క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న ప్రపంచకప్- 2019 రానే వచ్చింది. 1975 నుంచి నాలుగేళ్లకోసారి జరుగుతున్న ఈ క్రీడా సంగ్రామంలో 2015 నాటికి 11 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రారంభమవుతున్నది 12వ ఎడిషన్. 48 మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ టోర్నమెంట్‌లో 10 జట్లు తలపడనున్నాయి.
మే 30 (గురువారం) నుంచి జూలై 14 (ఆదివారం) వరకు 46 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 11 ప్రాంతాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్, జూలై 14న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ప్రపంచకప్ 2019లో తలపడనున్న జట్లు ఇవే
- భారత్
- ఇంగ్లండ్
- ఆస్ట్రేలియా
- దక్షిణాఫ్రికా
- పాకిస్తాన్
- శ్రీలంక
- న్యూజిలాండ్
- బంగ్లాదేశ్
- అఫ్ఘానిస్తాన్
- వెస్టిండీస్

ఫొటో సోర్స్, Getty Images
భారత్ మ్యాచ్ ఎప్పుడు?
ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఇప్పటివరకు రెండుసార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మూడోసారి ప్రంపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న కాంక్షతో ఉంది.
జూన్ 5న ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ మైదానంలో భారత్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. జూన్ 16న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
వివిధ దేశాల జట్లతో భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్:
- జూన్ 5: దక్షిణాఫ్రికా
- జూన్ 9: ఆస్ట్రేలియా
- జూన్ 13: న్యూజిలాండ్
- జూన్ 16: పాకిస్తాన్
- జూన్ 22: అఫ్గానిస్థాన్
- జూన్ 27: వెస్టిండీస్
- జూన్ 30: ఇంగ్లండ్
- జులై 2: బంగ్లాదేశ్
- జులై 6: శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images
భారత జట్టు ఇదే
కెప్టెన్: విరాట్ కోహ్లీ, కోచ్: రవి శాస్త్రి
జట్టులోని సభ్యులు: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, ధోనీ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్
భారత్- పాకిస్తాన్ మ్యాచ్
జూన్ 16న ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రఫర్డ్ మైదానంలో భారత్- పాకిస్తాన్ జట్లు తలపడున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30) మ్యాచ్ ఆరంభం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐదుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా
క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని ఘనతను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ఆసీస్ ఏకంగా ఐదు సార్లు విశ్వ విజేతగా నిలిచింది.
2015 మార్చి 29న మెల్‌బోర్న్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. గతంలో 1987, 1999, 2003, 2007 వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
ఐదోసారి ఇంగ్లండ్ఆతిథ్యం
ప్రపంచ కప్‌కు అత్యధికంగా ఐదోసారి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ టోర్నీలు కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి.
ఇంగ్లండ్ తర్వాత ఈ టోర్నీ ఎక్కువసార్లు భారత ఉపఖండంలో జరిగింది. 1987, 1996, 2011 టోర్నీలు భారత ఉపఖండంలో జరిగాయి.
2023లో జరిగే ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతదేశంలోనే జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారి 10 దేశాలే ఎందుకు?
2011, 2015 ప్రపంచకప్ టోర్నీలలో దేశాల 14 జట్లు (నాలుగు ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలతో కలిపి) పాల్గొన్నాయి. అయితే, అసోసియేట్ దేశాలకు నేరుగా టోర్నీలో అవకాశం ఇవ్వకూడదని 2010 అక్టోబర్‌లో దుబాయిలో జరిగిన సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. జట్ల సంఖ్యను 14 నుంచి 10కి కుదించింది. 2019 నుంచి ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఏడాది క్రితం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్‌లో తలపడే అవకాశం కల్పించింది. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ జట్లను క్వాలిఫయర్ ద్వారా ఎంపిక చేసింది.
విజేతకు ఇచ్చే నగదు బహుమతి ఎంత?
ఈసారి ఐసీసీ నగదు బహుమతిని పెంచింది. గెలుపొందిన జట్టుకు రూ.28 కోట్లు, రన్నరప్‌కు రూ.14 కోట్లు ఇవ్వనున్నారు. ప్రపంచ కప్‌లో ఇచ్చే మొత్తం బహుమతుల విలువ రూ.70 కోట్లు.
టికెట్లు ఎక్కడ దొరుకుతాయి?
https://tickets.cricketworldcup.com ఇది అధికారిక వెబ్‌సైట్. ఇందులో లాగిన్ అయి టికెట్లు కొనుగోలు చేసే వీలుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచకప్ 2019 షెడ్యూలు
- మే 30ఇంగ్లండ్ Vs దక్షిణాఫ్రికా
- మే 31వెస్టిండీస్ Vs పాకిస్థాన్
- జూన్ 1న్యూజిలాండ్ Vs శ్రీలంక
- జూన్ 1అఫ్ఘానిస్తాన్ Vs ఆస్ట్రేలియా
- జూన్ 2దక్షిణాఫ్రికా Vs బంగ్లాదేశ్
- జూన్ 3ఇంగ్లండ్ Vs పాకిస్థాన్
- జూన్ 4అఫ్ఘానిస్తాన్ Vs శ్రీలంక
- జూన్ 5దక్షిణాఫ్రికా Vs భారత్
- జూన్ 5బంగ్లాదేశ్ Vs న్యూజిలాండ్
- జూన్ 6ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్
- జూన్ 7పాకిస్థాన్ Vs శ్రీలంక
- జూన్ 8ఇంగ్లండ్ Vs బంగ్లాదేశ్
- జూన్ 8అఫ్ఘానిస్తాన్ Vs న్యూజిలాండ్
- జూన్ 9భారత్ Vs ఆస్ట్రేలియా
- జూన్ 10దక్షిణాఫ్రికా Vs వెస్టిండీస్
- జూన్ 11బంగ్లాదేశ్ Vs శ్రీలంక
- జూన్ 12ఆస్ట్రేలియా Vs పాకిస్థాన్
- జూన్ 13 భారత్ Vs న్యూజిలాండ్
- జూన్ 14ఇంగ్లండ్ Vs వెస్టిండీస్
- జూన్ 15శ్రీలంక Vs ఆస్ట్రేలియా
- జూన్ 15దక్షిణాఫ్రికా Vs అఫ్ఘానిస్తాన్
- జూన్ 16 భారత్ Vs పాకిస్థాన్
- జూన్ 17వెస్టిండీస్ Vs బంగ్లాదేశ్
- జూన్ 18ఇంగ్లండ్ Vs అఫ్ఘానిస్తాన్
- జూన్ 18ఇంగ్లండ్ Vs అఫ్ఘానిస్తాన్
- జూన్ 19న్యూజిలాండ్ Vs దక్షిణాఫ్రికా
- జూన్ 20ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్
- జూన్ 22 భారత్ Vs అఫ్ఘానిస్తాన్
- జూన్ 22వెస్టిండీస్ Vs న్యూజిలాండ్
- జూన్ 23పాకిస్థాన్ Vs దక్షిణాఫ్రికా
- జూన్ 24బంగ్లాదేశ్ Vs అఫ్ఘానిస్తాన్
- జూన్ 25ఇంగ్లండ్ Vs ఆస్ట్రేలియా
- జూన్ 26న్యూజిలాండ్ Vs పాకిస్థాన్
- జూన్ 27 వెస్టిండీస్ Vs భారత్
- జూన్ 28శ్రీలంక Vs దక్షిణాఫ్రికా
- జూన్ 29పాకిస్థాన్ Vs అఫ్ఘానిస్తాన్
- జూన్ 29న్యూజిలాండ్ Vs ఆస్ట్రేలియా
- జూన్ 30 ఇంగ్లండ్ Vs భారత్
- జూలై 1శ్రీలంక Vs వెస్టిండీస్
- జూలై 2బంగ్లాదేశ్ Vs భారత్
- జూలై 3ఇంగ్లండ్ Vs న్యూజిలాండ్
- జూలై 4అఫ్ఘానిస్తాన్ Vs వెస్టిండీస్
- జూలై 5పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్
- జూలై 6శ్రీలంక Vs భారత్
- జూలై 6ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా
- జూలై 9 తొలి సెమీఫైనల్
- జూలై 11 రెండో సెమీఫైనల్
- జూలై 14 ఫైనల్ మ్యాచ్

ఫొటో సోర్స్, EPA
ప్రస్తుతం బరిలో నిలుస్తున్న 10 జట్లకు కెప్టెన్ ఎవరు? కోచ్ ఎవరు?

ఫొటో సోర్స్, GETTY ALLSPORT
1975 నుంచి 2015 వరకు ప్రపంచ కప్ విజేతలు ఎవరు?
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- వైఎస్ జగన్: ‘చిన్నప్పుడు క్రికెట్ కెప్టెన్.. ఇప్పుడు రాష్ట్రానికి కెప్టెన్’
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








