కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్: రాజకీయ వివాదంలో సినిమా హీరోయిన్ల పేర్లు

konda surekha, ktr

ఫొటో సోర్స్, facebook/kondasurekha/ktr

గత ప్రభుత్వంలో కేటీఆర్ కొందరు సినీ తారల ఫోన్లు ట్యాప్ చేయించి, వారి వ్యక్తిగత సంభాషణలు వారికే వినిపించి బెదిరించారని.. ఓ కుటుంబంలో విడాకులకు కేటీఆర్ కారణమయ్యారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి.

సినీ రంగానికి చెందిన పలువురు సురేఖ వ్యాఖ్యలను తప్పు పడుతూ స్పందిస్తున్నారు.

నటుడు ప్రకాశ్ రాజ్ దీనిపై స్పందిస్తూ సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా అని ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కేటీఆర్ లీగల్ నోటీసులు

కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు.

కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకుని, వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టారంటూ కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సురేఖ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు.

‘ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు. నా గౌరవానికి భంగం కలిగించేలా ఆమె మాట్లాడారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె అవాస్తవాలు చెప్పారు. ప్రజలు ఆమె మాటలు నిజమని భావించే ప్రమాదం ఉంది. సురేఖ 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేసి క్రిమినల్ కేసు పెడతాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

తన గౌరవానికి భంగం కలిగించాలన్న ఉద్దేశంతో కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ అన్నారు.

రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఖండించిన హీరో నాగార్జున, నాగచైతన్య, సమంత, అమల

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున ఖండించారు.

రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు.

బాధ్యతగల పదవిలో ఉన్న మహిళగా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సురేఖ వ్యాఖ్యలను నాగచైతన్య ఖండించారు. నాగార్జున ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేశారు.

నాగార్జున భార్య అమల దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు.

రాహుల్ గాంధీ కనుక వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే ఆయన పార్టీకి చెందిన మహిళా నేతతో తన కుటుంబానికి క్షమాపణలు చెప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

samantha insta post

ఫొటో సోర్స్, instagram/samantharuthprabhu

కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు.

సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని ఆమె అన్నారు.

వ్యక్తుల స్వేచ్ఛను గౌరవించాలని కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు.

విడాకులు తమ వ్యక్తిగత వ్యవహారమని, దానిపై ఊహాగానాలు వ్యాపింపచేయడం మానేయాలని కోరారు.

పరస్పర అంగీకారంపై తమ విడాకులు జరిగాయని, ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఆమె అన్నారు.

తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సమంత ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

కొండాసురేఖ

ఫొటో సోర్స్, X(twitter)

ఫొటో క్యాప్షన్, మంత్రి కొండా సురేఖ

వివాదం ఎక్కడ మొదలైంది?

ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లా పర్యటనతో ఈ వివాదం మొదలైంది.

బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు.. మంత్రి కొండా సురేఖ ఇటీవల మెదక్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలను మంత్రికి వివరించి ఆమె మెడలో చేనేత మాల ఒకటి వేశారు.

దీనిపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. అలా ట్రోల్ చేసినవారు బీఆర్ఎస్ వారని.. వారి ప్రొఫైల్ పిక్చర్లలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల ఫొటోలు ఉన్నాయని చెప్తూ ఆ ఇద్దరు నేతల ప్రోద్బలంతో వారు ట్రోల్ చేస్తున్నారన్నట్లుగా ఆమె ఆరోపించారు.

నూలుదండను పరిశీలించడానికి తాను చేతితో పట్టుకున్నానని, మెడలో దండవేస్తే ట్రోలింగ్ చేయడమేంటని ఆమె ప్రశ్నించారు.

తనను మానసికంగా వేధిస్తున్నారంటూ మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేవాళ్లను బీఆర్ఎస్ అదుపుచేయలేదా అని ఆమె ప్రశ్నించారు.

తనపై బీఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తోందని ఆరోపించిన కొండా సురేఖ దీనిపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కొండా సురేఖ మెడలో దండ వేసిన రఘునందన్‌రావు కూడా ఈ ట్రోలింగ్‌పై స్పందించారు.

ఓ తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటానని.. సభ్య సమాజం తల దించుకునేలా ఇలాంటి కామెంట్లు చేయడం తగదని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

మరోవైపు సురేఖపై బీఆర్‌ఎస్ ట్రోలింగ్‌ను నిరసిస్తూ సోమవారం(సెప్టెంబరు 30) తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన జరిపేందుకు ప్రయత్నించారు.

మంగళవారం(అక్టోబరు 1) కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా కొండా సురేఖపై ట్రోలింగ్‌ను బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు ఖండించారు.

మహిళలను గౌరవించడం మనందరి బాధ్యతన్నారు.

కొండాసురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండించిన ఆయన సోషల్ మీడియాలో కూడా ప్రజలు బాధ్యతగా మెలగాలన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

కేటీఆర్

ఫొటో సోర్స్, FB

ఇంతకుముందు కేటీఆర్ ఏమన్నారు

కొండా సురేఖ కంటతడి పెట్టడంపై మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు.

దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికని ప్రశ్నించారు.

కొండాసురేఖపై బీఆర్ఎస్ వాళ్లెవరూ ట్రోలింగ్ చేయలేదన్నారు.

కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత కొండా సురేఖ మరోసారి ఈ వివాదంపై మీడియాతో మాట్లాడారు.

ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

సురేఖ క్షమాపణ చెప్పాలన్న హరీశ్‌

కొండా సురేఖ తాజా వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని ‘ఎక్స్‌’లో డిమాండ్ చేశారు.

వాళ్లు నీపై వ్యక్తిగతంగా దాడి చేశారంటే, వాళ్ల దగ్గర ఒక్క రాజకీయ వాదన కూడా మిగిలిలేదని అర్ధం అని బ్రిటన్ దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హరీశ్ రావు కొండా సురేఖ మాటలను తప్పుపట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)