ఝార్ఖండ్: వీధి నాటకం ప్రదర్శిస్తున్న కార్యకర్తల కిడ్నాప్, అత్యాచారం

ఝార్ఖండ్‌లో మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న ఐదుగురు కార్యకర్తలను అపహరించిన కొందరు వ్యక్తులు, వారిపై అత్యాచారం చేశారు.
ఈ మహిళా కార్యకర్తలు ఒక స్వచ్ఛంద సంస్థ తరపున ఖుంటి జిల్లాలో మానవ అక్రమరవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
''వీధి నాటకం ప్రదర్శించిన అనంతరం స్థానిక పాఠశాలకు వెళుతుండగా, కొంత మంది వ్యక్తులు వాళ్లను చుట్టుముట్టారు. ఆ తర్వాత వాళ్లను తుపాకులతో బెదిరించి, అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు'' అని సీనియర్ పోలీసు అధికారి ఏవీ హోమ్‌కర్ బీబీసీకి తెలిపారు.
ఈ కేసు విచారణ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం బాధితులు పోలీసుల రక్షణలో ఉన్నారు.
తమ ప్రాంతంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించడం ఇష్టం లేని ఒక బృందంలోని వ్యక్తులే ఈ అత్యాచారానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ అనుమానిత బృందానికి జిల్లాలోని గిరిజనుల మద్దతు ఉంది. తమ ప్రాంతంలోకి బయటి వారెవ్వరూ ప్రవేశించవద్దని హెచ్చరిస్తూ ఇటీవల అక్కడ పోస్టర్‌లు కూడా వెలిశాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








