క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో ఆల్‌టైమ్ అత్యుత్తమ భారత జట్టు ఇదేనా... క్రికెట్ ఫ్యాన్స్ డ్రీమ్ టీమ్‌లో ఎవరెవరున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను పురస్కరించుకొని 'బీబీసీ స్పోర్ట్' ఓ పోల్ నిర్వహించింది.
ఇప్పటివరకూ భారత జట్టులో ఆడిన ఆటగాళ్ల నుంచి 11 మందిని ఎంచుకుని తమకు ఇష్టమైన వన్డే జట్టును ఎంపిక చేయాలని పాఠకులను కోరింది.
దాదాపు 12 వేల మంది దీనికి స్పందించారు. తమకు ఇష్టమైన జట్లను ఎంచుకున్నారు.
ఎక్కువ మంది పాఠకుల జట్లలో చోటు దక్కించుకున్న ఆ 11 మంది ఆటగాళ్లు వీరే...

ఫొటో సోర్స్, Getty Images
1. రోహిత్ శర్మ (57%)
(వన్డేలు: 208; పరుగులు: 8,189; సగటు: 48.17; అత్యుత్తమం: 264)
మీకు తెలుసా? వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు రోహిత శర్మదే. 2014లో అతడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మ మొత్తంగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇంకెవరికీ ఇది సాధ్యం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
2. వీరేంద్ర సెహ్వాగ్ (46%)
(వన్డేలు: 251; పరుగులు: 8,273; సగటు: 35.06; అత్యుత్తమం: 219)
మీకు తెలుసా? వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సెహ్వాగ్‌దే. 2011లో వెస్టిండీస్‌పై 219 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
3. కోహ్లీ (92%)
(వన్డేలు: 229; పరుగులు: 10,943; సగటు: 59.47; అత్యుత్తమం: 183)
మీకు తెలుసా? వన్డేల్లో 2వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో అత్యధిక బ్యాటింగ్ సగటు కోహ్లీదే.

ఫొటో సోర్స్, Getty Images
4. సచిన్ తెందుల్కర్ (97%)
(వన్డేలు: 463; పరుగులు: 18,426; సగటు: 44.83; అత్యుత్తమం: 200*)
మీకు తెలుసా? వన్డేల చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ తెందుల్కరే. తన కెరీర్‌లో 452 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన సచిన్, 44.8 సగటుతో 18,426 పరుగులు చేశాడు. 49 సెంచరీలు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
5. యువరాజ్ సింగ్ (61%)
(వన్డేలు: 304; పరుగులు: 8,701; సగటు: 36.56; అత్యుత్తమం: 150)
మీకు తెలుసా? వన్డేల్లో కనీసం 100 వికెట్లు తీసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో యువరాజ్‌ది మూడో స్థానం.

ఫొటో సోర్స్, Getty Images
6. ధోని (98%)
(వన్డేలు: 343; పరుగులు: 10,561; సగటు: 50.53; అత్యుత్తమం: 183*, 315 క్యాచ్‌లు & 121 స్టంపింగ్‌లు)
మీకు తెలుసా? వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన ఆటగాడు ధోనీనే. మొత్తంగా అతడు 436 మందిని ఔట్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
7. కపిల్ దేవ్ (79%)
(వన్డేలు: 225; పరుగులు: 3,783; సగటు: 23.79; అత్యుత్తమం: 175*; వికెట్లు: 253; సగటు: 27.45)
మీకు తెలుసా? 250కు పైగా వికెట్లు తీసిన ఆరు భారత బౌలర్లలో కపిల్‌దేవ్ కూడా ఒకరు. పదికి పైగా వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో అత్యుత్తమ ఎకానమీ రేటు (3.7) కూడా కపిల్‌దే.

ఫొటో సోర్స్, Getty Images
8. అనిల్ కుంబ్లే (78%)
(వన్డేలు: 271; వికెట్లు: 337; సగటు: 30.90; అత్యుత్తమం: 6-12)
మీకు తెలుసా? భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు కుంబ్లేనే.

ఫొటో సోర్స్, Getty Images
9. హర్భజన్ సింగ్ (46%)
(వన్డేలు: 236; వికెట్లు: 269; సగటు: 33.36; అత్యుత్తమం: 5-31)
మీకు తెలుసా? అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్లలో జాబితాలో హర్భజన్ సింగ్‌ది రెండో స్థానం.

ఫొటో సోర్స్, Getty Images
10. జహీర్ ఖాన్ (70%)
(వన్డేలు: 200; వికెట్లు: 282; సగటు: 29.44; అత్యుత్తమం: 5-42)
మీకు తెలుసా? శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌ల్లో జహీర్ 66 వికెట్లు పడగొట్టాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీసిన భారత బౌలర్లు మరెవరూ లేరు.

ఫొటో సోర్స్, Getty Images
11. జస్‌ప్రీత్ బుమ్రా (66%)
(వన్డేలు: 51; వికెట్లు: 90; సగటు: 21.99; అత్యుత్తమం: 5-27)
మీకు తెలుసా? బుమ్రా అరేంగట్రం (2016) చేసినప్పటి నుంచి ఒక్కరు మినహా మరే ఫాస్ట్ బౌలరూ అతడి కన్నా ఎక్కువ వికెట్లు తీయలేదు. బౌల్ట్ మాత్రమే ఈ కాలంలో 101 వికెట్లు తీసి బుమ్రా కన్నా ముందున్నాడు.
పై గణాంకాలన్నీ 2019, జూన్ 14 వరకూ నమోదైనవి.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- సల్వాజుడుం: నిర్వాసితులైన 30 వేల మందికి అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








