ఫ్రాన్స్: పండ్లు, కూరగాయల ప్లాస్టిక్ ప్యాకింగ్‌పై నిషేధం.. అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని పండ్లు, కూరగాయల ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఫ్రాన్స్ కొత్త సంవత్సరం మొదటి రోజునే దానిని అమల్లోకి తీసుకొచ్చింది.
ప్లాస్టిక్ ప్యాకింగ్‌లో లభించే ఈ 30 రకాల పండ్లు, కూరగాయల్లో కీరదోస, నిమ్మకాయలు, కమలాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వం పెద్ద ప్యాకింగ్‌లు, ముక్కలు చేసిన లేదా ప్రాసెస్ చేసిన పండ్లకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది.
అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్ ఈ నిషేధాన్ని 'నిజమైన విప్లవం'గా వర్ణించారు. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని 2040 కల్లా దశలవారీగా నిర్మూలించాలనే దేశం నిబద్ధతను ఇది చాటుతుందని ఆయన అన్నారు.
ఒక అంచనా ప్రకారం ఫ్రాన్సులో పండుతున్న మొత్తం కూరగాయలు, పండ్లలో మూడో భాగం ఉత్పత్తులను ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు.
తాజా నిషేధంతో ప్రతి ఏటా వీటి ప్యాకింగ్ కోసం ఉపయోగించే వంద కోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అడ్డుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
"ఫ్రాన్స్‌లో ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను విపరీతంగా వాడుతున్నారు. తాజా నిషేధం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలని, వాటికి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని, లేదా రీసైకిల్ ప్యాకేజింగ్ పదార్థాలను ఉపయోగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది" అని కొత్త చట్టంపై విడుదలైన ఒక ప్రకటనలో పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్పింది.
మాక్రాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బహుళ సంవత్సరాల కార్యక్రమంలో ఈ నిషేధం కూడా ఒక భాగం. చాలా పరిశ్రమల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నెమ్మదిగా తగ్గించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు.
2021 నుంచి దేశంలో ప్లాస్టిక్ స్ట్రాలు, కప్పులు, ఇంట్లో వాడే ఇతర ప్లాస్టిక్ పాత్రలు, రెస్టారెంట్లలో టేకవే కోసం ఉపయోగించే పాలీస్టైరీన్ పెట్టెలను కూడా నిషేధించింది.
తర్వాత 2022 నుంచి దేశంలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గించడానికి వీలుగా బహిరంగ ప్రాంతాల్లో నీటి కుళాయిలు ఏర్పాటు చేయబోతోంది.
ఇక నుంచి పత్రికలు, మాగజైన్స్ కూడా ప్లాస్టిక్ రాపింగ్ లేకుండానే ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు కూడా ఇక మీదట ఉచితంగా ప్లాస్టిక్ బొమ్మలు అందించడం కుదరదు.

ఫొటో సోర్స్, Spl
అయితే తాజా నిషేధాన్ని ఇంత త్వరగా అమల్లోకి తీసుకురావడంపై పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"పండ్లు, కూరగాయల ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ఇంత తక్కువ సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల, ప్రత్యామ్నాయాలను పరీక్షించి వాటిని సకాలంలో ఉపయోగించడానికి, ఇప్పటికే ప్యాకేజింగ్‌లో నిల్వ ఉన్న వాటిని సరఫరా చేయడానికి మాకు తగినంత సమయం లేకుండా పోయింది" అని యూరోపియన్ ఫ్రెష్ ప్రొడ్యూస్ అసోసియేషన్‌కు చెందిన ఫిలిప్ బైనార్డ్ అన్నారు.
గ్లాస్గోలో ఇటీవల జరిగిన COP26 సమావేశంలో ఇచ్చిన మాటను నిలుపుకోడానికి గత కొన్ని నెలలుగా చాలా యూరోపియన్ దేశాలు ఇదే తరహా నిషేధాన్ని విధించాయి.
స్పెయిన్ ఈ నెల ప్రారంభంలో వ్యాపారులు ప్రత్యామ్నాయ పరిష్కారాలు వెతుక్కునేలా తాము 2023 నుంచి పండ్లు, కూరగాయలను ప్లాస్టిక్‌తో ప్యాక్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
మాక్రాన్ ప్రభుత్వం దీనితోపాటూ, ఇంకా ఎన్నో పర్యావరణ నిబంధనలను కూడా రూపొందించింది.
పర్యావరణ పరిరక్షణ కోసం నడక, సైక్లింగ్‌ను ప్రోత్సహించేలా కార్ల ప్రకటనలు ఉండాలనేది కూడా వీటిలో ఒకటి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇన్ని కష్టాలా?
- జీరో గురుత్వాకర్షణ శక్తిలో ప్రయాణించిన తొలి వికలాంగ వ్యోమగామి
- అన్నవరం ప్రసాదం ఎందుకంత రుచిగా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
- డిసెంబర్ 31 రాత్రి ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలు చేస్తే కరోనా వ్యాపిస్తుందా
- పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?
- జనవరి 1 నుంచి ఏమేం మారతాయి... మీరేం చేయగలరు, ఏం చేయలేరు?
- మన తాత ముత్తాతలు తిన్న జొన్నలు, సజ్జలు, రాగులు ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ ఎలా అయ్యాయి?
- జొమాటో, స్విగ్గీ ఆర్డర్లపై పన్ను భారం: 5 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయం - ప్రెస్‌రివ్యూ
- జుగాడ్ జీప్: 'లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్. ఆనంద్ మహీంద్రాకు దీన్ని ఇవ్వలేను.. కొత్తది తయారు చేసి ఇస్తా'
- నడి రోడ్డుపైనే ఉమ్మేసే జనం తీరు మారేదెప్పుడు..
- ‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















