పపువా న్యూ గినీ: జనాభా 80 లక్షలు... మాట్లాడే భాషలు 800

పపువా న్యూ గినీ సంప్రదాయ తెగ ప్రజలు

ఫొటో సోర్స్, Bradley Kanaris/getty

ఫొటో క్యాప్షన్, పపువా న్యూ గినీ సంప్రదాయ తెగ ప్రజల నృత్యం(2017 రగ్బీ ప్రపంచ కప్ నాటి చిత్రం)

పపువా న్యూ గినీ... ఆస్ట్రేలియా సమీపంలో పర్వతాలతో నిండిన చిన్న దేశం ఇది. ఈ దేశ జనాభా కేవలం 80 లక్షలు. కానీ, ఇక్కడ దాదాపు 800 భాషలు వాడుకలో ఉన్నాయి.

కొన్ని శతాబ్దాలుగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మనుగడ సాగిస్తున్న తెగలు ఇక్కడ అనేకం ఉన్నాయి. అందువల్ల పురాతన మూలాలు కలిగిన అనేక భాషలు ఇంకా మనుగడలో ఉన్నాయి.

ఇక్కడి కేంద్రప్రభుత్వం బలహీనంగా ఉండటం కూడా భాషా వైవిధ్యానికి దోహదపడింది. దీంతో ఇక్కడ 800కు పైగా భాషలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: ఈ చిన్న దేశంలో 800కు పైగా భాషలున్నాయి

వాటిలో వేల సంఖ్యలో మాత్రమే మాట్లాడే కెరెవో లాంటి భాషలు కూడా ఉన్నాయి.

ఇక్కడ నేటికి 20 శాతం జనాభా మాత్రమే పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నారు.

ఇంగ్లిష్ మాట్లాడే వలస పాలకుల వల్ల టాక్ పిసిన్ భాష పుట్టింది. ఇవాళ పిడ్‌జిన్ ఇంగ్లిష్ అక్కడ చాలా విస్తృతంగా ఉపయోగించే భాషగా మారింది.

మరోవైపు కెరెవో లాంటి భాషను మాట్లాడే ప్రజలు కేవలం కొన్ని వేల మందే మిగిలారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)