ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి, మధ్యప్రాచ్యంలో సంక్షోభం - 10 చిత్రాలలో

ఫొటో సోర్స్, Getty Images
మేం చెప్పే వరకు ఎవరూ బయటకు రావద్దంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ పౌరులను హెచ్చరించడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ప్రజలు బాంబ్ షెల్టర్లలో తలదాచుకుంటున్నారు.
ఇంకొందరు తమకు సమీపంలో ఏది సురక్షితం అనుకుంటే అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు.
ఇరాన్ దాడి సమయంలో క్షిపణులు దూసుకొస్తుండగా టెల్ అవీవ్ నగరంలో కొందరు ఇలా ఒక బ్రిడ్జ్ కింద షెల్టర్ తీసుకుని కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ మీదకు ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి పాలస్తీనా భూభాగంలో పడింది.
వెస్ట్ బ్యాంక్‌లోని దురా అనే గ్రామం సమీపంలో పడిన ఆ క్షిపణి శకలాన్ని కొందరు అక్కడి కూడలికి తరలించారు. ప్రజలు దానిని ఆశ్చర్యంగా చూస్తున్న దృశ్యం ఇది.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది.
హిజ్బుల్లా దళాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
సరిహద్దుల్లో రాత్రిపూట ఇజ్రాయెల్ బాంబు దాడి చిత్రం ఇది.


ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ ఇజ్రాయెల్‌లోని గెడెరా పట్టణంలోని ఓ స్కూల్ బిల్డింగ్ మీద మిసైల్ దాడి జరగడంతో అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది.
దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన దళాలు రంగంలోకి దిగి ఈ క్షిపణి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాయి.
స్కూల్ దగ్గర ఏర్పడిన గొయ్యిలోకి దిగి క్షిపణి వివరాల కోసం ఆధారాలను పరిశీలిస్తున్న ఓ అధికారి ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడులతో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు చెబుతున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఫోటోలు చేతిలో పట్టుకుని తెహ్రాన్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
వీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు వారు మద్దతు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బేరూత్ నగరంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.
హిజ్బుల్లా నాయకులను టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ దాడుల్లో అనేక భవనాలు దెబ్బతింటున్నాయి.
దక్షిణ బేరూత్ సబర్బన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ మిసైల్ దాడి తర్వాత కనిపించిన దృశ్యం ఇది.

ఫొటో సోర్స్, Reuters
లెబనాన్‌పై భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ మంగళవారం ప్రకటించింది.
అయితే తాము ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడుతున్నామని హిజ్బుల్లా దళాలు బుధవారం చెప్పాయి.
ఇజ్రాయెలీ రాకెట్ దాడుల కారణంగా బేరూత్ నగరంలోని పలు ప్రాంతాలలో ఇలా పొగలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇటు లెబనాన్, అటు ఇరాన్‌ల నుంచి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా భద్రతాదళాలు పెద్దఎత్తున మోహరించి కాపలా కాస్తున్నాయి.
వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ సైన్యాన్ని దింపింది.
మిలటరీ వాహనంలో గన్ పట్టుకుని అలర్ట్‌గా కనిపిస్తున్న మహిళా జవాన్ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగర గగనతలం బాంబుల మెరుపులతో నిండిపోయింది.
ప్రజలు బయటకు రావద్దని ఐడీఎఫ్ హెచ్చరించడంలో వారంతా షెల్టర్లలోకి వెళ్లి దాక్కున్నారు.
ఇంటర్‌సెప్టర్‌లు చాలా వరకు అడ్డుకున్నా, కొన్ని క్షిపణులు భూమిని తాకినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
టెల్ అవీవ్ నగరంలో రాత్రివేళలో దూసుకొస్తున్న ఓ క్షిపణి ఇలా కెమెరాకు చిక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్‌లోని సిరియా శరణార్ధి శిబిరాలలో ఉంటున్న శరణార్ధులు భయంతో ఉత్తర ప్రాంతంవైపు వెళ్లిపోతున్నారు.
లెబనాన్‌లో ఓ రోడ్డు మీదే కొందరు సిరియా శరణార్దులు షెల్టర్ తీసుకున్నారు. ఆ బృందంలో చిన్నారులూ ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














