టీ20 ప్రపంచ కప్‌లో క్రికెటర్లు మోకాళ్లపై ఎందుకు నిలబడుతున్నారు? భారత జట్టుపై విమర్శలు ఎందుకు?

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో క్రికెటర్లు మోకాళ్లపై నిలబడి బ్యాక్‌ లైవ్స్ మ్యాటర్ (బీఎల్‌ఎం) ఉద్యమానికి సంఘీభావం తెలపడంపై కొన్ని రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వస్తున్నాయి.

వెస్టిండీస్‌తో అక్టోబరు 26న జరిగిన మ్యాచ్‌కు ముందుగా, తాను బీఎల్‌ఎం ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ మోకాళ్లపై నిలబడలేనని చెబుతూ దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ విషయంపై ఆ తర్వాత, ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

నిజానికి అంతకు రెండు రోజుల ముందు, అక్టోబరు 24న దుబాయ్‌లో జరిగిన చరిత్రాత్మక భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ముందుగా రెండు జట్లూ మోకాళ్లపై నిలబడి బ్యాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి.

అయితే, ‘‘భారత క్రికెటర్లకు దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు కనబడవా? ఇక్కడ సమస్యలకు ఎందుకు వారు సంఘీభావం తెలపరు?’’అంటూ విమర్శలు వస్తున్నాయి. దళిత్‌లైవ్స్‌మ్యాటర్, ముస్లింలైవ్స్‌మ్యాటర్, ఫార్మర్‌లైవ్స్‌మ్యాటర్ అనే హ్యాష్‌ టాగ్‌లతో పలువురు ట్వీట్లు కూడా చేస్తున్నారు.

దీంతో అసలు మ్యాచ్‌లకు ముందుగా క్రికెటర్లు ఎందుకు ఇలా మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలుపుతున్నారు? ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? ఇదివరకు దీనిచుట్టూ ఏమైనా వివాదాలు రాజుకున్నాయా? అనే అంశాలు చూద్దాం.

అమెరికా ఫుట్‌బాల్ క్రీడాకారుడు కోలిన్ కేపెర్నిక్ జట్టు టేకింగ్ ద నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా ఫుట్‌బాల్ క్రీడాకారుడు కోలిన్ కేపెర్నిక్ జట్టు టేకింగ్ ద నీ

‘‘టేకింగ్ ద నీ’’

మ్యాచ్‌లకు ముందుగా మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలపడాన్ని ‘‘టేకింగ్ ద నీ’’గా పిలుస్తున్నారు. దీన్ని జాత్యహంకారంపై పోరాటానికి ప్రతీకగా స్పోర్ట్స్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఇలా సంఘీభావం తెలపడం కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు. 2020లో జరిగిన ‘‘యూరో 2020 ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్’’లకు ముందుగా చాలా జట్లు ఇలానే సంఘీభావం తెలిపాయి.

టోర్నీ మొత్తం మ్యాచ్‌లకు ముందుగా తమ జట్టు ఇలా మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలుపుతుందని ఆనాడు ఇంగ్లండ్ జట్టు మేనేజర్ గ్యారెథ్ సౌత్‌గేట్ ఓ ప్రకటన కూడా చేశారు.

ఆ తర్వాత స్కాట్లండ్, వేల్స్, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్ చాలాజట్లు ఇలానే సంఘీభావం తెలిపాయి.

చెక్ రిపబ్లిక్‌పై మ్యాచ్‌కు ముందుగా మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలుపుతున్న ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు

ఫొటో సోర్స్, European Press Photo Agency

ఫొటో క్యాప్షన్, చెక్ రిపబ్లిక్‌పై మ్యాచ్‌కు ముందుగా మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలుపుతున్న ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు

ఇది ఎందుకు మొదలైంది?

2020 మే నెలలో అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్ పేరుతో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నిరసనల్లో నల్లజాతీయులకు చాలామంది ప్రముఖులు మద్దతుపలికారు. ఈ నిరసనలను జాత్యహంకారంపై పోరాటంగా పత్రికలు విశ్లేషించాయి.

ప్రస్తుతం క్రికెట్, ఫుట్‌బాల్ జట్లు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకే మోకాళ్లపై నిలబడుతున్నాయి. అయితే, ఈ విషయంపై మొదట్నుంచీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

‘‘దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుంది. నిజానికి మోకాళ్లపై నిలబడి ఒక ఉద్యమానికి సంఘీభావం తెలపడం అనేది సమాజాన్ని విభజించే చర్యగా చూడాలి’’అని బ్రిటన్ మాజీ విద్యా శాఖ మంత్రి జిలియన్ కీగన్ వ్యాఖ్యానించారు.

జాత్యహంకారంపై పోరాటానికి బదులుగా ఈ ప్రచారం వెనకున్న ‘‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’’అనే సంస్థకు ఈ ‘‘టేకింగ్ ద నీ’’ మద్దతు పలికేదిగా ఉందని కూడా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

అయితే, ‘‘మేం రాజకీయంగా మద్దతు తెలుపుతున్నామని కొందరు చెప్పే స్థాయికి నేడు పరిస్థితులు వచ్చాయి. నేను ఈ వాదనను అసలు సమర్థించను. క్రీడాకారులు మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలపడం వెనకున్న కారణం ఇది కాదు. మేం ఒకరికి మరొకరం మద్దతు తెలుపుకుంటున్నాం’’అని గ్యారెథ్ వ్యాఖ్యానించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టు

టోక్యో ఒలింపిక్స్‌లో ఏం జరిగింది?

ఇలాంటి సంఘీభావ చర్యలను తాము అనుమతించబోమని ఒలింపిక్స్ నిర్వహించే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మొదట్లో చెప్పింది.

ప్రదర్శనలు, రాజకీయ, మతపరమైన, జాత్యహంకారానికి సంబంధించి ప్రచారాలకు ఒలింపిక్స్ వేదిక కాకూడదని ఒలింపిక్స్ చార్టర్‌లోని రూల్ 50 చెబుతోందని ఐవోసీ వివరించింది.

అయితే, ఈ ఆంక్షలను తర్వాత ఎత్తివేశారు. దీంతో ఈవెంట్స్ జరిగే ముందు, అవి పూర్తైన తర్వాత మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలిపేందుకు వీలుపడింది.

అయితే, ఈవెంట్లు జరిగేటప్పుడు, పతకాలు ప్రదానం చేసేటప్పుడు, ఒలింపిక్స్ విలేజ్‌లో ఇలాంటి చర్యలకు అనుమతించబోమని ఐవోసీ వివరించింది.

ఐవోసీ నిబంధనలకు అనుగుణంగా, బ్రిటన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు ప్రతి మ్యాచ్‌కు ముందుగా మోకాళ్లపై నిలబడి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావం తెలిపింది.

చిలీ, జపాన్ మహిళల ఫుట్‌బాల్ జట్లు కూడా ఇలానే మద్దతు తెలిపాయి. కోస్టారికా జిమ్నాస్ట్ లూసియానా ఆల్వరాడో కూడా ఇలా మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలిపారు.

అలబామాలో కౌర్ట్‌హౌస్ ఎదుట మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలోని పౌరహక్కుల కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలబామాలో కౌర్ట్‌హౌస్ ఎదుట మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలోని పౌరహక్కుల కార్యకర్తలు

చరిత్రలో ఏం జరిగిందంటే..

భిన్న అంశాలకు క్రీడాకారులు సంఘీభావం తెలపడం ఇదేమీ కొత్తకాదు. చాలాఏళ్ల నుంచీ క్రీడాకారులు ఇలా మోకాళ్లపై నిలబడి లేదా చేతులు పైకెత్తి తమ సంఘీభావం తెలుపుతున్నారు.

1968లో మెక్సికో ఒలింపిక్స్ సమయంలో స్వర్ణ, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్లు టామీ స్మిత్, జాన్ కార్లోస్ పోడియంపై నిలబడి చేతులు పైకెత్తి సెల్యూట్ చేశారు. ‘‘బ్లాక్ పవర్’’కు ప్రతీకగా తాము ఇలా సెల్యూట్ చేసినట్లు వారు తెలిపారు.

1996లో అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడేందుకు నిరాకరించారు. అమెరికా జెండా అణచివేతకు ప్రతీక అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

2014లో న్యూయార్క్‌లో పోలీస్ అధికారులు బలంగా మెడను నొక్కి పట్టుకోవడంతో ‘‘ఎరిక్ గార్నర్’’ అనే వ్యక్తి మరణించారు. చనిపోయే ముందు, ‘‘నేను ఊపిరి తీసుకోలేక పోతున్నాను (ఐ కాంట్ బ్రీత్)’’అని ఆయన పదేపదే చెప్పారు. అదే ఏడాది అమెరికాలో జరిగిన బాస్కెట్‌బాల్ పోటీల్లో లీబ్రాన్ జేమ్స్, ఇతర క్రీడాకారులు ‘‘ఐ కాంట్ బ్రీత్’’అని రాసివున్న టీషర్టులతో మ్యాచ్‌లు ఆడారు.

అమెరికా ఫుట్‌బాల్ క్రీడాకారుడు కోలిన్ కేపెర్నిక్ అయితే, 2016లో జాతీయ గీతం పాడేటప్పుడు మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలిపారు. నల్లజాతీయులను అణచివేసే దేశంలో జెండా ఎగవేస్తున్నప్పుడు గర్వంతో తలెత్తుకు నిలబడలేనని, అందుకే ఇలా మోకాళ్లపై నిలబడ్డానని ఆయన వ్యాఖ్యానించారు.

1965లో పౌర హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టినందుకు అరెస్టు చేయడంపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలోని పౌరహక్కుల కార్యకర్తలు ఇలానే మోకాళ్లపై నిలబడి పౌర హక్కులకు సంఘీభావం తెలిపారు.

జులైలో దక్షిణాఫ్రికా జట్టు మోకాలిపై నిలబడినప్పుడు ఎడమవైపు విడిగా నిలబడిన డికాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులైలో దక్షిణాఫ్రికా జట్టు మోకాలిపై నిలబడినప్పుడు ఎడమవైపు విడిగా నిలబడిన డికాక్

ఇప్పుడు తప్పనిసరా?

దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ విషయానికి వస్తే, తమ జట్టులోని క్రికెటర్లు అందరూ మోకాళ్లపై నిలబడి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) ఉద్యమానికి సంఘీభావం తెలపాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్‌ఏ) ఆదేశాలు జారీచేసింది.

‘‘సామాజిక సమానత్వానికి మద్దతుగా మూడు పద్ధతుల్లో క్రీడాకారులు సంఘీభావం తెలపొచ్చు. మోకాళ్లపై నిలబడొచ్చు. చేయి పైకి ఎత్తొచ్చు. లేదా సావధానంగా నిలబడి సంఘీభావం తెలపొచ్చు’’అని గత నవంబరులో సీఎస్ఏ తెలిపింది.

సీఎస్‌ఏ నిర్ణయంతో విభేదిస్తూ.. క్వింటన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. గత జులైలోనూ వెస్టిండీస్‌తో ఓ మ్యాచ్‌ జరిగేటప్పుడు సంఘీభావం తెలిపే సమయంలో రెండు చేతులు వెనక్కి పెట్టుకుని డికాక్ నిలబడ్డారు.

‘‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రతి ఒక్కరికీ వారికి అభిప్రాయాలు ఉంటాయి. ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడీ చేయకూడదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే, తాజా విషయంపై డికాక్ క్షమాపణలు చెప్పారు. ‘‘నా జట్టులోని సభ్యులు, ఫ్యాన్స్‌కు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను జాత్యహంకారిని కాదు. ఇకపై మ్యాచ్‌లకు ముందుగా, నేను సంఘీభావంగా మోకాళ్లపై నిలబడతాను’’అని ఆయన వివరణ ఇచ్చారు.

విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

భారత జట్టుపై విమర్శలు ఎందుకు?

దేశంలో సమస్యలను పట్టించుకోకుండా బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్ (బీఎల్‌ఎం) ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారంటూ భారత క్రికెటర్లను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

‘‘దళితులు, ముస్లింలు, రైతుల గురించి మాట్లాడని క్రికెటర్లు బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. ఇదే హిపోక్రసీ’’అంటూ రచయిత డాక్టర్ మీనా కందసామి వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఓడిపోయిన 11 మంది భారత క్రికెటర్ల జట్టులో మహమ్మద్ షమీ ఒకరు. ఆయన ఒక్కరే ఏమీ ఆడలేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీ జట్టులోని సభ్యుడికి మద్దతు తెలపకుండా.. బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి ఏం ప్రయోజనం?’’అని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘బ్యాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం గురించి భారత జట్టు మోకాలిపై నిలబడటం చూస్తుంటే నవ్వొస్తుంది. వీరు భారత్‌లో కుల వ్యవస్థ గురించి ఏమైనా మాట్లాడగలరా? ఇదే హిపోక్రసీ అంటే’’అని ఆజాద్ సమాజ్ పార్టీ అధికార ప్రతినిధి సూరజ్ కుమార్ బౌద్ధ్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఒక్కసారిగా బ్యాక్‌ లైవ్స్ మ్యాటర్‌కు ఎందుకు సంఘీభావం తెలిపారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇలా సంఘీభావం తెలపడం మంచిదే. మరి వాటి సంగతేంటి... సరే వదిలేయండి... ’’అని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

‘‘ఆఫ్రికా క్రీడాకారులను కాలూ అంటూ పిలిచి అవమానించిన క్రీడాకారులు బీఎల్‌ఎం ఉద్యమానికి మద్దతుగా మోకాలిపై నిలబడ్డారు. ఇది హైపర్ హిపోక్రసీ’’అని మిషన్ అంబేడ్కర్ అనే ట్విటర్ హ్యాండిల్ ఓ ట్వీట్ చేసింది. క్రష్‌దకాస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్వీట్‌కు జతచేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

‘‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. మరి ఎప్పుడైనా దళిత్ లైవ్స్ మ్యాటర్ గురించి మీరు మాట్లాడారా? మీరు కులం పేరుతో జరిగే అరాచకాల గురించి ఎందుకు మాట్లాడరు? ఇది కోహ్లీ జట్టు హిపోక్రసీనే’’అంటూ జర్నలిస్టు సుమిత్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

భారత్-పాక్

ఫొటో సోర్స్, Getty Images

‘‘సొంత దేశంలో ముస్లింలపై అరాచకాల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని వారు బీఎల్‌ఎంకు మద్దతు తెలిపేందుకు మోకాలిపై నిలబడ్డారు’’అని జర్నలిస్టు రిఫాత్ జావైద్ ట్వీట్‌చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్‌కు మద్దతుగా మోకాలిపై నిలబడి సంఘీభావం తెలపడం గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం తెలియదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

‘‘మాకు కొన్ని నిమిషాల ముందే మేనేజ్‌మెంట్ సమాచారం ఇచ్చింది. అంతకుముందే, పాకిస్తాన్ జట్టు సంఘీభావం తెలిపింది. దీంతో మేం కూడా అంగీకరించాం’’అని కోహ్లీ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)