హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..

 Iran's president Ebrahim Raisi

ఫొటో సోర్స్, Reuters

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది.

వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది.

‘ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించాం. కానీ, పరిస్థితి అంత బాగోలేదు’ అని అంతకుముందు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థకు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ చెప్పారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.

తబ్రిజ్ నగరం ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ రాజధాని.

హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న ప్రాంతానికి సహాయ బృందాలు వెళ్లేందుకు వాతావరణం అనుకూలించక పోవడంతో, తొలుత రెస్క్యూ ఆపరేషన్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి చెందిన విలేఖరి ఒకరు చెప్పారు.

హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం తబ్రిజ్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని చూపుతున్న చిత్రం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని చూపుతున్న డ్రోన్ ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ విడుదల చేసింది

ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆచూకీ వెతకడంలో సాయం చేసేందుకు రష్యా కూడా తన సహాయక బృందాలను పంపించిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.

47 మంది నిపుణులు, హెలికాప్టర్‌, ఇతర సహాయక వాహనాలను పంపినట్లు రష్యా చెప్పింది.

అధ్యక్షుడి కాన్వాయ్‌లో ఉన్న మరో రెండో హెలికాప్టర్లు క్షేమంగా ల్యాండ్ అయ్యాయని తబ్రిజ్ నగరానికి చెందిన ఇరానియన్ ఎంపీ అహ్మద్ అలీరెజాబెగీ చెప్పారు.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడితోపాటు, ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు.

అధ్యక్షుడు క్షేమంగా తిరిగి రావాలని ఆయన స్వస్థలం మషాద్‌లో ప్రజలు ప్రార్ధనలు చేస్తున్న దృశ్యాలు ప్రభుత్వ టీవీ ఛానళ్లలో కనిపించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇరాన్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్

‘హార్డ్ ల్యాండింగ్’ అంటే ఏమిటి?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ‘హార్డ్ ల్యాండింగ్’గా చెబుతోంది.

విమానాలు క్రాష్ అయినప్పుడు జరిగే ప్రమాదాలను చెప్పడానికి రష్యాలోని అధికారులు ‘హార్డ్ ల్యాండింగ్’ అనే పదాన్ని వాడుతుంటారు.

సైనిక విమానాలు ప్రమాదాలకు గురైనప్పుడు రష్యా రక్షణ శాఖ తరచూ ఈ పదాన్ని వాడుతుంటుంది.

2022 జూన్‌లో Il-76 సైనిక కార్గో విమానం రష్యాలోని ర్యాజాన్ ప్రాంతంలో క్రాష్ అయింది. ఆ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అప్పుడు విమానం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, రష్యా మిలటరీ తొలుత ఈ ప్రమాదాన్ని హార్డ్ ల్యాండింగ్‌గా పేర్కొంది.

కలవరపాటును లేదా ఒక్కసారిగా గాబరా వల్ల కలిగే భయాందోళనను తగ్గించేందుకు రష్యా అధికారులు ‘‘క్రాష్’’ అనే పదాన్ని ఎక్కువగా వాడరని నిపుణులు చెప్పారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఎవరు?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ఇస్లామిక్ సంప్రదాయవాది( ఇస్లామిక్ హార్డ్ లైనర్ )గా చెబుతారు. దేశపు అత్యున్నత మత నాయకుడు అయతుల్లా అలీ ఖొమేనీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా పేరుంది.

2021లో జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇరాన్ న్యాయవ్యవస్థకు అధిపతిగా పని చేశారు రైసీ. ఆయన రాజకీయ సిద్ధాంతాలను అతివాత ఇస్లామిక్ వాదంగా పరిగణిస్తారు.

63 సంవత్సరాల రైసీ, పాతికేళ్ల వయసులోనే టెహ్రాన్‌లో డిప్యూటీ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.

2014లో ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్‌గా నియమితుడయ్యే ముందు టెహ్రాన్ ప్రాసిక్యూటర్‌గా, తర్వాత స్టేట్ ఇన్‌స్పెక్టరేట్ ఆర్గనైజేషన్ హెడ్, అలాగే న్యాయవ్యవస్థ మొదటి డిప్యూటీ హెడ్‌గా పనిచేశాడు.

రైసీ 2017లో తొలిసారి అధ్యక్ష పదవికి నిలబడి రెండో స్థానంలో నిలిచి పరిశీలకులను ఆశ్చర్యపరిచారు. 2019లో, అయతుల్లా ఖొమేనీ ఆయన్ను న్యాయశాఖకు అధిపతి పదవిలో నియమించారు.

అతను జూన్ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

వీడియో క్యాప్షన్, హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి మృతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)