ఎలుగుబంట్ల ప్రయాణం: జపాన్ టు బ్రిటన్

getty

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్‌లోని దక్షిణ యార్క్‌షైర్‌లో ఉన్న వన్యప్రాణుల పార్క్ నాలుగు అరుదైన బ్రౌన్ బేర్స్.. అంటే గోధుమరంగు ఎలుగుబంట్లకు తాజా చిరునామాగా మారింది. వీటన్నిటినీ ఓ అధ్భుతమైన రెస్క్యూ మిషన్ ద్వారా ఇక్కడకు తరలించారు.

జపాన్‌లోని ఓ మ్యూజియంలో చిన్న చిన్న బోన్లలో కొన్నేళ్ళుగా మగ్గిపోయిన ఈ వన్యప్రాణులు ఇప్పుడు విశాలమైన కొత్త పరిసరాలను ఆస్వాదిస్తున్నాయి.

హేనికో అనే ఎలుగుబంటి గత మూడు దశాబ్దాలుగా ఉత్తర జపాన్‌లోని మ్యూజియంలో నివసించేది. అది ఉండే బోను చాలా చిన్నది.

హేనికో అందులో ఏ వైపు నడిచినా కేవలం రెండు అడుగులు మాత్రమే వేయగల స్థలం అది. ఇప్పుడు దాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ముందుగా అన్నింటికన్నా పెద్దదైన అమ్యూకు మత్తుమందు ఇచ్చారు వెటర్నరీ డాక్టర్. ఆ బోను పక్కనే మరో ఎలుగుబంటి కూడా ఉంది. అమ్యూ మత్తులో ఉన్న సమయంలో 350 కిలోల బరువున్న ఆ ఎలుగుబంటిని ట్రక్కులోకి ఎక్కించి తీసుకెళ్ళారు.

‘‘మేము తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ పని మొదలుపెట్టాం.. ఇప్పుడు రాత్రి 9 అవుతోంది. ఇప్పటివరకు నాలుగు ఎలుగుబంట్లను పెద్ద పెట్టెల్లోకి చేర్చి వాటిని లారీలోకి ఎక్కించాం’’ అని తెలిపారు యార్క్‌షైర్ పార్క్‌కు చెందిన సైమన్ మార్ష్.

ఎలుగుబంటి

ఫొటో సోర్స్, Getty Images

5 వేల మైళ్ళ సుదూర ప్రయాణం తర్వాత ఈ నాలుగు ఎలుగుబంట్లు లండన్‌కు చేరాయి. రెండు విమాన ప్రయాణాల సమయంలో నలభై మూడు డిగ్రీల వేడి ఉండటంతో వాటికి చల్లదనం కలిగించడం మరో పెద్ద సమస్యగా మారింది.

ఇందుకోసం ఫ్యాన్లు, ఐస్ షీట్లు, ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు సిద్ధం చేసుకుని ముందు నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారు.

‘‘నేను విమానంలో కూర్చుని ఆలోచిస్తున్నాను.. ఈ విమానంలో ప్రయాణిస్తున్నవారెవరికీ తెలియదు... మాతో పాటు నాలుగు ఎలుగుబంట్లు కూడా ప్రయాణిస్తున్నాయని. చాలా ఆశ్చర్యంగా అనిపించింది’’ అని వాటిని తీసుకొస్తున్న సైమన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, జపాన్ ఎలుగుబంట్లకు బ్రిటన్ ఆశ్రయం

‘‘ఇంతకు ముందు ఉన్నచోటు కాంక్రీటు నేల కావడంతో అవి చాలా తక్కువగా తిరుగగలిగేవి’’ అని వైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధి జార్జియానా గ్రోవ్స్ వివరించారు.

జంతు సంరక్షణ నిపుణులు మొదట జపాన్‌లో ఈ ఎలుగుబంట్లను చూసినపుడే వాటిని ఇక్కడకు తరలించాలని అనుకున్నారు.

‘‘ఎలుగుబంట్లు సంతోషంగా ఉంటే రోజులో 18 గంటల పాటు తిరుగుతూ ఉండగలవు. కానీ ఇప్పటివరకు వీటికి అలాంటి అవకాశం రాలేదు.’’ అని జార్జియానా పేర్కొన్నారు.

మరిన్ని వివరాలను పై వీడియోలో చూడొడ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)