కాక్‌పిట్‌లో చింపాంజీ.. సుఖాంతమైన విషాద కథ

ఫొటో సోర్స్, lwiroprimates/facebook
ఈ బేబీ చింపాంజీ పేరు ముస్సా.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని విరుంగ నేషనల్ పార్కులో ఈ బేబీ చింపాంజీని కొందరు వేటగాళ్ల బారి నుంచి రక్షించి ఎల్‌విరొ ప్రైమేట్స్ అనే చింపాంజీల పునరావాస కేంద్రానికి తరలించారు.
అలా తరలించే క్రమంలో పైలట్ ఆంథోనీ కీరేకు ముస్సాకు మధ్య గొప్ప స్నేహం కుదిరింది.
కాక్‌పిట్‌లోకి వచ్చిన ముస్సా కొద్దిసేపు కీరే పక్కన, మరికొద్ది సేపు అతని ఒడిలోను కూర్చుంది.
మధ్యలో కాక్‌పిట్‌లోని బటన్లను నొక్కుతూ కనిపించింది.
ఈ చిన్న చింపాంజీ తల్లికి దూరమైనా.. వేటగాళ్ల బారిన పడకుండా చివరకు పునరావాస కేంద్రానికి తరలటంతో కథ సుఖాంతమైంది.
‘‘అనిశ్చిత భవిష్యత్ నుంచి ఈ బాలుడిని కాపాడినందుకు, రవాణా సదుపాయం కల్పించినందుకు విరుంగ నేషనల్ పార్క్‌కు కృతజ్ఞతలు’’ అని పునరావాస కేంద్రం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- రీటా: 57వ పుట్టినరోజు జరుపుకున్న చింపాంజీ
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- అడవుల్లో పులులను ఎలా లెక్కిస్తారో తెలుసా?
- ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన గొరిల్లా మృతి
- పులులు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఈయన నేస్తాలు
- భూకంపాలను ముందే పసిగట్టొచ్చా?
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









