస్పర అంగీకారం, అవగాహనతో జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. దయచేసి మీ రాజకీయ వివాదాల్లో నా పేరును దూరంగా ఉంచగలరా? నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అలాగే ఉండాలని అనుకుంటున్నాను- సమంత” అని అందులో రాశారు.

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl
సమంత ఈ పోస్ట్ రాసిన కాసేపటి తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ టాలీవుడ్ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని అమల, నాగ చైతన్య, అఖిల్ అక్కినేని, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ట్వీట్లు చేశారు.
సమంత మాజీ భర్త నాగచైతన్య స్పందిస్తూ, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, మీడియాలో కనిపించడానికి సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
తామిద్దరం పరస్పర అవగాహనతో విడిపోయామని, తన మాజీ భార్య పట్ల, ఆమె కుటుంబం పట్ల తనకున్న గౌరవం కారణంగా తాను ఈ విషయంలో మౌనంగా ఉన్నానని చైతన్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, chaitanya akkineni/X
ఈ వ్యవహారంపై చిరంజీవి స్పందించారు.
“గౌరవ మహిళా మంత్రి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు చూసి చాలా బాధ పడ్డాను. ప్రజల దృష్టి తమ వైపు తిప్పుకునేందుకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను లక్ష్యాలుగా మార్చుకోవడం సిగ్గుచేటు.
చిత్ర పరిశ్రమ సభ్యుల మీద జరిగే ఇలాంటి మాటల దాడులను మేమంతా ఒక్కటై ఎదుర్కొంటాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా మహిళల మీద ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు.
సమాజ అభివృద్ధి కోసం మనం మన నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇతరుల్ని బాధ పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు వాటిని ఉపసంహరించుకుంటారని భావిస్తున్నాను’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సరికాదని నటి, తమిళనాడు బీజేపీ నేత ఖుష్బూ అన్నారు.
“కొండా సురేఖ గారూ, మీకు విలువలు ఉన్నాయని అనుకున్నాను. అవి ఎటు వెళ్లిపోయాయి?’’ అని ఖుష్బూ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
నాగార్జున కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని చూసి తాను షాకయ్యానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఎక్స్’లో స్పందించారు.
ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరూ చెయ్యకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అందులో కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కొండా సురేఖ మీద మరో వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో కించ పరిచే మాటలతో మొదలైన ట్రోలింగ్, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో ఊహించని మలుపు తిరిగింది.
చివరకు, సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ అన్నారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రకుల్‌ప్రీత్ సింగ్ ఏమన్నారంటే..
కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆమె పోస్ట్ చేసిన ఆమె.. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరు వాడుకోవడం ఆపేయాలని కోరారు.
‘ప్రొఫెషనలిజమ్, క్రియేటివిటీకి పేరుగాంచిన అందమైన తెలుగు చిత్ర పరిశ్రమలో నా జర్నీ గొప్పగా సాగింది. ఇప్పటికీ ఆ పరిశ్రమతో నాకు మంచి సంబంధాలున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోని మహిళల గురించి నిరాధారమైన, దుర్మార్గమైన వదంతులు వ్యాప్తి చేయడం బాధాకరం.
బాధ్యాతాయుతంగా ఉండాల్సిన పదవిలో ఉన్న మరో మహిళ ఇదంతా చేస్తుండడం మరింత బాధాకరం.
హుందాగా వ్యవహరించాలనే ఉద్దేశంతో మేం మౌనంగా ఉంటే అది బలహీనతగా భావిస్తున్నారు.
నేను రాజకీయాలకు దూరంగా ఉండే మనిషిని. నాకు ఏ రాజకీయ పార్టీతో/వ్యక్తితో సంబంధం లేదు. తప్పుడు మార్గంలో పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికి నా పేరు వాడుకోవడం ఆపేయాలని కోరుతున్నాను.
కళాకారులు, సృజనాత్మక వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచండి. కల్పిత కథలతో వారి పేర్లను ముడిపెట్టొద్దు’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)