వైఎస్ జగన్మోహన్ రెడ్డి: తెలుగు నేలపై మరో యంగ్ సీఎం

ఫొటో సోర్స్, ysjagan
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత ఓ యువ నాయకుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 46 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటున్న నాలుగో పిన్న వయస్కుడు జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో నలభయ్యో పడిలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటున్న మూడో ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి 43 ఏళ్ళ వయసులో 1956లో ఆ పదవిని చేపట్టారు.
ఆ తరువాత 1962లో దామోదరం సంజీవయ్య రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాటు కొనసాగారు. ఆ పదవిని చేపట్టినప్పుడు దామోదరం సంజీవయ్య వయసు 39 సంవత్సరాలు.
ఆ తరువాత 1995లో నారా చంద్రబాబు నాయుడు 45ఏళ్ల వయసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అతి చిన్న వయసులో సీఎం పదవిలో కొనసాగింది మాత్రం దామోదరం సంజీవయ్యే.
ఇవి కూడా చదవండి.
- ‘జగన్కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్కు మాత్రమే ఉండేది’
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి
- నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా?
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా?
- అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?
- అభిప్రాయం: సమ న్యాయం జరిగేలా స్థానికతను నిర్వచించాలి
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








