మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత

ఫొటో సోర్స్, Getty Images
అచ్చు 'యూ బ్లడీ ఫూల్' అని ఎవరో అన్నట్టుగానే ఉన్న కస్తూరి బాతు ఆడియోను పరిశోధకులు విడుదల చేశారు.
ఆస్ట్రేలియాలో కనిపించే కస్తూరి బాతులు శబ్దాలను అనుకరించగలవని చెప్పడానికి 34 ఏళ్ల కిందటి ఈ ఆడియో రికార్డింగ్ డాక్యుమెంట్ మొదటి సాక్ష్యంగా నిలిచింది.
పరిశోధకులు డాక్టర్ పీటర్ ఫుల్లగర్ 1987 లో కాన్‌బెర్రా సమీపంలోని టిడ్బిన్‌బిల్లా నేచర్ రిజర్వ్‌లో కస్తూరి బాతు రిప్పర్ వాయిస్‌ను రికార్డ్ చేశారు.
నాడు ఆయన చేసిన రికార్డింగులను ఇటీవల నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కారెల్ టెన్ కేట్ తిరిగి వెలుగులోకి తెచ్చారు.
పక్షులలో స్వర అభ్యాసంపై ప్రొఫెసర్ టెన్ కేట్ అధ్యయనం చేస్తుండగా, తలుపు కొట్టుకుంటుండగా వచ్చే శబ్దాన్ని కూడా ఈ బాతు అనుకరించగలదని సరికొత్త అంశాన్ని గుర్తించారు.
''కస్తూరి బాతులు శబ్దాలను అనుకరించగలగడం చాలా ఆశ్చర్యం కలిగించింది. దీన్ని ఇప్పటివరకు స్వర అభ్యాస రంగంలో పరిశోధకులు ఎవరూ గుర్తించలేదు'' అని ప్రొఫెసర్ టెన్ కేట్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
''తిరిగి ఆవిష్కరించిన ఈ విషయం చాలా ప్రత్యేకమైనది'' అని చెప్పారు.
శబ్దాలను అనుకరించడం అరుదైన లక్షణం. డాల్ఫిన్లు, తిమింగలాలు, ఏనుగులు, గబ్బిలాలు స్వర అభ్యాసం చేస్తాయనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రకృతిలోని చాలా రకాల క్షీరదాల్లో ఈ తరహా అలవాటు కనిపించదు.
అయితే, కొన్ని పక్షులు, ముఖ్యంగా చిలుకలు వివిధ శబ్దాలను అనుకరించగలవు.
''ఈ సమూహాల్లోనూ స్వర అభ్యాసం చాలా అరుదు'' అని ప్రొఫెసర్ టెన్ కేట్ చెప్పారు.
''చిలుకలు, హమ్మింగ్‌బర్డ్స్ నిర్దిష్ట శబ్దాలు చేయడం నేర్చుకోగలవని మనకు తెలుసు. ఇందులో అనేక జాతులు ఉన్నాయి. కానీ ఈ సమూహాల పూర్వీకుల జాతులే స్వర అభ్యాసాన్ని ఒంటపట్టించుకున్నాయి.''
మొత్తం 35 రకాల పక్షి జాతుల ఆర్డర్లలో మూడు మాత్రమే గతంలో స్వర అభ్యాసం చేసేవని పరిశోధకులు భావించేవారు.
కానీ, రిప్పర్ ఆడియోతో ఇప్పుడు ప్రొఫెసర్ టెన్ కేట్ ఈ సమూహంలో కొత్త ఆర్డర్ ను చేర్చనున్నారు.
''ఇలాంటి సమూహాల్లో స్వర అభ్యాసం గమనించడం అనేది చాలా గొప్ప విషయం'' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- అమెరికా అమాయకులను చంపేసిందా? కాబుల్ చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
- యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన 18ఏళ్ల ఎమ్మా రదుకాను
- మొహమ్మద్ అట్టా: విమానాన్ని ఎలా హైజాక్ చేశారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి ముందు ఏం జరిగింది?
- ఈ దేశంలో సంవత్సరానికి 13 నెలలు, వీరి క్యాలెండర్ ఏడేళ్లు వెనక్కి ఎందుకుంది?
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- ఖడ్గమృగాన్ని తలక్రిందులుగా వేలాడదీసిన ప్రయోగానికి ‘నోబెల్ బహుమతి’ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








