ఉత్తరప్రదేశ్: హాథ్‌రస్‌లో సత్సంగ్ కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట, 100 మందికి పైగా మృతి

హాథ్‌రస్‌ సంఘటన

ఫొటో సోర్స్, DHARMENDRA CHAUDHARY

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో సత్సంగ్‌(ఆధ్యాత్మిక కార్యక్రమం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు చనిపోయారు.

ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఆగ్రా జోన్ ఏడీజీ కార్యాలయం మృతుల సంఖ్యను ధ్రువీకరించింది.

అంతకుముందు ఈ ఘటనలో 60 మంది మృతి చెందారని, 18 మంది గాయాలు పాలైనట్లు హాథ్‌రస్‌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నిపుణ్ అగర్వాల్ బీబీసీ ప్రతినిధి దిల్ నవాజ్‌ పాషాకు తెలిపారు.

50 నుంచి 60 మంది వరకు మరణించారని హాథ్‌రస్‌ జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

ఈ సంఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన చర్చకు సమాధానమిచ్చే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బీబీసీ వాట్సాప్ చానల్

అంతకుముందు ఎటా పట్టణ ఎస్ఎస్‌పీ రాజేశ్ కుమార్ సింగ్ ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు మీడియా ప్రతినిధులకు తెలిపారు.

‘‘ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హాథ్‌రస్‌ జిల్లాలోని సికంద్రారావు దగ్గర్లో ఉన్న ముఘల్‌గఢీ గ్రామంలో భోలే బాబాకు చెందిన ఒక కార్యక్రమం జరిగింది. తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారు. ఎటా ఆస్పత్రికి 27 మృతదేహాలు వచ్చాయి. వాటిలో 23 మహిళలకు చెందినవి కాగా, మూడు చిన్నారులవి. ఒకటి మగ వ్యక్తిది. గాయాలు పాలైన వారిని ఇంకా ఆస్పత్రికి తీసుకు రాలేదు.’’ అని ఎస్ఎస్‌పీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.

అయితే, ఎటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ కుమార్ త్రిపాఠి ఇందుకు కాస్త భిన్నమైన సమాచారం ఇచ్చారు.

‘‘ఇప్పటి వరకు పోస్టుమార్టం కోసం 27 మృతదేహాలు వచ్చాయి. వాటిలో 25 మృతదేహాలు మహిళలవి, 2 మృతదేహాలు పురుషులవి. గాయాలు పాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతనే తదుపరి వివరాలు తెలుపుతాం. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆధ్యాత్మిక కార్యక్రమం.’’ అని ఉమేశ్ కుమార్ త్రిపాఠి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

హాథ్‌రస్‌ దుర్ఘటన

ఫొటో సోర్స్, DHARMENDRA CHAUDHARY

హాథ్‌రస్‌ దుర్ఘటనపై యూపీ సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. గాయాలు పాలైన వారికి సరైన చికిత్స అందించేందుకు తక్షణమే వారిని ఆస్పత్రికి తరలించే చర్యలు తీసుకోవాలని, సంఘటన స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ఆగ్రా ఏడీజీ, అలీగఢ్ కమిషనర్ నేతృత్వంలో ప్రమాద కారణాలపై విచారణ జరపాలని యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు.’’ అని యూపీ సీఎం ఆఫీసు ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

హాథ్‌రస్‌ సంఘటన

ఫొటో సోర్స్, DHARMENDRA CHAUDHARY

గాయాలు పాలైన వారిని సికంద్రారావు ట్రామా సెంటర్‌కు తరలించారు.

‘‘ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ కనీసం ఒక్క సీనియర్ అధికారి అందుబాటులో లేరు. ఇక్కడ అంత పెద్ద ప్రొగ్రామ్ నిర్వహించేందుకు భోలే బాబాకు ఎవరు అనుమతి ఇచ్చారు? అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని ట్రామా సెంటర్ వద్దనున్న బాధితుల బంధువుల్లో ఒకరు అన్నట్లు బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ధర్మేంద్ర చౌధరి తెలిపారు.

ట్రామా సెంటర్

ఫొటో సోర్స్, DHARMENDRA CHAUDHARY

ట్రక్కులు, టెంపోలు, అంబులెన్స్‌లలో ట్రామా సెంటర్ వద్దకు గాయాలు పాలైన వారిని, చనిపోయిన వారిని తీసుకొచ్చారు.

ట్రామా సెంటర్ బయట నేలపై మహిళలు మృతదేహాలు పడి ఉన్నాయి. ట్రామా సెంటర్ వెలుపల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన తమ ఆత్మీయుల మృతదేహాల కోసం ప్రజలు ఈ సెంటర్ వద్దకు చేరుకుంటున్నారు.

(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)