‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బుమ్రా, భువనేశ్వర్ కూడా రాణించలేదు.. మరి మొహమ్మద్ షమీనే ఎందుకు టార్గెట్ చేశారు?’ - షమీ స్వగ్రామం సహస్‌పూర్ అలీనగర్ గ్రామస్థులు

ఫొటో సోర్స్, twitter/BCCI
- రచయిత, షాబాజ్ అన్వర్
- హోదా, బీబీసీ కోసం
"ఇదొక ఆట. గెలుపు ఓటములు సహజం. ఏ ఆటగాడైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. భారత జట్టులోని ఆటగాళ్లందరూ గొప్పవాళ్లే. మొహమ్మద్ షమీ కూడా గొప్ప ఆటగాడే. ఒకరిపైన బురదచల్లడం సరైందికాదు" అని ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సహస్‌పూర్ అలీనగర్ గ్రామానికి చెందిన శోభరామ్ అన్నారు.
మొహమ్మద్ షమీ కుటుంబం నివసించే సహస్‌పూర్ అలీనగర్ గ్రామానికి చెందిన శోభరామ్ వృత్తిరీత్యా రైతు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి మొహమ్మద్ షమీపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
చాలా మంది షమీని ఎన్నో రకాలుగా టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రాజకీయంగా చర్చ కూడా మొదలైంది.
పాక్ గెలుపుతో షమీపై ట్రోల్స్
ఆదివారం భారత్-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 10వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.
అప్పటి నుంచి షమీని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
చాలా మంది షమీకి అండగా నిలుస్తున్నారు.
"నేను వ్యవసాయం చేస్తాను. కానీ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు, టీవీ ముందే ఉన్నాను. భారతదేశం బాగా ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ వంతు వచ్చినప్పుడు, మనం గెలిచే అవకాశం లేదని భావించాను. కాబట్టి నేను టీవీని ఆఫ్ చేశాను" అని శోభరామ్ అన్నారు.
అయితే, మొహమ్మద్ షమీని ట్రోల్ చేయడంతో శోభరామ్ విచారంగా కనిపించారు.

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC
‘షమీని టార్గెట్ చేయడం సరికాదు’
మొహమ్మద్ షమీ పేలవమైన ప్రదర్శనపై మొరాదాబాద్‌లోని హిందూ కళాశాల ప్రతినిధి డాక్టర్ రాకేష్ నిరాశ చెందారు. అయితే ఆయన షమీని మాత్రమే బాధ్యులను చేయలేదు.
"షమీని టార్గెట్ చేయడం సరికాదు. ఒక మ్యాచ్‌లో జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. కాబట్టి ఒక క్రికెటర్‌ను మాత్రమే నిందిస్తే, మిగిలిన 10 మంది క్రికెటర్లు ఏం చేస్తున్నట్టు. ఇరువురు పోటీపడే ఆటల్లో ఇలాంటి ఆరోపణలు సహజం, కానీ జట్టుగా ఆడే క్రీడల్లో ఇటువంటి ఆరోపణలు సరైనవి కాదు".
ఇలా ట్రోలింగ్ చేయడం వల్ల ఆటగాళ్ల మనోధైర్యం దెబ్బతింటుందని డాక్టర్ రాకేష్ అభిప్రాయపడ్డారు.
గ్రామంలో నివసించే మహ్మద్ జైద్, క్రికెటర్ షమీకి వరుసకు సోదరుడు. "క్రికెట్‌లో ఓడిపోవడం, గెలవడం రెండు వేర్వేరు అంశాలు. ఒకే రోజు ఆటతీరుతో మనం ఎవరినీ అంచనా వేయలేము. షమీ భాయ్ ఇంతకుముందు 2019లో జరిగిన మ్యాచ్‌లో బాగా రాణించాడు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC
షమీని ట్రోల్ చేయడంపై నిరసన
"చూడండి, కొంతమంది గాంధీజీని కూడా వేలెత్తి చూపుతారు, వారిని అలాగే అననివ్వండి. షమీ భాయ్‌ను ట్రోల్ చేయడంపై చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు" అని మొహమ్మద్ జైద్ అన్నారు.
జైద్ న్యాయ విద్యార్థి, క్రికెట్ అభిమాని కూడా.
"పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీతోపాటూ బుమ్రా, భువనేశ్వర్ కూడా రాణించలేకపోయారు. ఎవరినీ టార్గెట్ చేయడం సరికాదు. ఆటగాళ్లందరూ దేశానికి చెందినవారు. దేశం కోసం ఆడుతున్నారు. కొన్నిసార్లు ప్రదర్శన బాగా లేనంత మాత్రాన, ఎవరినైనా ట్రోల్ చేస్తామా?" అని గ్రామ పెద్ద ఛోటీ బేగం కుమారుడు మన్నన్ తెలిపారు.
షమీని అభిమానించే వారిలో గ్రామ పెద్ద జగ్రామ్ సింగ్ కూడా ఒకరు. "షమీకి ఊరంతా ఫ్యాన్స్ ఉన్నారు. మన ఊరి అబ్బాయి ఊరికి, జిల్లాకే కాదు, యావత్ దేశానికే కీర్తిని తెచ్చిపెట్టాడు. క్రికెట్‌లో హిందువులు ముస్లింలు అనే మత తారతమ్యాలు ఉండకూడదు. షమీని ట్రోల్ చేయడం భావ్యం కాదు"
ఈ వ్యవహారం రాజకీయ ప్రేరేపితమని కూడా అన్నారు.

ఫొటో సోర్స్, Shahbaz Anwar/BBC
సహస్‌పూర్ అలీనగర్‌లోనే షమీ కుటుంబం
సహస్‌పూర్ అలీనగర్ గ్రామం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా పరిధిలోని జోయాలో ఉంది. షమీ కుటుంబం ఇప్పటికీ ఈ గ్రామంలోనే నివసిస్తోంది.
"షమీ చిన్నప్పటి నుంచి అద్భుతమైన ఆటగాడు. ఆయన ఆట ఊరి నుంచే మొదలైంది. ఇప్పటికీ గ్రామంలో శ్మశాన వాటికకు సమీపంలోనే మైదానం ఉంది. షమీ తరచూ క్రికెట్ ఆడేవాడు. ఆయన బౌలింగ్ చూడటానికి అన్ని గ్రామాల నుండి ప్రజలు అక్కడికి వచ్చేవారు" అని గ్రామానికి చెందిన అబ్దుల్ మన్నన్ పేర్కొన్నారు.
క్రికెటర్ మొహమ్మద్ షమీ గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌లో హిందూ, ముస్లింలు కలిసి నివసిస్తున్నారు.
గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3800 అని హన్నన్ చెప్పారు. ఈ జనాభాలో దాదాపు 20 నుండి 25 శాతం మంది హిందువులు ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
షమీ నిబద్దత కలిగిన వ్యక్తి : సచిన్
"మనం టీమ్‌ఇండియాకు సపోర్ట్ చేస్తున్నామంటే టీమ్‌కు ఆడే ప్రతి ఒక్క ప్లేయర్‌కు సపోర్ట్ చేస్తున్నట్టే. షమీ నిబద్దత కలిగిన వ్యక్తి. వరల్డ్ క్లాస్ బౌలర్. షమీకి ఆ రోజు కలిసి రాలేదంతే. ఏ క్రీడాకారుడికైనా ఇది జరగవచ్చు. నేనైతే షమీ, టీమిండియా పక్షాన నిలుస్తా" అని సచిన్ ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ముందుకు సాగండి : బీసీసీఐ
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న మహమ్మద్ షమీ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. "భారతీయులుగా గర్విద్దాం. దృఢంగా ఉండండి. ముందుకు సాగండి" అంటూ ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే కంటెంట్‌ను కంట్రోల్ చేయడంలో ఫేస్‌బుక్ చేతులెత్తేసిందా?
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా
- 'అమ్మా నాన్నా అని పిలిపించుకోవడానికి మాకు 10 నెలలు పట్టింది'
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- ఖమ్మం: ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్ స్నేహలత
- సమంత కేసు: యూట్యూబ్ చానళ్లలో ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










