బంగ్లాదేశ్‌: ‘దుర్గా మండపంలో ఖురాన్’.. హిందువులపై దాడులకు మూల కారణం ఇదేనా?

వీడియో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై అల్లరిమూకల దాడులకు మూల కారణం ఏంటి?

ఆదివారం రాత్రి రంగ్‌పూర్‌లోని పీర్‌గంజ్‌లో నివసించే హిందువులపై దాడులు జరిగాయి. మత విశ్వాసాలను రెచ్చెగొట్టేలా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేయడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు.

దాడులతో భయపడ్డ స్థానిక హిందువులు, సమీప ప్రాంతాలకు పారిపోయి ఆరు బయటే ఉండిపోయారు.

అల్లరి మూకలు తమ ఇళ్లు, దుకాణాలు దోచుకున్నాయని బాధితులు చెబుతున్నారు.

దుండగులు తగులబెట్టడంతో చాలా వస్తువులు బూడిదగా మారాయి.

ఘటనాస్థలంలో బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలను మొహరించారు.

ఈ ఘటనకు సంబంధించి చాలా మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దేశంలోని హిందూ సముదాయాలపై కొంతకాలంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి.

కమిల్లాలోని దుర్గా మండపంలో ఖురాన్ కనిపించిన నాటి నుంచి ఈ దాడులు మొదలయ్యాయి.

దేశవ్యాప్తంగా కమిల్లా, నొవొఖాలీ, ఢాకా, కిశోర్‌గంజ్, చాంద్‌పూర్ వంటి అనేక ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపైనా, పూజా మందిరాలపైనా దాడులు జరిగాయి.

మత సామరస్యాన్ని దెబ్బతీయడానికే ఈ దాడులు జరుగుతున్నాయని బంగ్లా ప్రభుత్వం అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)