జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్: నేషనల్ అవార్డుల్లో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ హవా

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్

ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు.

‘పుష్ప’ చిత్రంలో అత్యుత్తమ నటనకుగాను ఆయన ‘నేషనల్ బెస్ట్ యాక్టర్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు నటుడు ఆయనే.

కేంద్ర ప్రభుత్వం గురువారం దిల్లీలో 69వ జాతీయ అవార్డులు -2021 ప్రకటించింది.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆధ్వర్యంలో అవార్డులకు అర్హులను ఎంపిక చేస్తారు.

నటన, చిత్రనిర్మాణంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ఏటా ప్రకటిస్తారు.

69వ జాతీయ అవార్డుల్లో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, మరికొన్ని తెలుగు చిత్రాలు గణనీయంగా అవార్డులను గెలుచుకున్నాయి.

2021వ సంవత్సరంలో సర్టిఫికెట్ పొందిన చిత్రాలు, రిలీజైన చిత్రాలను ఈ అవార్డులకు పరిగణనలోకి తీసుకున్నట్లు జ్యూరీ సభ్యులు చెప్పారు.

ఆర్ ఆర్ ఆర్

ఫొటో సోర్స్, facebook/RRR

తెలుగు చిత్రాలకు వచ్చిన అవార్డులు ఇవీ

ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఎంపికయ్యింది.

ఉత్తమ సంగీతం విభాగంలో దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప-పార్ట్ 1, పాటలు), ఎం.ఎం. కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)లు సంయుక్తంగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ విభాగంలో కాలభైరవ (కొమురం భీముడో)కు అవార్డు దక్కింది.

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో వి. శ్రీనివాస్ మోహన్ (ఆర్‌ఆర్‌ఆర్) జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్స్) విభాగంలో కింగ్ సోలోమన్ (ఆర్‌ఆర్‌ఆర్)కు అవార్డు దక్కింది.

బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్) జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

బెస్ట్ లిరిక్స్ విభాగంలో చంద్రబోస్‌కు (కొండపొలం తెలుగు చిత్రంలోని ‘ధం ధం ధం’ పాటకు) అవార్డు దక్కింది.

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు తెలుగు వ్యక్తి అయిన పురుషోత్తమాచార్యులకు దక్కింది.

ప్రాంతీయ చిత్రం కేటగిరీలో తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డు ‘ఉప్పెన’ సినిమాకు దక్కింది.

ఆలియా భట్

ఫొటో సోర్స్, BHANSALI PRODUCTION

జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన ఆలియా భట్, కృతి సనన్

ఉత్తమ నటి కేటగిరిలో ఆలియా భట్ (గంగూబాయ్ కతియావాడి) , కృతీ సనన్‌ (మిమి) సంయుక్తంగా ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రంగా మాధవన్ నటించిన 'రాకెట్రీ- ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)' చిత్రం ఎంపికయ్యింది.

ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (గోదావరి, మరాఠీ చిత్రం)కి అవార్డు దక్కింది.

జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా (నర్గీస్ దత్ అవార్డుకు) ద కశ్మీర్ ఫైల్స్ (హిందీ) ఎంపికయ్యింది.

భవీన్ రబారీ

ఫొటో సోర్స్, CHELLO SHOW,MONSOON FILMS & JUGAAD MOTION PICTURE

ఫొటో క్యాప్షన్, భవీన్ రబారీ

ఇంకా ఎవరెవరికి అవార్డులు దక్కాయి?

ఉత్తమ సహాయ నటుడు- పంకజ్ త్రిపాఠి (మిమి)

ఉత్తమ సహాయ నటి - పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్)

బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్- శ్రేయా ఘోషల్ (మాయవా ఛాయవా పాట)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- భవీన్ రబారీ (ఛెల్లో షో)

బెస్ట్ సినిమాటోగ్రఫీ - అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉదమ్ సింగ్ చిత్రం)

స్పెషల్ జ్యూరీ అవార్డు- షేర్ షా (హిందీ)

సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం- అనునాద్-ది రెసొనెన్స్ (అస్సామీ)

ఉత్తమ బాలల చిత్రం - గాంధీ అండ్ కో (గుజరాతీ)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు- విష్ణు మోహన్, (మెప్పడియాన్ మలయాళం)

నాన్ ఫీచర్ విభాగంలో బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్- కందిత్తున్డు

మొత్తంగా తెలుగు చిత్రాలు ఆర్ఆర్ఆర్ ఆరు అవార్డులు, పుష్ప రెండు అవార్డులు, కొండపొలం ఒక అవార్డు సాధించి రికార్డు నెలకొల్పాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు కూడా వరించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)