క్రికెట్ ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ వీరులు... చేతన్ శర్మ నుంచి మహ్మద్ షమీ వరకు

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం సాధించడం ఒక్కటే కాదు... చివరి ఓవర్లో మహ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించడమూ టీమిండియా అభిమానులను తెగ సంతోషపెడుతోంది.
ఈ ఫీట్‌తో షమీ క్రికెట్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలరయ్యాడు.
32 ఏళ్ల కిందట 1987 ప్రపంచకప్‌లో చేతన్ శర్మ తొలిసారి హ్యాట్రిక్ సాధించగా మళ్లీ ఇన్నేళ్లకు షమీ ఆ ఫీట్ సాధించాడు.

ఫొటో సోర్స్, Getty Images
షమీ హ్యాట్రిక్ ఇలా..
అఫ్గాన్ జట్టు చివరి ఓవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు కెప్టెన్ కోహ్లీ బంతిని షమీ చేతికి అందించాడు.
అప్పటికి నబీ క్రీజ్‌లో ఉన్నాడు.
మొదటి బంతికే ఫోర్ ఇచ్చాడు షమీ.. మైదానంలో, టీవీల ముందు కూర్చున్నవాళ్లలో ఒకటే టెన్షన్.
రెండో బంతికి అఫ్గాన్ బ్యాట్స్‌మన్ పరుగులేమీ తీయలేకపోయారు. హమ్మయ్య అనుకున్నారు టీమిండియా అభిమానులు.
మూడో బంతి... నబీ కొట్టిన షాట్ గాల్లోకి లేచింది. హార్దిక్ పాండ్యా దాన్ని ఒడుపుగా అందుకున్నాడు. ధాటిగా ఆడే నబీ అవుట్ కావడంతో భారత్ అభిమానులు కేరింతలు కొట్టారు.
నాలుగో బంతి... అఫ్తాబ్ ఆలం క్లీన్ బౌల్డ్.
అయిదో బంతి.. కొంచెం కూడా తేడా లేకుండా యార్కర్ పడింది. బెయిల్స్ గాల్లోకి లేచాయి. ముజీబ్ రెహ్మాన్ అవుట్.
అంతే.. ఇక ఆరో బంతి వేయాల్సిన అవసరం లేకుండాపోయింది. భారత్ విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
1987లో చేతన్ శర్మ హ్యాట్రిక్ ఇలా..
క్రికెట్ ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్ చేతన్ శర్మదే. అప్పటికి ఏ జట్టు బౌలర్ కూడా ప్రపంచ కప్‌లో ఇలాంటి ఫీట్ సాధించలేదు.
నాగపూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో చేతన్ శర్మ బౌలింగ్‌కు కివీస్ బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్ చేరారు.
శర్మ వేసిన ఒక ఓవర్లో కెన్ రూథర్‌ఫర్డ్, ఇయాన్ స్మిత్, ఇవెన్ చాట్‌ఫీల్డ్ వరుసగా అవుటయ్యారు.
ముగ్గురూ క్లీన్ బౌల్డ్ అయ్యారు.
దీంతో ప్రపంచకప్ క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ వీరులు వీరే..

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచకప్ హ్యాట్రిక్‌ల రికార్డులు ఇవీ..
* ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలోనే తొలి హ్యాట్రిక్ చేతన్ శర్మది కాగా.. మ్యాచ్‌లో తొలి మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ సాధించిన ఘనత చమిందా వాస్‌ది.
* రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ లసిత్ మలింగ.
* మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన జట్టు శ్రీలంక.
* అలాగే, 2003, 2011, 2015 ప్రపంచకప్‌లలో రెండేసి హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు"
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








