ఖమ్మం: ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్ స్నేహలత

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మాతా, శిశు కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ స్నేహలత ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పురిటి నొప్పులతో ఆమె శనివారం ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం డాక్టర్లు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న జిల్లా ఆదనపు కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ASP శబరీష్, IPS దంపతులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించి, అభినందనలు తెలిపారు. చిన్నారిని మంత్రి పువ్వాడ కాసేపు ఎత్తుకుని లాలించారు.
జిల్లా ఉప పరిపాలన అధికారి అయినప్పటికీ సామాన్య ప్రజల్లో ఒకరిగా ప్రభుత్వ ఆస్పత్రి సేవలు పొందడం ద్వారా స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రుల గౌరవం పెంచారని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

మంత్రి వెంట పాటు మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్, DM&HO మాలతి, సూడా చైర్మన్ విజయ్ ఆస్పత్రికి వచ్చి స్నేహలతకు అభినందనలు తెలిపారు.
సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని స్నేహలత అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్: ‘దుర్గాపూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని గుర్తించాం’ - పోలీసుల ప్రకటన
- ఆర్యన్ ఖాన్ కస్టడీ అక్టోబరు 30 వరకు పొడిగింపు
- ఫేస్‌బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- వైఎస్ జగన్: ‘విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




