సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్ రైడర్స్: పవర్‌హిట్టర్ల పోరులో నెగ్గేదెవ్వరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బోథ్రాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐపీఎల్ 17వ సీజన్ తుది దశకు చేరుకుంది.
నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్-2లో మళ్లీ ఆడుతుంది.
భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌తో పాటు, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో నెగ్గేందుకు వ్యూహాలన్నీ సిద్ధం చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పిచ్?
ఇరు జట్లలోనూ పవర్ హిట్టర్లకు కొదువ లేదు.
కాబట్టి నేటి మ్యాచ్‌లో పరుగులకు, వినోదానికి లోటు ఉండదు.
అయితే, నేటి మ్యాచ్‌లో ఆటగాళ్ల ఎంపిక అనేది పిచ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అహ్మదాబాద్‌లో రెండు పిచ్‌లు ఉన్నాయి.
ఎర్రమట్టితో చేసిన పిచ్ బ్యాటర్లకు అనుకూలం.
ఈ పిచ్ మీద బంతి చక్కగా బౌన్స్ అవ్వడంతో పాటు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.
మొదట బ్యాటింగ్ చేసే జట్టు 200 పరుగులకు పైగా చేయగలదు.
ఈ పిచ్‌మీద గరిష్ట స్కోరు 231 పరుగులు.
ఈ పిచ్ మీద ఛేజింగ్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆటను ఆసక్తికరంగా మార్చాలనుకుంటే ఈ పిచ్ వాడొచ్చు.
కానీ, నల్లమట్టితో చేసిన మరో పిచ్ మీద 165 పరుగులు చేయడం కూడా సవాలే.
స్లోగా ఉండే ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. ఈ పిచ్ మీద బ్యాటర్లు భారీ షాట్లు కొట్టలేరు.

ఫొటో సోర్స్, SPORTSPICS
ముఖాముఖి
ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 26 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి.
కోల్‌కతా 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, సన్‌రైజర్స్ 9 సార్లు నెగ్గింది.
ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 4 పరుగులతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.
నైట్‌రైడర్స్ మీద సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228 పరుగులు, అత్యల్ప స్కోరు 116.
సన్‌రైజర్స్ మీద నైట్‌రైడర్స్ అత్యధిక పరుగులు 208, అత్యల్ప స్కోరు 101.

ఫొటో సోర్స్, SPORTSPICS
బలాబలాల్లో సమవుజ్జీలు
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ రెండు జట్లూ సమంగా పటిష్టంగా ఉండటంతో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం.
ఇంగ్లండ్‌కు వెళ్లిపోయిన ఫిల్ సాల్ట్ స్థానంలో కోల్‌కతా జట్టులోకి అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ గుర్బాజ్ వచ్చాడు.
సునీల్ నరైన్ భయంకర ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్‌లతో కూడిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది.
అలాగే, సన్‌రైజర్స్ జట్టులోనూ నాణ్యమైన పవర్ హిట్లర్లు ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్‌రమ్, నితీశ్‌కుమార్ రెడ్డి, క్లాసెన్, అబ్దుల్ సమద్‌లతో కూడిన హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది.

ఫొటో సోర్స్, Getty Images
గుర్బాజ్ రాకతో పెరిగిన అంచనాలు
నేటి మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తరఫున తొలిసారి రహ్మానుల్లా గుర్బాజ్ ఆడనుండటంతో అంచనాలు పెరిగాయి. అలాగే, ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి నంబర్-3 ఆటగాడిగా బరిలోకి దిగనుండటం హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశం.
ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు సన్‌రైజర్స్ జట్టులో ట్రావిస్ హెడ్ లేడు. ఇప్పుడు ట్రావిస్ హెడ్‌కు నరైన్, వరుణ్ చక్రవర్తి ఎలాంటి బంతులు సంధిస్తారో చూడటం ఆసక్తికరం.

ఫొటో సోర్స్, Getty Images
కమిన్స్-స్టార్క్
సన్‌రైజర్స్ జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్ పాట్ కమిన్స్, కోల్‌కతా జట్టులో మిచెల్ స్టార్క్ ఉండటం మ్యాచ్‌లో ఉత్కంఠను పెంచుతుంది.
వీరే కాకుండా కోల్‌కతా ఫాస్ట్ బౌలింగ్ దళంలో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రసెల్ ఉండగా, హైదరాబాద్ జట్టులో నటరాజన్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డిలతో బ్యాలెన్స్‌డ్‌గా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
నరైన్, వరుణ్ – విజయకాంత్
రెండు జట్లు సమాన స్పిన్ బలంతో బరిలోకి దిగుతున్నాయి.
కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. హైదరాబాద్ జట్టులో విజయకాంత్, షాబాజ్ అహ్మద్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఓవరాల్‌గా చూస్తే ఈ విభాగంలో హైదరాబాద్ కంటే కోల్‌కతా పటిష్టంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంపాక్ట్ ప్లేయర్ కీ రోల్
బ్యాటింగ్ విభాగం బలాన్ని పెంచేందుకు నితీశ్ రాణాను లేదా పిచ్ స్వభావాన్ని బట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్ అంకుల్ రాయ్ లేదా వైభవ్ అరోరాను కోల్‌కతా జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోవచ్చు.
అలాగే, హైదరాబాద్ జట్టు నటరాజన్ లేదా స్పిన్నర్ విజయ్‌కాంత్‌లలో ఒకర్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించవచ్చు.
ఇది కీలక మ్యాచ్ అయినందున ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మార్క్‌రమ్ జట్టులోకి వస్తే షాబాజ్ అహ్మద్ లేదా విజయ్ కాంత్‌కు జట్టులో చోటు దక్కవచ్చు.
మార్క్‌రమ్ రాక జట్టులో బ్యాటింగ్ లైనప్‌ను బలంగా మార్చడంతో పాటు స్పిన్నర్లకు కూడా సహాయకరంగా మారుతుంది. మార్క్‌రమ్ ఆఫ్ స్పిన్నర్.
ముఖ్యంగా కోల్‌కతా జట్టులోని లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్‌పై మార్క్‌రమ్ ఆఫ్ స్పిన్‌తో రాణించగలడు.
ఇదే కాకుండా, జట్టులో లెఫ్టార్మ్ బౌలర్ అవసరం ఉందనుకుంటే జైదేవ్ ఉనాద్కట్‌ను కూడా చేర్చే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
నటరాజన్ ఫామ్
సన్‌రైజర్స్ జట్టులో నటరాజన్ బౌలింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోగా, నటరాజన్ ఒక్కడే అద్భుతంగా రాణించాడు.
నటరాజన్ యార్కర్లు వేయడంలోనే కాకుండా స్లో బౌన్సర్లు, షార్ట్ బాల్స్ సంధించడంలో నైపుణ్యం సాధించాడు. మిడిల్, డెత్ ఓవర్లలో నటరాజన్ బౌలింగ్ నేటి మ్యాచ్‌లో పెద్ద ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, SPORTSPICS
టాస్ ముఖ్యపాత్ర
ఈ రోజు మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది.
ఎర్రమట్టి పిచ్ మీద ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులోని 2 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయాన్ని అందుకుంది. భారీ స్కోరు చేస్తే దాన్ని కాపాడుకోవచ్చు. రాత్రిపూట మంచు ప్రభావం కూడా పెద్దగా ఉండదు.
చేజింగ్ చేస్తూ సన్‌రైజర్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. మిగతా 5 మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసి స్కోరును కాపాడుకొని గెలిచింది.
కాబట్టి సన్‌రైజర్స్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకొని భారీ స్కోరు చేసి దాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ఇదే జట్టుకు కూడా సౌకర్యంగా ఉంటుంది.
చేజింగ్ కంటే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సన్‌రైజర్స్ రన్‌రేట్ 1.07 శాతం ఎక్కువ.
ఈ సీజన్‌లో కోల్‌కతా 3 సార్లు ఛేజింగ్ చేస్తూ నెగ్గింది. 6 సార్లు తమ స్కోరును కాపాడుకుంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ నెగ్గితే, కచ్చితంగా సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయలేదు. కాబట్టి, నేటి మ్యాచ్‌లో ఎవరు టాస్ గెలుస్తారో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
సునీల్ నరైన్-భువనేశ్వర్
ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టుకు ఆల్‌రౌండర్‌గా సునీల్ నరైన్ అద్భుతంగా రాణించాడు. అతను 400కు పైగా పరుగులు సాధించాడు.
ఈ సీజన్‌లో నరైన్-ఫిల్ సాల్ట్ భాగస్వామ్యం జట్టుకు భారీ విజయాలను కట్టబెట్టింది.
మైదానంలో సునీల్ నరైన్ ఉనికి కోల్‌కతాకు సగం విజయాన్ని ఖాయం చేస్తుంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో నరైన్‌ను కట్టడి చేయడానికి సన్‌రైజర్స్ భారీ వ్యూహంతో బరిలో దిగనుంది.
భువనేశ్వర్ స్వింగ్ బౌలింగ్‌తో నరైన్‌ను బోల్తా కొట్టించేందుకు హైదరాబాద్ ప్రయత్నించవచ్చు.
శ్రేయర్, వెంకటేశ్ కూడా స్వింగ్ బౌలింగ్‌లో సమర్థంగా ఆడలేరు. కాబట్టి భువనేశ్వర్‌ను ఈరోజు ట్రంప్ కార్డ్‌గా వాడుకోవచ్చు. భువీ బౌలింగ్‌లోనే శ్రేయస్ అయ్యర్ 3 సార్లు అవుటయ్యాడు. గుర్బాజ్‌ను కూడా రెండు సార్లు అవుట్ చేశాడు. సన్‌రైజర్స్‌కు ఇది కలిసొచ్చే అంశం.

ఫొటో సోర్స్, SPORTSPICS
హెడ్, అభిషేక్‌లను ఎలా నిలువరిస్తారో...
సన్‌రైజర్స్ త్రయం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్‌లు కోల్‌కతాకు పెద్ద తలనొప్పిగా మారొచ్చు. పంజాబ్‌తో మ్యాచ్‌లో హెడ్ డగౌట్ చేరినప్పటికీ, అభిషేక్ ధాటి ఆగలేదు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లపై అభిషేక్ ఏమాత్రం కనికరం లేకుండా ఆడతాడు. నరైన్, వరుణ్ చక్రవర్తిలపై అభిషేక్ బ్యాటింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
మిడిలార్డర్‌లో సన్‌రైజర్స్‌కు క్లాసెన్ మూల స్తంభం. క్లాసెన్‌ను కోల్‌కతా ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. స్పిన్నర్లు, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లను క్లాసెన్ సమర్థంగా ఆడగలడు. కాబట్టి రసెల్‌ను కోల్‌కతా ఆయుధంగా వాడుకుంటుందో చూడాలి. ఎందుకంటే బౌలింగ్‌లో రసెల్ అనేక వైవిధ్యాలను చూపగల సమర్థుడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్‌రౌండర్ రసెల్
కోల్‌కతా జట్టు మిడిలార్డర్‌లో ఆండ్రీ రస్సెల్ కీలకం. అలాగే బౌలింగ్ పరంగానూ అతను ప్రమాదకరం. జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్, బౌలింగ్‌లో రసెల్ వైవిధ్యం చూపగలడు. కోల్‌కతా డెత్ ఓవర్లలో రసెల్ స్ట్రయిక్ రేట్ 185.
అన్ని రకాల బౌలింగ్‌లపై భీకరంగా ఆడే రసెల్, లెగ్ స్పిన్ బౌలింగ్‌లో పెద్దగా స్కోర్ చేయలేదు. ఒకసారి అతను లెగ్‌స్పిన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. రసెల్ కోసం హైదరాబాద్ లెగ్ స్పిన్నర్ విజయ్‌కాంత్‌ను జట్టులోకి తీసుకోనుంది.
ఈ మ్యాచ్‌లో అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే, రెండు జట్లూ అన్ని రంగాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ ఎవరి వైపు మొగ్గుతుందో అంచనా వేయడం చాలా కష్టం.
ఇవి కూడా చదవండి:
- అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే ఏమవుతుంది?
- రాజీవ్ గాంధీ మరణానికి కొన్ని గంటల ముందు విశాఖలో ఏం జరిగింది?
- మొహమ్మద్ మోఖ్బర్: ‘సముద్రంలో దిగినా తడవకుండా ఉండే’ నేత ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు, ఆయన ఎవరంటే..
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














