తులసి గబార్డ్: మోదీకి మద్దతు ఇచ్చే ఈ హిందూ మహిళ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగలరా?

ఫొటో సోర్స్, TulsiGabbard/facebook
అమెరికాలోని హవాయి ప్రాంత ఎంపీ తులసీ గబార్డ్ 2020లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
37 ఏళ్ల తులసీ గబార్డ్ డెమొక్రటిక్ పార్టీలోని ముఖ్యమైన నేతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.
2016లో అధ్యక్ష ఎన్నికలు జరిగినపుడు ఆమె హిల్లరీ క్లింటన్ స్థానంలో బెర్నీ శాండర్స్‌కు మద్దతిచ్చారు.
2016లో ఆమె డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ శాండర్స్‌కు మద్దతిచ్చిన తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
1981లో అమెరికాలోని సమోవాలో జన్మించిన తులసీ గబార్డ్ చిన్న వయసులోనే అమెరికా పార్లమెంటుకు ఎన్నికైన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 21 ఏళ్లకే ఎంపీ అయ్యారు.

ఫొటో సోర్స్, TulsiGabbard/facebook

ఫొటో సోర్స్, INSTAGRAM/TULSIGABBARD
భారత్‌తో బంధం
స్టేట్ సెనేటర్ మైక్ గబార్డ్ కూతురైన తులసి మొదట తన పదవీకాలంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ ఒక చట్టం చేయడానికి మద్దతు ప్రకటించారు. దాని వల్ల మిగతా ఇంధనాలపై ట్యాక్స్ తగ్గుతుందని భావించారు.
తర్వాత తులసీ గబార్డ్ హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ సర్వీస్‌లో చేరారు. ఒక ఏడాది పాటు ఇరాక్ యుద్ధంలో తన సేవలు అందించారు.
ఆ తర్వాత ఆమె 2011లో ఇండోనేషియా సైన్యంతో కలిసి పీస్ కీపింగ్ ట్రైనింగ్‌లో కూడా భాగం అయ్యారు.

ఫొటో సోర్స్, INSTAGRAM/TULSIGABBARD
2015లో అమెరికా సైన్యంలో మేజర్ పదవిని సొంతం చేసుకున్న తులసీ గబార్డ్ ఇప్పుడు కూడా సైన్యంతో తన అనుబంధం కొనసాగిస్తున్నారు.
తులసీ గబార్డ్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అకుంటున్నట్టు చెప్పగానే, భారత్‌లో ఆమె పేరున ట్విటర్ ట్రెండింగ్ మొదలైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ భారత్‌తో తులసికి ఉన్న బంధం గురించి చెప్పుకుంటే.. ఆమెకు ఈ దేశంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తల్లిదండ్రులు కూడా భారతీయులు కారు.
కానీ హిందూ మతాన్ని విశ్వసించే తులసీ గబార్డ్‌కు అమెరికాలోని భారతీయుల నుంచి భారీ మద్దతు ఉంది. అమెరికా పార్లమెంటుకు వెళ్లిన తొలి హిందువుగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
గత ఏడాది అమెరికా న్యూస్ చానల్ ఒక కార్యక్రమంలో హిందువులకు వ్యతిరేకంగా చేసిన కామెంట్‌పై ఆమె తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, INSTAGRAM/TULSIGABBARD

ఫొటో సోర్స్, TulsiGabbard/facebook
ప్రధాని మోదీకి మద్దతు
అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మద్దతుదారుల్లో తులసీ గబార్డ్ కూడా ఒకరని భావిస్తున్నారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడానికి ముందే ఆమె ఆయనకు తన మద్దతు ప్రకటించారు.
2002లో జరిగిన గుజరాత్ ఘర్షణలతో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా రాకుండా నిషేధం విధించినప్పుడు, ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన కొద్దిమందిలో తులసీ గబార్డ్ కూడా ఉన్నారు.
హిందూ మతాన్ని విశ్వసించే తులసి తన భారత పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతే కాదు ప్రధాన మంత్రి మోదీ న్యూయార్క్ వెళ్లినప్పుడు కూడా ఆయన తులసీ గబార్డ్ కోసం కాస్త సమయం కేటాయించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కొన్నేళ్ల క్రితం హిందూ సంప్రదాయాలో వివాహం చేసుకున్న తులసీ గబార్డ్ ప్రధాని నరేంద్ర మోదీ మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతుగా నిలిచారు.

ఫొటో సోర్స్, TulsiGabbard/facebook
తులసి గబార్డ్ రాజకీయ చాతుర్యం
గబార్డ్ రాజకీయ జీవితం విషయానికి వస్తే అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వారు కూడా ఇష్టపడేంత ఇమేజ్ ఆమె సొంతం.
2016లో బెర్నీ శాండర్స్‌కు మద్దతిచ్చిన తులసి డీఎన్‌సి ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తులసీ గబార్డ్ శుక్రవారం( 11-01-19న) ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ రష్యా కోసం పనిచేస్తున్నారా? ‘విచారణ జరిపిన అమెరికా’
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ‘రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించార’ని నటిపై కేసు
- అమెరికా, నెదర్లాండ్స్‌లో రాముని కరెన్సీ: ఈ వార్తల్లో నిజమెంత, రాముని కరెన్సీ చరిత్ర ఏమిటి
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
- ఎలుగుబంట్ల ప్రయాణం: జపాన్ టు బ్రిటన్
- అమెరికాలో హత్యకూ అదే, ఆత్మహత్యకూ అదే
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








