రోడ్డు మీద నమాజ్ చేస్తున్న వారిని ఎస్‌ఐ కాలితో తన్నిన వీడియో వైరల్.. దిల్లీలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, SOCIALMEDIA
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారిని ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు మీద చాలా మంది నమాజ్ చేస్తుండగా, ఒక పోలీస్ వచ్చి కాలితో తన్నుతూ వారిని అక్కడ నుంచి వెళ్లమనడం వీడియోలో కనిపిస్తుంది.
పోలీస్ అధికారి తీరును నిరసిస్తూ వెంటనే అక్కడ ఉన్న పలువురు స్థానికులు వాదనకు దిగడం కూడా వీడియోలో చూడొచ్చు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విటర్)లో అనేక మంది ఈ ఘటనను ఖండించారు. నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన తర్వాత మెట్రో స్టేషన్ పరిసరాల్లో ప్రజలు గుమిగూడారు. నిరసనలు చేపట్టారు.
ఇంద్రలోక్ మెట్రో స్టేషన్ బయట సాయంత్రం 6 గంటల తర్వాత క్రమంగా నిరసనలు తగ్గాయి.

ఎస్‌ఐ సస్పెన్షన్
నమాజ్ చేస్తున్న వారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన దిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ తోమర్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ ఘటనకు బాధ్యుడిపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టినట్లు దిల్లీ పోలీస్ విభాగానికి ఒక అధికారి వెల్లడించారు. తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
ఉత్తర దిల్లీ డీసీపీ మనోజ్ కుమార్ మీణా, వార్తాసంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ‘‘ఆ వీడియోను ప్రజలంతా చూశారు. అది వైరల్ అయింది. అందులో కనిపిస్తున్న పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నాం. సస్పెండ్ చేశాం.
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాం. పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడాలంటూ ప్రజల్ని కోరాం. ఇప్పుడు చాలా మంది నిరసన ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ట్రాఫిక్ కూడా తగ్గింది’’ అని చెప్పారు.

ఘటనా స్థలంలోని ప్రజలు ఏమన్నారు?
నమాజ్ చేస్తున్నవారి పట్ల పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వృద్ధుడు మాట్లాడుతూ, ‘‘ఆ పోలీస్ చాలా చెడుగా ప్రవర్తించారు. నమాజ్ చేస్తున్నవారిని కొట్టారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరుగలేదు’’ అన్నారు.
అక్కడే ఉన్న మరో యువకుడు కూడా ఈ ఘటనపై స్పందించారు.
‘‘ఇలా చేసే పోలీసు అధికారులను సస్పెండ్ చేయడానికి బదులుగా శాశ్వతంగా ఉద్యోగంలో నుంచి తీసేయాలి. అలా చేయకపోతే ఆయనను చూసి మరో పోలీస్ కూడా ఇలాగే చేసే అవకాశం ఉంది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలి’’ అని డిమాండ్ చేశారు.

ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్‌గడీ, ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘నమాజ్ చేస్తున్న వ్యక్తుల్ని కాలితో తన్నిన ఈ దిల్లీ పోలీస్ జవానుకు బహుశా మానవత్వం అంటే తెలియదేమో! ఆయన గుండెలో నిండి ఉన్న ద్వేషం ఏంటి? ఈ పోలీస్ అధికారిపై తగిన సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసు శాఖను కోరుతున్నా. ఆయన్ను ఉద్యోగంలో నుంచి తీసేయండి’’ అని ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘(కేంద్ర హోం మంత్రి) అమిత్ షా హయాంలోని దిల్లీ పోలీసుల లక్ష్యం శాంతి, సేవ, న్యాయాన్ని అందించడం. పూర్తి ఏకాగ్రతతో వారు అదే పనిలో ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కావడీలను మోసేవారిపై పోలీసులు పూలు చల్లుతున్న వీడియోను మిస్టర్ హక్ అనే ట్విటర్ వినియోగదారు పోస్ట్ చేస్తూ ఇలా రాశారు.
‘‘భారత్ రెండు ముఖాలు. ఇంద్రలోక్‌లో నమాజ్ చేస్తున్న వారిని కాలితో తన్నిన దిల్లీ పోలీసులు. కావడీ మోసేవారికి రోడ్డు మధ్యలో పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్న పోలీసులు’’ అంటూ వ్యాఖ్యను జోడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘దిల్లీ రోడ్ల మీద నిరంకుశత్వం. దిల్లీ పోలీసులు ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు? ముస్లింల పట్ల ప్రవర్తించినట్లుగా ఇతర మతాల వారితో కూడా ప్రవర్తించగలరా’’ అని జీనల్ ఎన్ గాలా అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘ఇది చూసి కాసేపు నేను షాక్‌కు గురయ్యా. ఇంత నీచత్వాన్ని ఊహించలేదు. ఈ వీడియో ప్రపంచం దృష్టికి వెళితే భారత్ పరువు ఏమవుతుంది? ఇది సిగ్గుచేటు’’ అంటూ అశోక్ కుమార్ పాండే రాసుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
బహిరంగ నమాజ్‌పై వివాదాలు
కొంతకాలంగా రోడ్ల మీద నమాజ్ చేయడంపై వివాదాలు రేగుతున్నాయి.
హరియాణాలోని గురుగ్రామ్‌లో రోడ్ల మీద నమాజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న ప్రజలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
గురుగ్రామ్‌లో నిరుడు బహిరంగంగా నమాజ్ చేయడం గురించి తలెత్తిన వివాదంలో కొందరు ఒక మసీదుపై దాడి చేసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో 26 ఏళ్ల వయస్సున్న ఒక ఇమామ్ మరణించారు. దీని తర్వాత దక్షిణ హరియాణాలో చెలరేగిన మత హింసలో అయిదుగురు చనిపోయారు.
2018లో బహిరంగ నమాజ్‌లకు వ్యతిరేక ప్రదర్శనలు మొదలయ్యాయి. చర్చల తర్వాత, ముస్లింలు నమాజ్ చేసే బహిరంగ స్థలాల సంఖ్యను 108 నుంచి 37కు తగ్గించడానికి రాజీకి వచ్చారు.
ఈ ఏడాది నిరసనలు ఏ కారణంతో మొదలయ్యాయో ఇంకా స్పష్టత లేదు. వివాదాల తర్వాత ముస్లిం సముదాయాలు ఇప్పుడు బహిరంగ నమాజ్ స్థలాల సంఖ్యను 20కి తగ్గించారు.
రాజకీయ ఇస్లాం మీద పరిశోధనలు చేసే హిలాల్ అహ్మద్ ఈ అంశం గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ అతివాద సమూహాలు ఒక సామాజిక సమస్యను మత ఉన్మాదాన్ని వ్యాప్తి చేయడానికి వాడుకుంటున్నాయి. మసీదుల్లోనే ప్రార్థనలు చేయండని అవి ముస్లింలకు చెబుతున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, తగు సంఖ్యలో మసీదులో లేవు.
గురుగ్రామ్‌లో కేవలం 13 మసీదులు ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రమే నగరంలోని కొత్త ఏరియాలో ఉంది. నగరంలోని వలసదారుల్లో ఎక్కువ మంది ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు’’ అని ఆయన వివరించారు.
ముస్లిం ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డు స్థానిక సభ్యుడు జమాలుద్దీన్‌ను బీబీసీ సంప్రదించింది.
‘‘వక్ఫ్ బోర్డు భూముల్లో ఎక్కువ భాగం నగరం వెలుపలి ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ముస్లింల జనాభా చాలా తక్కువ. ఈ ఏరియాల్లోని 19 మసీదుల్ని మూసేశారు. ఎందుకంటే వాటిలో ప్రార్థనలు చేసేంత జనాభా అక్కడ లేరు. గురుగ్రామ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో భూమిని కొనేంత డబ్బు బోర్డు వద్ద లేదు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
- అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)