ఆర్యన్ ఖాన్ కస్టడీ అక్టోబరు 30 వరకు పొడిగింపు

ఫొటో సోర్స్, Getty Images
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీని ముంబయిలోని ఎన్‌సీబీ ప్రత్యేక కోర్టు పొడిగించింది.
అక్టోబరు 30 వరకు ఆయన కస్టడీలోనే ఉండనున్నారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
మరోవైపు అక్టోబరు 26న బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
హైకోర్టు తీర్పును బట్టి ఆయన ఎప్పటి వరకు కస్టడీలో ఉంటారనేది తేలనుంది.

ఫొటో సోర్స్, Getty Images
షారుఖ్ ఖాన్, అనన్య పాండే ఇళ్లలో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు
డ్రగ్స్ కేసులో విచారణకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గురువారం మధ్యాహ్నం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, నటి అనన్య పాండే ఇళ్లకు చేరుకున్నారు.
నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌కు ఈమె ఆప్తురాలు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎన్‌సీబీకి చెందిన ఒక బృందం షారుఖ్ నివాసం మన్నత్‌కు చేరుకోగా, మరో బృందం అనన్య పాండే ఇంటికి చేరుకుంది. దర్యాప్తు అనంతరం రెండు బృందాలూ వెనక్కి వెళ్లిపోయాయి.

ఫొటో సోర్స్, ANI
మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ అనన్య పాండేకు ఎన్‌సీబీ సమన్లు పంపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, ‘‘విచారణలో భాగంగా సమన్లు జారీచేయడం సాధారణమే. మేం సమన్లు జారీచేసిన వారంతా నేరస్థులు కాదు’’అని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.
క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ పార్టీకి సంబంధించి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను ఇప్పటికే ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సోదాలు, విచారణలు చేపడుతోంది.

ఫొటో సోర్స్, ANI
ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై 26న విచారణ
డ్రగ్స్ కేసులో అరెస్టైన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఈ కేసులో ఆర్యన్‌తోపాటు అర్బాజ్ మర్చెంట్, మున్మున్ ధర్మేచాలు కూడా అరెస్టయ్యారు. వీరి బెయిల్ పిటిషన్లను నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కోర్టు ఇదివరకు తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆర్యన్ తరఫు న్యాయవాదులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న దర్యాప్తు చేపడతామని బాంబే హైకోర్టు గురువారం తెలిపింది.
అక్టోబరు 2 అర్ధరాత్రి ఓ క్రూయిజ్ నౌకలో ఆర్యన్, అర్బాజ్, మున్మున్‌లను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మొదట సెషన్సు కోర్టు వీరిని ఏడు రోజుల రిమాండ్‌కు తరలించింది. ఆ తర్వాత మరో 14 రోజులకు కస్టడీని పొడిగించింది.
గురువారం ఉదయం ఆర్ధర్ రోడ్ జైలులోనున్న ఆర్యన్‌ను కలిసేందుకు షారుఖ్ ఖాన్ వచ్చారు. అరెస్టు తర్వాత ఆర్యన్‌ను షారుఖ్ కలవడం ఇదే తొలిసారి.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ జైలులో ఉంచిన వారిని వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలవడంపై జైలు యాజమాన్యం ఆంక్షలు విధించింది.
ఇవి కూడా చదవండి:
- ‘భార్యను చంపేందుకు రక్తపింజరి పాము కొన్నాడు.. అయినా, చనిపోలేదని నాగుపాముతో కాటు వేయించి చంపాడు’
- యూట్యూబ్ చానళ్లపై సమంత పరువునష్టం దావా
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న భారత్.. వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- సావర్కర్ క్షమాపణ పత్రంలో ఏం రాశారు? విడుదలయ్యాక ఏం చేశారు
- ‘రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా ఆపినట్లు ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ ఆపగలరా’
- ‘బంగ్లాదేశ్‌లో ఆలయాల్లో హింస చూసి నా గుండె పగిలింది’ : అమెరికా మాజీ ఎంపీ
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








