టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ఉపఖండంలోని ప్రజలకు క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రజల్లో ఉన్న ఈ విపరీతమైన అభిమానం వల్లే ఆ క్రీడ ఒక 'మతం'గా మారింది.
కానీ, భారత, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ మతం ఓ మత్తులా తయారవుతుంది.
పాకిస్తాన్ మంత్రులు షేక్ రషీద్, అసద్ ఉమర్‌ల వ్యాఖ్యలు, భారతదేశంలో మహ్మద్ షమీపై సోషల్ మీడియాలో వస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయాన్ని ఇస్లాం విజయంగా పాకిస్తాన్ హోంమంత్రి షేక్ రషీద్ పేర్కొన్నారు.
గత ఆదివారం మ్యాచ్ ముగిసిన తరువాత రషీద్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
"ప్రపంచంలోని ముస్లింలు అందరితో పాటూ భారత ముస్లింల మద్దతు కూడా పాకిస్తాన్‌కు ఉంది. ఇస్లాంకు అభినందనలు. పాకిస్తాన్ జిందాబాద్" అన్నారు.
పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరికీ తామే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆ దేశ మంత్రి మాట్లాడారు.
భారతదేశం రాజ్యాంగపరంగా లౌకిక దేశం. పాకిస్తాన్ తర్వాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న దేశం ఇదే.
భారత ముస్లింలకు కూడా తానే ప్రతినిధి అన్న ధోరణిలో షేక్ రషీద్ వ్యాఖ్యలు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పాకిస్తాన్‌కు ఇది కొత్తేం కాదు
పాకిస్తాన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి కాదు.
2007లో, టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన తరువాత అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ షోయబ్ మాలిక్ మొత్తం ముస్లిం ప్రపంచానికి క్షమాపణలు చెప్పారు.
అప్పటికి షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఇంకా వివాహం చేసుకోలేదు.
"మాకు మద్దతు ఇచ్చినందుకు నా దేశం పాకిస్తాన్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ధన్యవాదాలు. వరల్డ్ కప్ గెలవలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. మేం 100 శాతం దృష్టి పెట్టి ఆడాం" అని ఫైనల్స్‌లో ఓడిపోయిన తరువాత షోయబ్ మాలిక్ అన్నారు.
ఆ మ్యాచ్‌లో భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందన్న సంగతి కూడా షోయబ్ మరచిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
షోయబ్ మాలిక్‌ను అవుట్ చేసింది ఇర్ఫాన్ పఠానే.
షోయబ్ మాటలను భారత్ భారతదేశంలోని ముస్లిం నాయకులు, క్రీడాకారులు తీవ్రంగా ఖండించారు.
"ఇలా మాట్లాడడానికి ఆయనకు ధైర్యం ఎలా వచ్చింది? పాకిస్తాన్‌లో ముస్లిమేతర మద్దతుదారులు లేరా? ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, క్రైస్తవులను అవమానిస్తున్నట్లుగా ఉన్నాయి" అని దిల్లీలోని మైనారిటీ కమిషన్ మాజీ అధిపతి కమాల్ ఫరూఖీ అన్నారు.
పాక్ ఆటగాళ్లకు ఇలాంటి ప్రకటనలు చేయడం మామూలేనని, వసీం అక్రం కూడా గతంలో ఇలాటి మాటే అన్నారని ఫరూఖీ గుర్తుచేశారు.
"బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన తరువాత ‘సోదర దేశం’ (బ్రదర్ నేషన్) తో ఓడిపోయాం అని వసీం అక్రం అనడం నాకు గుర్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తాయి."
"పాపం, భావోద్వేగాల్లో కొట్టుకుపోయాడు. తనకు ఇంగ్లిష్ అంతగా రాదు కూడా. అందులోనూ ఓటమి తరువాత మాట్లాడుతున్నాడు" అంటూ అప్పటి భారత హాకీ స్టార్ అస్లాం షేర్ ఖాన్, షోయబ్ వ్యాఖ్యలపై స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాకిస్తాన్‌లో క్రికెట్
పాకిస్తాన్ క్రికెటర్లపై వారి డ్రెస్సింగ్ రూం కల్చర్, రాజకీయ సంస్కృతి ప్రభావం అధికంగా ఉంటాయని చెబుతారు.
2006లో డాక్టర్ నసీమ్ అష్రఫ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
తమ మతవిశ్వాసాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని అప్పట్లోనే ఆయన ఆటగాళ్లను కోరారు.
కానీ ఆయన మాటలు ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
ఈసారి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రింక్స్ బ్రేక్‌లో మహ్మద్ రిజ్వాన్ ప్రార్థనలు చేస్తూ కనిపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రిజ్వాన్ ప్రార్థన చేస్తున్న వీడియో క్లిప్‌ను షోయబ్ అక్తర్ ట్వీట్ చేస్తూ.. "తన ముందు తల వంచినవారిని అల్లా వేరెవరిముందూ తల దించుకోనివ్వడు. సుభానల్లా" అని రాశారు.
"మతవిశ్వాసాలు ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు. ఇది ఐక్యతను ఇస్తుంది. అయితే, క్రికెట్, మతం మధ్య సమతుల్యం ఉండాలి" అని డాక్టర్ నసీమ్ అష్రఫ్, వార్తా సంస్థ రాయిటర్స్‌తో అన్నారు.
"నేను దీని గురించి జట్టు కెప్టెన్ ఇంజమామ్-ఉల్ హక్ (అప్పటి కెప్టెన్)తో మాట్లాడాను. వ్యక్తిగత విశ్వాసాల పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇస్లాం అనుమతించదని చెప్పాను."
వరల్డ్‌కప్‌లో అజారుద్దీన్ సారథ్యంలో భారత్, పాకిస్తాన్‌పై మూడుసార్లు గెలిచింది. అజారుదీన్ ఎప్పుడూ క్రికెట్‌ను, మతాన్ని కలుపలేదు.
పాకిస్తాన్ నాయకుల, క్రికెటర్ల వ్యాఖ్యలు తమ దేశం, భారత్‌పై గెలవాలన్న ఒత్తిడిని సూచిస్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
క్రీడల పోటీ మతపరమైనది కాదు
పాకిస్తాన్ వ్యర్థ వ్యాఖ్యలు చేస్తోందని మాజీ క్రికెటర్ సాబా కరీం బీబీసీతో అన్నారు.
"భారత, పాకిస్తాన్‌ల మధ్య పోటీ క్రీడలకు సంబంధించినది. మతపరమైనది కాదు. ఇలాంటి ప్రకటనలు వారి పిచ్చితనాన్ని తెలియజేస్తాయి. భారత ముస్లింలకు ఆయన ప్రాతినిధ్యం వహించకుండా ఉంటే మంచిది. భారతదేశంలోని ముస్లింలు టీం ఇండియాలో భాగం. వారికి ఆనందం లేదా విచారం కలిగించేవి తమ జట్టు గెలుపు ఓటములే.
పాకిస్తాన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు, భారతదేశంలోని అతివాదులకు ప్రోత్సాహానిస్తాయి. ఆ ఫలితాలు ఇక్కడ వారి చర్యల్లో కనిపిస్తాయి. మహ్మద్ షమీ విషయంలో జరుగుతున్నది అదే" అని సాబా కరీం అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
అయితే, మైదానంలో ప్రార్థనలు చేయడానికి సాబా కరీం వ్యతిరేకం కాదు. వ్యక్తిగత ఆచరణల వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన భావిస్తున్నారు.
పాకిస్తాన్‌లోని మరో మంత్రి అసద్ ఉమర్ కూడా ఆదివారం మ్యాచ్ తరువాత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
"ముందు మేం వారిని ఓడిస్తాం. వాళ్లు కింద పడిపోయినప్పుడు చాయ్ అందిస్తాం."
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయాన్ని గుర్తు తెస్తూ మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మంత్రుల వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లోనూ విమర్శలు
కాగా, షేక్ రషీద్, అసద్ ఉమర్‌ల వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లో కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
"మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం తరువాత షేక్ రషీద్ ప్రపంచంలోని ముస్లింలందరికీ అభినందనలు తెలుపడం అర్థరహితం. దయచేసి మతం, రాజకీయాల నుంచి క్రికెట్‌ను దూరంగా ఉంచండి" అని పాకిస్తాన్ జర్నలిస్ట్ షిరాజ్ హసన్ అన్నారు.
"హోం మంత్రి ప్రకటన ప్రమాదకరమైనది, విడదీసేది. ముఖ్యంగా భారత జట్టులో ఉన్న ముస్లిం ఆటగాడిపై విషపూరితమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నప్పుడు, ఆయన విధేయతపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరం. కొందరు మంత్రులు విజయాన్ని గౌరవంగా స్వీకరించలేరనిపిస్తోంది" అని పాకిస్తాన్‌లోని న్యాయ వ్యవహారాల నిపుణురాలు రీమా ఒమర్ అన్నారు.
మ్యాచ్ తరువాత భారత, పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వుతూ, ఒకరినొకరు కౌగలించుకున్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. "విజయం తరువాత మంత్రి చూపించిన యుద్ధోన్మాదం కాకుండా, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో గౌరవంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ ఆమె ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ జట్టులో భాగమైన హిందూ ఆటగాడు దానిష్ కనేరియా పలుమార్లు మత వివక్ష ఆరోపణలు చేశారు.
కానీ, భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు.
ఇవి కూడా చదవండి:
- భారత్-పాకిస్తాన్: మరపురాని అయిదు ప్రపంచ కప్ మ్యాచ్‌లు
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఎందుకు ఆచితూచి వ్యహరిస్తోంది
- భారత్- పాకిస్తాన్ క్రికెటర్లు ఆవేశంతో రెచ్చిపోయిన అయిదు సందర్భాలివే...
- ‘ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్యను అమ్మేసి, పారిపోయిందని చెప్పాడు’
- IndvsPak టీ20 వరల్డ్ కప్: భారత్‌పై 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం
- పార్లమెంటులో రేణుకా చౌదరి నవ్వు.. చిక్కుల్లో బీజేపీ!
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రామ్‌నాథ్ కోవింద్‌కు చంద్రబాబు వినతి
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా
- రజనీకాంత్: ‘నేనీ స్థాయికి రావడానికి కారణమైన ఆ డ్రైవర్‌కి ఈ అవార్డు అంకితం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










