IndvsPak టీ20 వరల్డ్ కప్: భారత్‌పై 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం

ఫొటో సోర్స్, Reuters
టీ20 ప్రపంచకప్ గ్రూప్-2 మొదటి సూపర్ 12 మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ప్రతిసారీ భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ ఈసారీ ఆ పరంపరకు తెరదించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇంకా 13 బంతులు మిగిలుండగానే పాకిస్తాన్ 152 పరుగుల విజయ లక్ష్యం అందుకుంది.
షమీ వేసిన 18వ ఓవర్లో మహమ్మద్ రిజ్వాన్ వరసగా 6, 4, 4, 1 పరుగులు కొట్టగా, ఐదో బంతికి 2 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ అజాం జట్టును విజయతీరాలకు చేర్చాడు.
హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు బాబర్ అజాం, మొహమ్మద్ రిజ్వాన్ జట్టుకు చారిత్రక విజయం అందించారు.
మొహమ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా, కెప్టెన్ బాబర్ అజాం 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు.
దీంతో పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే భారత్‌పై విజయం సాధించింది.
వరుసగా రెండు ఓవర్లలో ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేయడంతోపాటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసిన పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తమకు అనుకున్న ప్రారంభం లభించలేదని, దానికి తోడు పాకిస్తాన్ ఓపెనర్లు కూడా బాగా ఆడారని చెప్పాడు. 15-20 పరుగులు ఎక్కువ చేసుండే బావుండేదని, కానీ, ఆరంభంలోనే వికెట్లు పడడంతో అది సాధ్యం కాలేదన్నాడు. తమది ఒత్తిడికి గురయ్యే టీమ్ కాదన్న విరాట్ తర్వాత మ్యాచ్‌కు సిద్ధమవుతామని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్ బ్యాటింగ్...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు పాకిస్తాన్ ముందు 152 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది.
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 15వ ఓవర్లో ఫోర్ కొట్టిన పాకిస్తాన్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్లో సిక్స్ కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అదే ఓవర్లో పాకిస్తాన్ వంద పరుగులు పూర్తయ్యాయి.
ఆచితూచి ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లు 10 ఓవర్లకు 71 పరుగులు చేశారు.
10 ఓవర్లు ముగిసేరికి మొహమ్మద్ రిజ్వాన్ 35, కెప్టెన్ బాబర్ అజాం 34 పరుగులతో ఆడుతున్నారు.
అంతకు ముందు భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ కోహ్లీ తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు.

ఫొటో సోర్స్, Reuters
ఆ సమయానికి జట్టు స్కోర్ 1 పరుగు. మొదటి ఓవర్‌కు భారత్ ఒక వికెట్ నష్టానికి రెండు పరుగులతో ఉంది.
మూడో ఓవర్ వేసిన షహీన్ అఫ్రిదీ కేఎల్ రాహుల్(3)ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ షహీన్ బౌలింగ్‌లోనే ఒక సిక్స్ బాదాడు.
నాలుగో ఓవర్ వరకూ భారత్ 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన షాట్లు ఆడాడు.
షహీన్ అఫ్రిదీ ఐదో ఓవర్ ఐదో బంతికి కోహ్లీ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.
ఆరో ఓవర్ నాలుగో బంతికి హసన్ అలీ సూర్యకుమార్ యాదవ్‌ను 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ చేశాడు. అతడు ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ పట్టాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి మొదటి పవర్ ప్లేలో భారత్ 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.
సూర్యకుమార్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ వచ్చినపుడు స్కోర్ 7 ఓవర్లకు 39 పరుగులు. అవతలివైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.

ఫొటో సోర్స్, Reuters
రిషబ్ పంత్ దూకుడు
పది ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ 26, పంత్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
హనన్ అలీ వేసిన 12వ ఓవర్‌లో భారత్ ఏకంగా 15 పరుగులు పిండుకుంది. అతడి రెండు, మూడు బంతులను రిషబ్ పంత్ వరసగా స్టాండ్స్‌లోకి పంపాడు.
షాదాబ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చాడు. 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఆ సమయానికి స్కోర్ 84/4
15 ఓవర్లు ముగిసేసరికి భారత్ వంద పరుగులు పూర్తి చేసింది. ఆ సమయంలో కోహ్లీ 37, రవీంద్ర జడేజా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
18వ ఓవర్ మొదటి బంతికే రెండు పరుగులు తీసిన విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 45 బంతుల్లో 50పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. కానీ అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రవీంద్ర జడేజా క్యాచ్ ఇచ్చాడు. ఆ సమయానికి భారత్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు.

ఫొటో సోర్స్, Getty Images
ఓపెనర్ల వికెట్లు తీసిన షహీన్ అఫ్రిది 19వ ఓవర్ వేశాడు. కెప్టెన్ బాబర్ అజామ్ ఎత్తు ఫలించింది. ఈసారీ షహీన్ బంతికి 57 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ మొత్తం 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 పరుగులు చేశాడు.
కానీ షహీన్ వేసిన అదే ఓవర్లో ఓవర్ త్రో, నో బాల్ ద్వారా భారత్‌కు 17 పరుగులు కూడా వచ్చాయి.
చివరి ఓవర్ హారిస్ రౌఫ్ వేశాడు. ఈ ఓవర్ మూడో బంతికి హార్దిక్ పాండ్య కొట్టిన షాట్‌ను బాబర్ అజామ్ పట్టాడు.
ఆ ఓవర్లో భారత్‌కు 7 పరుగులే వచ్చాయి. దీంతో భారత్ మొత్తం 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 151 పరుగుల స్కోర్ చేసింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
ఓపెనర్లు త్వరగానే అవుటైనా, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.

ఫొటో సోర్స్, Reuters
6 పరుగులకే ఓపెనర్లు అవుట్...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఓవర్లో 1 పరుగుకే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు.
ఆరు పరుగుల దగ్గర భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 పరుగులు చేసి షహీన్ అఫ్రిదీకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇన్నింగ్స్ మొదటి ఓవర్ 4వ బంతికి రోహిత్ వికెట్ పడగొట్టిన అఫ్రిదీ, తన రెండో ఓవర్ మొదటి బంతికి రాహుల్ వికెట్ తీశాడు.
అభిమానుల్లో టెన్షన్....
దుబయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపట్లో భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
పాకిస్తాన్-భారత్ ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆదివారం జరగబోతున్న ఈ మ్యాచ్ ముందు రోజు నుంచే #INDvPAK ట్విటర్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ట్రెండ్ అవడం మొదలైంది.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు, బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టుతో తలపడుతోంది.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై విజయ పరంపరను నిలబెట్టుకోవాలని భారత్ చూస్తుంటే, ఈసారీ విజయం సాధించి ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
- సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరాలని గాంధీ చెప్పారా? - BBC Fact Check
- ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకంపై ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ సైన్యం మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా?
- వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










