జీరో గురుత్వాకర్షణ శక్తిలో ప్రయాణించిన తొలి వికలాంగ వ్యోమగామి

ఫొటో సోర్స్, Al Powers
- రచయిత, బెత్ రోజ్
- హోదా, బీబీసీ ఔచ్
అంతరిక్షయానం చేసేందుకు కొన్ని ప్రత్యేక శారీరక ప్రమాణాలుండాలనే అభిప్రాయాన్ని కొత్త అంతరిక్ష సంస్థ మిషన్ ఆస్ట్రో యాక్సెస్ సవాలు చేస్తోంది. ఈ సంస్థ జీరో గురుత్వాకర్షణ శక్తి ఉన్న విమానంలో తొలిసారిగా వికలాంగులకు ప్రయాణం చేసే అవకాశం కల్పించింది.
"అదొక మాయాజాలంలా అనిపించింది" అని ఈ అంతరిక్షయానంలో పాల్గొన్న శీనా బహ్రామ్ చెప్పారు. ఈ అనుభవం తనకు తొలిసారి కలిగిందని చెప్పారు.
"నాకు నాలుగేళ్లు ఉన్నప్పటి నుంచి అంతరిక్షయానంలో పాల్గొనాలని ఉండేది. కానీ, అది పూర్తిగా అసాధ్యం అనే భావనతోనే ఉండేవాళ్ళం" అని చెప్పారు.
శీనా నార్త్ కరోలినాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. ఆయన అంధుడు. అమెరికాలో జీరో గురుత్వాకర్షణ శక్తి విమాన ప్రయాణ అనుభవాన్ని చేజిక్కించుకునేందుకు మిషన్ ఆస్ట్రో యాక్సెస్ ఎంపిక చేసుకున్న 12 మంది వికలాంగ అంబాసిడర్లలో ఒకరు.
అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా వీరిని ఎంపిక చేసుకున్నారు.
భవిష్యత్తులో షటిళ్ల బయటా లోపలా స్పర్శించగలిగే మార్గాలను ఏర్పర్చవచ్చు. లేదా సమాచారాన్ని అందచేసేందుకు శబ్ధం లేదా ప్రకంపనల సహాయం తీసుకోవచ్చు.
"ఇది మొత్తం అంతరిక్ష వైమానిక రంగానికే ఉపయోగపడుతుంది" అని శీనా చెప్పారు. ఒకసారి వికలాంగులకు అనువుగా ఏర్పాట్లు చేసినప్పుడు, మిగిలిన వారికి కూడా సులభతరమవుతుంది" అని అన్నారు.
ఉదాహరణకు వీల్ చెయిర్లో ఉండే వారికి పేవ్‌మెంట్‌ల ఎత్తు తగ్గించారు. కానీ, ఈ విధానాన్ని ప్రామ్‌లలో పిల్లలను తిప్పే తల్లితండ్రులు కూడా స్వాగతించారు.
ఈ విషయాన్ని వినేందుకు నాసా వ్యోమగామి క్రిస్ హాడ్‌ఫీల్డ్ ఆసక్తిగా ఉండి ఉంటారు.
ఆయన 2001లో అంతరిక్షయానం చేస్తున్న సమయంలో కవచం లోపల క్లీనింగ్ ద్రవం లీక్ అయినప్పుడు కళ్ళకు ఇబ్బంది కలిగి మార్గమధ్యంలో ఏమీ చూడలేకపోయారు.
అదే సమయంలో ఆయనకు స్పర్శ, శబ్ధానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండి ఉంటే అది అంధులకు ఉపయోగపడి ఉండేది. హాడ్‌ఫీల్డ్ కూడా సురక్షితంగా ఉండి ఉండేవారు.
అక్టోబర్‌లో మిషన్ ఆస్ట్రో యాక్సెస్ సిబ్బంది లాంగ్ బీచ్, కాలిఫోర్నియాకు ప్రయాణమయ్యారు. అక్కడ పారాబోలిక్ విమానం కోసం బోయింగ్ 727 ఎక్కారు.
దీనిని ఒక్కొక్కసారి వామిట్ కామెట్ అని పిలుస్తారు. ఈ విమానం భారీ అర్ధ చంద్రాకృతి ఆకారంలో ఎగురుతుంది.
ఈ అర్ధ చంద్రాకృతి ఆకారం వైపు విమానం వంగేటప్పుడు సుమారు 20 సెకండ్ల పాటు బరువు కోల్పోయినట్లుగా అనిపించి తేలికగా అయిపోతుంది.
"వాళ్ళు విమానం తలుపు వేయగానే మునిగిపోతున్నట్లుగా అనిపించింది" అని మేరీ కూపర్ అనే అంబాసిడర్ చెప్పారు. ఆమె అంతరిక్షయానం గురించి చాలా కలలు కన్నారు. కానీ, అది అసాధ్యం అని అనుకున్నారు.
ఆమె స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చదివారు. కానీ, ఆమె పుట్టుకతోనే ఫైబ్యులార్ హెమీమెలియాతో బాధపడుతున్నారు. ఈ జబ్బు వల్ల కాలిలో ఎముక పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఉండదు. ఆమె చిన్నప్పుడే ఎడమ మోకాలు కింద కృత్రిమ కాలును అమర్చుకున్నారు. "ఈ కృత్రిమ కాలు నాకు చాలా ఇష్టమైన వస్తువు" అని అన్నారు.
"విమానం ఆర్క్ పైకి వెళ్ళినప్పుడు గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా మటుమాయమైంది. మొదటిసారి విమానం తేలికైపోయినట్లు అనిపించింది. అదొక అసాధారణమైన అనుభూతి" అని అన్నారు.
"మనం గాలిలో తేలిపోతున్నట్లు కాదు. కిందకు లాగుతున్నట్లుగా అనిపించదు" అని శీనా ఉత్సాహంగా చెప్పారు.
"నేల మీద కూర్చుని ఒక వేలితో లాగుతుంటే, మీరు గాలిలో ఎగురుతున్నట్లుగా ఉంటుంది" అని చెప్పారు.
గురుత్వాకర్షణ శక్తి మాయమైపోతే ఎలా ఉంటుందోనని శీనా ఆలోచించారు.
"అంతా అస్తవ్యస్తంగా మారిపోతుందనుకున్నాను" అని చెప్పారు.
"కానీ, జీరో గురుత్వాకర్షణ శక్తిని అనుభవించడం మొదలుపెట్టగానే నేను సౌకర్యవంతంగా భావించడం మొదలయింది. దాంతో, తక్కువ ఒత్తిడితో, సునాయాసంగా కదలడం మొదలుపెట్టాను" అని చెప్పారు.
వికలాంగులకు కూడా అవకాశం కల్పిస్తూ , అంతరిక్షయానం ముందుకు ఎలా సాగుతుందో పరిశీలించేందుకు సిబ్బందిలో ప్రతీ ఒక్కరు ఎంఐటితో ప్రత్యేకమైన ప్రయోగాల్లో కలిసి పని చేశారు.
శీనా శబ్ధ సంకేతాలను ఆధారంగా చేసుకుని ప్రయాణం చేసేందుకు ప్రయత్నించారు.
"మీకు తెలుసా? వాటిని మనం వినలేం. అవి వాణిజ్య విమానం కంటే చాలా ఎక్కువ శబ్ధం చేస్తాయి. అదొక పాఠం" అని ఆయన అన్నారు.
కానీ, ఊహించని విషయమొకటి చోటు చేసుకుంది.
"పాదాలు నేల మీద పెట్టమని అరిచినప్పుడు, కొంత మంది అంధులకు, దృష్టి లోపం ఉన్నవాళ్ళకి నేల మీదున్న చాపలను కనిపెట్టగలిగాం" అని అన్నారు.
"అది నిజంగా మా లోపల అంతర్గతంగా ఉన్న జ్ఞాపక శక్తికి, భూమి మీద అడుగు పెట్టిన తర్వాత మేము కనుగొనబోయే పరిష్కారాలకు ఒక శాసనం లాంటిది".
శబ్ధ సంకేతాలు విఫలం కావడంతో మరిన్ని చర్చలు జరిగేందుకు దారి తీసింది.
బోన్ కండక్టింగ్ హెడ్ ఫోన్స్‌ను వాడవచ్చా? లేదా ఎవరి శరీరం పైనైనా ఒక పరికరాన్ని అమర్చి ప్రకంపనలను తెలియచేసే ఫీడ్‌బ్యాక్‌ను వాడవచ్చా అనే ప్రశ్న ఉదయించింది.

ఫొటో సోర్స్, Al Powers
మేరీ చేసిన ప్రయోగం వల్ల ఆమె అటూ ఇటూ తిరిగేందుకు అనుమతి లభించింది.
ఆమె క్యాబిన్‌లో కృత్రిమ కాలుతోను, అది లేకుండా కూడా సురక్షితంగా తిరగగలనని నిరూపించాలని అనుకున్నారు.
"నేను ముందు నా కాలిని ఎగిరేందుకు వదిలేశాను. నేను చక్రంలా తిరుగుతూ ఉన్న క్షణాన్ని అనుభవించాను. అదొక అద్భుతమైన అనుభవం" అని చెప్పారు. కృత్రిమ కాళ్ళు అమర్చుకున్నంత మాత్రాన వెనుక ఉండనక్కరలేదని ఆమె నిరూపించారు.
పారాబోలిక్ విమానంలో ప్రయాణం చేసిన తొలి వికలాంగ సిబ్బంది శీనా, మేరీ అయినప్పటికీ.. అందులో ప్రయాణం చేసిన తొలి వ్యక్తులు మాత్రం కాదు.
2007లో స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. అది నిజమైన స్వాతంత్య్రం అని వర్ణించారు.
ఈ ఏడాది సెప్టెంబరులో హేలీ ఆర్సెనాక్స్ కూడా స్పేస్ ఎక్స్ ఇన్స్పిరేషన్ 4 పై ప్రయాణం చేసిన నలుగురు సివిల్ వ్యోమగాముల్లో ఒకరు.
ఆమెకు చిన్న తనంలోనే బోన్ క్యాన్సర్ సోకడంతో తొడ ఎముకలో టైటానియంను అమర్చారు.
మూడవ సారి అంతరిక్షయానం చేయడానికి ముందు మరొక వ్యోమగామి రిచ్‌క్లిఫర్డ్‌కు పార్కిన్సన్ అని తేలింది.
కానీ, ఈ విషయాన్ని బయటపెట్టలేదు.
"నాసా ఎప్పుడూ వైకల్యం ఉన్నవారిని అంతరిక్షయానానికి ఎంపిక చేయలేదు" అని మేరీ చెప్పారు.
వాళ్ళ నిబంధనలు, ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయని అన్నారు.
"ఈ ప్రమాణాలు సురక్షితం కావు" అని శీనా అన్నారు.
నాసా ఈ విధంగా చేయడం వల్ల మానవత్వానికి సేవ చేయలేకపోతోంది. విభిన్నమైన సామర్ధ్యాలున్న వ్యక్తుల సమూహాన్ని చేర్చడం ద్వారా వచ్చే ఫలితాల మొత్తం గొప్పగా ఉంటుంది అని అన్నారు.
నాసా 1950లలో వాషింగ్టన్ గల్లాడెట్ యూనివర్సిటీకి చెందిన 11 మంది బధిరులు, అంధులను ఎంపిక చేసింది. వీరంతా పురుషులే. అందులో చాలా మంది మెనింజైటిస్ సోకి చెవిటివారయ్యారు.
కదలికలకు సంబంధించిన మానసిక, శారీరక అనుభవాలను తెలియచేసేందుకు వారు రకరకాల ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు.
అందులో ఒక ప్రయోగం వారిని నోవాస్కోటియాకు తీసుకుని వెళ్ళింది. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు బాగా జబ్బుపడ్డారు.

ఫొటో సోర్స్, Al Powers
"సామర్ధ్యం" అనే అంశం ఈ పరిశ్రమలో వికలాంగులను తీసుకోవడానికి వెనుకడుగు వేయిస్తోంది" అని అన్నారు.
"శారీరక వైకల్యం ఉన్నవారు మిగిలిన వారి కంటే తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉంటారనే ఆలోచన నాటుకుపోవడంతో వీరి గురించి పెద్దగా చర్చ జరగటం లేదు" అని శీనా అన్నారు. ఈ విధమైన పద్ధతికి స్వస్తి పలకాలని ఆయన అన్నారు.
అందరినీ కలుపుకునేందుకు సరళమైన మార్గాలున్నాయి. వ్యోమగాములు చాలా భాషలు మాట్లాడతారు.
అమెరికా సంజ్ఞల భాషను అందులో ఎందుకు చేర్చకూడదని ప్రశ్నించారు.
ఈ మిషన్ లో పాల్గొనేందుకు కొంత మంది సిబ్బంది సంతకం చేశారు. కానీ, ప్రయాణీకులు పైకి కిందకూ తేలుతూ ఉన్నప్పుడు ఆ పదాలను అర్ధం చేసుకోవడం కష్టంగా మారింది.
కొన్ని పరిష్కారాలను అనధికారికంగా చెప్పారు. ఒక డ్రోన్ లాంటిదేదైనా సంకేతాలను గుర్తించి వాటిని రిసీవర్ పై డిస్ ప్లే చేయవచ్చు.
ఇదొక ఆలోచించాల్సిన విషయం.
వచ్చే సారి మాటలు లేకుండా సమాచారాన్ని గ్రహించేందుకు ఉపయోగించే గైరో స్కోప్ ను శీనా వ్యక్తిగతంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
ఒక ప్రత్యేకమైన దిక్కులో ఏర్పడుతున్న కదలిక గురించి శబ్ధం ప్రకంపనలు తెలియచేస్తాయి.
ఫ్లైట్ సూట్లలో ఈ ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపరిస్తే ఒక్క అంధ వ్యోమగాములకు మాత్రమే కాకుండా అందరికీ మేలు చేకూరుతుందని చెప్పారు.
"మేరీ ఎడమ తొడ ప్రకంపనలు చెందటంతో ఆమెకు కాస్త కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. పైకి చూడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఏదైనా చేయాలని మేరీ ఆలోచిస్తున్నారు.
"ఇవన్నీ అనవసరంగా చేస్తున్నామని భావించడానికి లేదు. వీటిని అమలు చేయడం మనమింకా మొదలుపెట్టలేదు" అని అన్నారు.
ఈ అంతరిక్షయానం పందెంలో మిషన్ యాస్ట్రో యాక్సెస్ ఒక్కటే లేదు. ఈ ఏడాది మొదట్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆరుగురు పారా వ్యోమగాములను, డీసెబిలిటీ ప్రచారకర్త ఎడ్డీ డోపును కూడా అంతరిక్షయానానికి ఆహ్వానించింది.
భూమికి చేరిన మిషన్ యాస్ట్రో యాక్సెస్‌లో ప్రయాణం చేసిన 12 మంది రాయబారులు కూడా భూమిపై జీవించే విధానాన్ని తిరిగి ఆలోచిస్తారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత రంగాల్లో అందరినీ కలుపుకుపోవడం ఎలా అనే విషయం గురించి ఆలోచిస్తారు.
"నిజానికి మాకు చాలా సౌకర్యాలు అవసరం లేదనే విషయం నాకు పదే పదే స్ఫూరణకు వస్తోంది" అని మేరీ చెప్పారు.
"ప్రతీ రోజూ రాత్రి నేను నిద్రపోయే ముందు ఒకేసారి తేలికగా అయిపోయిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేనెప్పటి నుంచో ఈ అనుభవాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నాను".
ఇవి కూడా చదవండి:
- చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాల గురించి భారత్ ఎందుకు ఇబ్బంది పడుతోంది?
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- మైక్ టైసన్: 'ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్'
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











