‘‘అందరూ గాజా వైపే చూస్తున్నారు, కానీ వెస్ట్ బ్యాంక్‌లో మరో యుద్ధం చెలరేగుతోంది’’

వీడియో క్యాప్షన్, వెస్ట్ బ్యాంక్‌లో ఏం జరుగుతోంది?
‘‘అందరూ గాజా వైపే చూస్తున్నారు, కానీ వెస్ట్ బ్యాంక్‌లో మరో యుద్ధం చెలరేగుతోంది’’

ఓ వైపు పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత విస్తరించవచ్చనే హెచ్చరికలుండగా, మరో వైపు వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితి రోజురోజుకూ అస్థిరంగా తయారవుతుండటం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి.

పాలస్తీనా అథారిటీ వైద్య శాఖ లెక్కల ప్రకారం, గత అక్టోబర్ నుంచి వెస్ట్ బ్యాంక్‌లో 615 మందికి పైగా పాలస్తీనీయులు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, 12 మంది సైనికులు సహా 17 మంది ఇజ్రాయెలీలు కూడా వెస్ట్‌బ్యాంక్‌లో చనిపోయారని యూఎన్ చెబుతోంది.

పాలస్తీనా వైపు మృతుల్లో కొంత మంది సాయుధులు కాగా, అత్యధికులు సామాన్య పౌరులే. తాజాగా పాలస్తీనా కస్టమ్స్ అధికారి ఒకరిని అండర్ కవర్ అధికారులు కాల్చి చంపిన ఘటన సీసీ టీవీలో రికార్డయ్యింది.

వెస్ట్ బ్యాంక్‌లోని టుబాస్ నుంచి బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్‌ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)