195 కిలోల పులిని మరో చోటికి తరలించడం ఎలాగంటే..

పులి, అభయారణ్యం

మధ్యప్రదేశ్ నుంచి 195 కిలోల బరువున్న పులిని అక్కడికి 600 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశాలో ఉన్న అభయారణ్యానికి తరలించారు. ఈ భారీ ఆపరేషన్‌లో అనేక మంది అటవీ అధికారులతో పాటు వన్యప్రాణి సంరక్షకులు, ఐదు ఏనుగులు పాల్గొన్నాయి.

అటవీ అధికారులు ఎంబీ2 అనే పేరు పెట్టిన ఈ మగ పులి వయసు మూడేళ్లు. ఇది మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్క్‌లో ఉండేది.

పులి, అభయారణ్యం

ఒడిశాలోని సత్కోసియా రిజర్వ్‌లో పులుల సంఖ్యను పెంచేందుకు మధ్యప్రదేశ్ నుంచి పులులను అక్కడికి తరలించాలని నిర్ణయించారు. అలా తరలించాలని నిర్ణయించిన ఐదు పులులలో ఎంబీ2 ఒకటి.

ఈ నెల 20న ఎంబీ2ను ఈ ప్రాజెక్టు కింద ఒడిశాకు తరలించారు.

పులి, అభయారణ్యం

ఇలాంటి ఆపరేషన్‌ను చేపట్టడం కూడా భారతదేశంలో ఇదే మొదటిసారి అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

''ఎంబీ2 తరలింపు వల్ల ఈ ప్రాజెక్టు కింద సత్కోసియాలో పులుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం'' అని అటవీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

పులి, అభయారణ్యం

సత్కోసియా రిజర్వ్‌లో కేవలం రెండు ఆడ పులులు ఉన్నట్లు భావిస్తున్నారు.

అయితే ఎంబీ2ను బంధించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ అటవీశాఖ సంరక్షకులు సంజయ్ శుక్లా తెలిపారు.

పులి, అభయారణ్యం

మొదట దానికి మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన బోను ఉన్న ట్రక్ వద్దకు దానిని తీసుకెళ్లారు. పులిని ఒడిశాకు తరలించడం కోసం ఈ ట్రక్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.

మత్తులో ఉన్న పులిని మోసుకెళ్లేటప్పుడు దానిని ఐదు ఏనుగులపై అధికారులు అనుసరించారు.

పులి, అభయారణ్యం

జూన్ 21 మధ్యాహ్నం ఎంబీ2 సత్కోసియా చేరుకోగా, మొదట దానిని రిజర్వ్‌లోని ఎంక్లోజర్‌లోకి వదిలారు. అది కొత్త వాతావరణానికి అలవాటు పడేంత వరకు ఎంక్లోజర్‌లోనే ఉంటుంది. ఆ తర్వాత దానిని అడవిలోనికి వదులుతారు.

మరికొన్ని నెలల వ్యవధిలో మధ్యప్రదేశ్ నుంచి మూడు మగ పులులు, ఒక ఆడపులిని కూడా ఒకదాని వెంట ఒకటి సత్కోసియాకు తరలిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)