మెన్‌స్ట్రువల్ కప్: ఈ కప్పు వాడితే శానిటరీ న్యాప్‌కిన్ అవసరం ఉండదు

ఫొటో సోర్స్, Getty Images
పీరియడ్స్ సమయంలో శానిటరీ న్యాప్‌కిన్లను ఉపయోగించమంటూ టీవీల్లో చాలా ప్రకటనలు వస్తుంటాయి.
కానీ, ఈ విషయంలో నిపుణుల సూచన మరోలా ఉంది.
శానిటరీ న్యాప్‌కిన్లు మట్టిలో కలిసిపోవడానికి కనీసం వెయ్యేళ్లు పడుతుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతారు.
ప్లాస్టిక్‌తో తయారయ్యే శానిటరీ న్యాప్‌కిన్లలో అనేక హానికారక రసాయనాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.
ఒకే న్యాప్‌కిన్‌ను రోజంతా ఉపయోగిస్తే దురద, ఎలర్జీతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి.
కానీ, అందరు మహిళలకు రోజూ 4-5 న్యాప్‌కిన్లు మార్చుకునే అవకాశం ఉండదు.
మరి దీనికి పరిష్కారం ఏంటి?
పాత 'బట్ట' పద్ధతికే వెళ్లడం మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
కాకపోతే కచ్చితంగా నాణ్యమైన బట్టను ఎంచుకోవాలి. దాన్ని సరిగ్గా కుట్టాలి. పరిశుభ్రంగా ఉతకాలి.
ఈ న్యాప్‌కిన్లు, బట్ట కాకుండా మరేదైనా మార్గం ఉందా?
అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల్లో మెన్‌స్ట్రువల్ కప్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు.
నెలసరి రక్తాన్ని ఈ కప్‌లో సేకరిస్తారు. దాన్ని శుభ్రం చేశాక మళ్లీ వినియోగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అదే ట్యాంపైన్లు నేరుగా నెలసరి రక్తాన్ని పీల్చేస్తాయి.
పునర్వినియోగానికి అనువుగా ఉండే కప్స్, ట్యాంపైన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
కానీ, సంప్రదాయ విధానం నుంచి బయటికొచ్చి కొత్త మార్గాన్ని ఎంచుకోవడం అంత సులువు కాదని సైకాలజిస్టులు అంటున్నారు.
పీఎంఎస్ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెన్‌స్ట్రువల్ కప్స్ లాంటి ఈ కొత్త సాధనాలు ఉపకరిస్తాయని వైద్యులు చెబుతారు.
ఇవి కూడా చదవండి
- NTR కథానాయకుడు రివ్యూ: సృజనాత్మకత లోపించినా... క్రిష్ కష్టం కనిపించింది
- ఒక్క వంటపాత్ర లేకుండానే నోరూరించే బిర్యానీ రెడీ
- క్రైస్తవం అతి పెద్ద మతంగా ఎలా విస్తరించింది...
- జనాభా 80 లక్షలు... మాట్లాడే భాషలు 800
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









