ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
1. రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేయండి... వాడుకోగా మిగిలింది అమ్ముకోండి
గృహ వినియోగదారులకు పాతికేళ్ల వరకు పైసా కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా.. ఇంటికి రాయితీపై తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్తు వెలుగులు పంచే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్.
ఈ పథకం ఏమిటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా? పథకం పొందడానికి ఉండాల్సిన నిబంధనలేమిటి? తదితర వివరాలన్నీ తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
2. స్పామ్ కాల్స్: 'హలో... మీకు 5 లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, తీసుకుంటారా?'
"పర్సనల్ లోన్ కావాలా? మంచి ఆఫర్ నడుస్తోంది.." "క్రెడిట్ కార్డు తీసుకోండి.. ఎలాంటి చార్జీలు లేవు.."
"ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి… కొంటారా.. " ఇలాంటి ఫోన్ కాల్స్‌తో విసుగు, చిరాకు వస్తుంటుంది. నెంబర్ బ్లాక్ చేసినా కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి ప్రమోషనల్ కాల్స్‌ను అడ్డుకోవడం ఎలా? పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, ASIF ALI
3. దర్గా ముందు తిండి కోసం ఎదురు చూసే ఈ చిన్నారి మిలియనీర్ ఎలా అయ్యాడు?
చదువుకోవాల్సిన వయసులో షాజెబ్ ఆకలితో వీధుల్లో తిరిగేవాడు. అనాథలా గడిపే అతడి జీవితాన్ని ఒక ఘటన మలుపుతిప్పింది.
ఉత్తరాఖండ్‌లోని ''పిరాన్ కలియర్ షరీఫ్'' దర్గా పరిసరాల్లో షాజెబ్ తిరుగుతూ కనిపించేవాడు. అక్కడి లంగర్‌లో పెట్టే భోజనంతోనే కడుపు నింపుకునేవాడు. అయితే, తను లక్షల రూపాయలకు వారసుడనే సంగతి అతడికి ఏ మాత్రం తెలియదు.
ఇదేదో చందమామ కథలా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం.పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

4. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ లక్షల రూపాయలు సంపాదించొచ్చా...
పొలంలో కూరగాయలు పండించడం కొత్త కాదు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో రామ్‌వీర్ సింగ్ తన మూడు అంతస్తుల ఇంటిలో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. వీటిని ఇంటి లోపలే పెంచుతున్నారు. అది కూడా నేల అవసరం లేకుండా నీటితోనే పండిస్తున్నారు.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
5.తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్... ఎంపిక ఎలా?
తెలంగాణలో గవర్నమెంటు కాలేజీల్లో చదివే వారికి ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాబోతోంది. అవును. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, నెలకు పాతిక వేలకు మించని జీతంతో వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో లాభం ఎంత? భవిష్యత్తు ఏం ఉంటుంది? పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత- మెటాలో ఉద్యోగం కోల్పోయిన భారత యువతి కథ, ఆమె అమెరికా కల ఎలా చెదిరిపోయింది-?
- గర్భం వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు
- ఆంధ్రప్రదేశ్- కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
- వర్క్-ఫ్రమ్-హోమ్ ఉద్యోగులపై నిఘా పెట్టే హెలికాప్టర్ బాస్--లు ఎవరు, ఉద్యోగుల రాజీనామాలకు కారణం వీళ్లేనా-?
- పదో తరగతి పాసయ్యారా.. అయితే ఖర్చులేకుండా రైల్వే జాబ్, ఉపాధి పొందే మార్గం ఇదీ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








