టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై అఫ్గానిస్తాన్ విజయం - సెమీస్‌కు చేరేదెవరు

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సంచలన విజయం నమోదైంది. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్తాన్ విజయం సాధించించింది. 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది.
గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన అఫ్గానిస్తాన్ ఈసారి సూపర్-8లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించారు.
అయితే, కమిన్స్ హ్యాట్రిక్ ఆస్ట్రేలియాను గెలిపించలేకపోయింది.
టీ 20 ప్రపంచకప్‌లో వరుసగా రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా పాట్ కమిన్స్ నిలిచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.
కమిన్స్ హ్యాట్రిక్, గ్లెన్ మాక్స్ వెల్ పోరాటం ఆస్ట్రేలియా ఓటమిని అడ్డుకోలేకపోయాయి.


ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా కెప్టెన్ మిషెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్నాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది.
అఫ్గాన్ ఓపెనర్లు ఇబ్రహిం జర్దాన్, గుర్బాజ్ మొదటి వికెట్‌కు 118 పరుగులు జోడించారు.
ఆస్ట్రేలియాపై టీ20 ప్రపంచకప్‌లో ఇదో మూడో అత్యధిక స్కోరు.
అఫ్గనిస్తాన్ తరపున గుర్బాజ్ 49 బంతుల్లో 60 పరుగులు చేయగా మరో ఓపెనర్ ఇబ్రహిం జద్రాన్ 51 పరుగులు చేశాడు.
తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆడమ్ జంపా 4 ఓవర్లలో 28 పరుగులకు 2 వికెట్లు, స్టోయిన్స్ ఒక వికెట్ తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
తడబడిన ఆస్ట్రేలియా
అఫ్గానిస్తాన్ చేసిన 148 పరుగులను ఆస్ట్రేలియా అలవోకగా ఛేదిస్తుందని చాలామంది భావించారు.
కానీ అప్గానిస్తాన్ ఎక్కడా పట్టు సడలనివ్వలేదు. ఆరంభం నుంచే దూకుడైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను ముప్పతిప్పలుపెట్టింది.
ఆస్ట్రేలియా ఓపెర్లు ట్రావిడ్ హెడ్ (0), డేవిడ్ వార్నర్ (3) తక్కువ స్కోరుకే అవుటవ్వగా, ఆ వెంటనే వచ్చిన మిషెల్ మార్ష్ కూడా 12 పరుగులే చేయగలిగాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఒక్క గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రమే పోరాడాడు. మ్యాక్స్‌వెల్ 41 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు.
మాక్స్‌వెల్‌ను గుల్బాదిన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైపోయింది.
తరువాత వచ్చిన ఏ బ్యాటరు కూడా పట్టుమని 15 పరుగులు కూడా చేయలేకపోవడంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులే చేసి మొత్తం 10 వికెట్లను సమర్పించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గుల్బాదిన్
ఆస్ట్రేలియాను మట్టికరిపించడంలో కీలకపాత్ర పోషించిన అఫ్గానిస్తాన్ బౌలర్ గుల్బాదిన్ 20 పరుగులకే 4 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఇక మిగిలిన అప్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీయగా, ఒమర్ జాయ్, నబీ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
సెమీస్‌కు ఎవరెవరంటే
గ్రూప్-1లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీ ఫైనల్ రేసులో మిగతా జట్ల కంటే ముందుంది.
ఇదే గ్రూపులోని అఫ్గానిస్త్, ఆస్ట్రేలియాలు కూడా రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. అయితే, అవి ఒక్కో మ్యాచ్ గెలిచాయి.
దీంతో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌లు తమ తదుపరి మ్యాచ్‌లలో సాధించబోయే విజయాలపై వారి సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
భారత్ సోమవారం(జూన్ 24న) ఆస్ట్రేలియాతో తన మూడో సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాకు కూడా ఇదే మూడో సూపర్ 8 మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














