తులసి గబ్బార్డ్: ‘బంగ్లాదేశ్‌లో ఆలయాల్లో హింస చూసి నా గుండె పగిలింది’ అన్న అమెరికా మాజీ ఎంపీ - BBC Newsreel

అమెరికా మాజీ ఎంపీ తులసి గబ్బార్డ్

ఫొటో సోర్స్, facebook/TulsiGabbard

బంగ్లాదేశ్‌లో హింసను ఖండిస్తూ "హిందువులతో సహా అన్ని మతపరమైన మైనారిటీలకు" రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ తులసి గబ్బార్డ్ కోరారు.

తులసి గబ్బార్డ్ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసపై ఆమె విచారం వ్యక్తం చేశారు.

"బంగ్లాదేశ్‌లోని ఆలయాల్లో భగవంతుడిని ఆరాధించేవారిపట్ల ద్వేషాన్ని, హింసను చూసి నా గుండె పగిలిపోయింది" అని తులసి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దుర్గా పూజ సందర్భంగా ఖురాన్‌ను అవమానించారనే వదంతులపై బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ఇందులో కనీసం ఐదుగురు మరణించారు.

నోఖాలీలోని ఇస్కాన్ దేవాలయంతో సహా దేశంలో అనేక నగరాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అనేక విగ్రహాలను ధ్వంసం చేసి, ఇళ్లను తగలబెట్టారు.

హింసకు పాల్పడేవారి మనస్తత్వాన్ని తులసి గబ్బార్డ్ ప్రశ్నించారు. "దేవాలయాలు, భక్తివేదాంత స్వామి ప్రభుపాద వంటి సన్యాసుల విగ్రహాలకు నిప్పు పెట్టడం వల్ల వారి దేవుడిని సంతోషపరచవచ్చని విశ్వసించే ఈ జిహాదీలు, నిజంగా దేవుడికి ఎంత దూరంలో ఉన్నారో తెలియజేస్తుంది?"

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"సెక్యులర్ ప్రభుత్వంగా చెప్పుకునే బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులతో సహా మతపరమైన మైనారిటీలకు జిహాదీ శక్తుల ద్వేషాల నుండి రక్షణ కల్పించాల్సిన సమయం వచ్చింది" అని తులసి అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

తులసి గబ్బార్డ్ హిందూ మతంపై జరుగుతున్న దాడులపై స్వరం పెంచారు. వాస్తవానికి తులసికి భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తల్లిదండ్రులు కూడా భారతీయ సంతతికి చెందినవారు కాదు.

కానీ, ఆమె హిందూమతాన్ని విశ్వసిస్తున్నారు. అమెరికా పార్లమెంటులో అడుగుపెట్టిన మొదటి హిందువుగా ఆమె పేరు కూడా నమోదు చేశారు. తులసి గబ్బార్డ్‌కు అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజం నుంచి మద్దతు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)