ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాం?

ఫొటో సోర్స్, Getty Images
"నాకు చాలా భయం వేసింది. కానీ, నాకు ఆపాలని అనిపించలేదు. అందుకే కళ్ళు మూసుకుని మరింత సేపు ఆనందించాను. ఇక మళ్ళీ ఈ అవకాశం రాదు" అనుకున్నాను.
అలెజాండ్రా మెండోజాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక పని మరింకెప్పుడూ చేయకూడదని స్వీయ ప్రతిజ్ఞ చేసుకున్నారు. కానీ, ఆమె ఒక్కసారి కాదు, చాలా సార్లు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు.
ఆమె మొదటి సారి రోలర్ కోస్టర్ (జెయింట్ వీల్) ఎక్కినప్పుడు కలిగిన భయం క్రమేపీ ఒక ఆసక్తిగా మారిపోయింది. అది తిరుగుతున్నప్పుడు కలిగే మెలికలు, వంపులు, ఊపిరి బిగబట్టే ఎత్తులు, ఒకేసారి కిందకు పడేయడం లాంటివన్నీ రోలర్ కోస్టర్ల పట్ల ఆమె ఆసక్తిని పెంచాయి. రోలర్ కోస్టర్ ఎక్కడంతో పాటు, ఆ సమయంలో బిగ్గరగా అరవడం కూడా ఆమెకు బాగా నచ్చింది.
అమెరికాలో కొన్ని థీమ్ పార్కులు ఈ నెలాఖరు నుంచి తెరవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిని తగ్గించేందుకు రోలర్ కోస్టర్‌లు ఎక్కే వారిని కాస్త ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకుని, అరవకుండా ఉండాలని కోరుతున్నారు.
అలా కేకలు వేయడాన్ని మనం నియంత్రించుకోగలమా? ఆనందాన్ని పొందేటప్పుడు అరవకుండా ఉండగలరా? ఉల్లాసంగా ఉండాల్సిన సమయంలో అసలు మనమెందుకు అరుస్తాం?

ఫొటో సోర్స్, Getty Images
అరవడం అంటే ఏంటి?
"అరవడం అంటే మాటలు లేకుండా వ్యక్తం కావడం" అని ఇమోరి కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్ హరోల్డ్ గుజోల్స్ చెప్పారు.
"గట్టిగా గోల చేయడం అంటే గొంతును పైస్థాయికి పెంచడం. అంటే, మీరు మాట్లాడుతున్నట్లే అర్ధం" అని వివరించారు.
కానీ, అరుపు ఒక ప్రత్యేకమైన శబ్దంతో కూడుకుని ఉంటుంది. గొంతెత్తి గట్టిగా మాట్లాడడానికి, అరవడానికి సారూప్యాలున్నాయి. అరిచినప్పుడు వినపడే శబ్దాలు ఒక్క క్షణంలో మూడు వంతుల నుంచి సగం సమయం పాటు ఉండవచ్చు.
అరుపు ముందు చాలా గట్టిగా మొదలై, అదే స్థాయిలో కొంత సేపు ఉంటుంది.
అరుపు అరిచే సమయం కొంత సేపే ఉంటుంది. కానీ, శబ్దం మాత్రం గట్టిగా వినిపిస్తుంది, శబ్దం హై పిచ్‌లో ఉంటుంది. అలాగే, ఆ శబ్దం కొంత దూరం వరకు వినిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు అరుస్తాం?
"ముఖ్యంగా వేటాడేవారిని భయపెట్టి, ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాన్ని పొందేందుకు అరుపులు పుట్టాయి" అని ప్రొఫెసర్ గుజోల్స్ అన్నారు.
సంఘ జీవులు సాధారణంగా ఇతర సభ్యుల నుంచి సహాయం అడగడానికి అరుపులు పనికొస్తాయి.
"కానీ, సహాయం కోసం అరిచే అరుపుల శబ్దాల ద్వారా అరుస్తున్న వ్యక్తులను గుర్తు పట్టవచ్చు" అని ఆయన అన్నారు. ముప్పు కలిగించే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికే రకరకాల అరుపులు పుట్టాయి. మీరు అరుస్తున్నప్పుడు మీ గొంతెలా ఉంటుందో ఒక సామాజిక సమూహంలో వారికి అర్ధమవుతుంది" అని గుజోల్స్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
రోలర్ కోస్టర్ ఎక్కితే ఏమవుతుంది?
అయితే, అరుపులు ఎలా పుట్టాయనే సిద్ధాంతం గురించి హుషారుతో కిర్రెక్కిపోయే తరానికి అక్కరలేదు. వారికి కావాల్సింది ఆ అరుపుల నుంచి కలిగే సంతోషమే. కానీ, ఈ రెంటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉందని గుజోల్స్ అంటారు.
"కానీ, మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితుల్లో, అత్యంత సంతోషకర స్థితిలో అరుపులతో వ్యక్తమయ్యేలా మన మెదడు పరిణామం చెందింది" అని గుజోల్స్ అన్నారు.
"మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నాం. అలాగే, ప్రతీ రోజూ అరవాల్సిన పనేమీ ఉండదు. అలా అని, ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు భయపడకుండా ఉండమని కాదు" అని అన్నారు.
"ముప్పు ఎదురుగా ఉన్న సమయంలో మనం పూర్వీకుల మాదిరిగానే అరుస్తాం. ఈ ప్రపంచంలో నెట్టుకు రావడానికి కొన్ని సార్లు అరుపులు అవసరం" అని అన్నారు.
"మన పూర్వీకులకు ఏదైనా జలపాతం లేదా మంటలు చెలరేగే అగ్ని పర్వతం దగ్గరగా వెళుతున్నప్పుడు అరిచే అలవాటు ఉండి ఉండవచ్చు" అని ప్రొఫెసర్ గుజోల్స్ చెప్పారు.
ఆధునిక మానవులు అరవడానికి థీమ్ పార్క్‌లు, రోలర్ కోస్టర్లు మంచి అవకాశాన్ని ఇస్తాయి.
"ఆ సమయంలో మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త పోటు పెరుగుతుంది. రోలర్ కోస్టర్‌లో తిరుగుతున్నప్పుడు అది సురక్షితమే అని తెలిసినా కూడా భయపడినప్పుడు కలిగేలాంటి స్పందనలే శరీరంలో కలుగుతాయి" అని గుజోల్స్ చెప్పారు.
ఈ అరుపు శరీరంలో కలిగిన ఒత్తిడిని బయట పడేస్తుంది.

ఫొటో సోర్స్, Alejandra Mendoza
అలెజాండ్రా లాంటి వారు రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు ఎందుకు అరుస్తారో దీనిని బట్టి అర్ధమవుతుంది.
"మీరు భయపడతారు. కానీ, అదే సమయంలో మంచి క్షణాలను అనుభవిస్తూ ఉంటారు"
అలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
ఎందుకంటే, ఆ క్షణంలో మిగిలిన విషయాలన్నీ మర్చిపోతాం. మీరు అప్పటికి ఆ క్షణంలో మాత్రమే ఉంటారు" అని ఈక్వడార్ కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి చెబుతున్నారు.
ఈ అభిప్రాయంతో, ట్రావెల్ బ్లాగర్ డిన్ఫ్ మెన్సింక్ అంగీకరిస్తున్నారు.
ఆమె చిన్నప్పటి నుంచే రోలర్ కోస్టర్లు ఎక్కినప్పుడు కలిగే అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉన్నానని చెప్పారు.
"నగరాల్లో ఉండే థీమ్ పార్కులను చూడటం నాకు ఇష్టం. నా ఉద్దేశంలో ఇది చాలా ఉత్సాహపరిచే విషయం" అని ఆమె అన్నారు
23 సంవత్సరాల బ్లాగర్ ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉంటారు.
తాను ఊహించినట్లుగా ఉండే రోలర్ కోస్టర్ ఎక్కేందుకు ఆమె ఎప్పటి నుంచో ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు.
చాలా సార్లు అది ఎక్కేందుకు కట్టిన క్యూలను , రోలర్ కోస్టర్ లూప్ లను చూసినప్పుడు రోలర్ కోస్టర్ ఎక్కలేనందుకు హాయిగా ఫీల్ అవుతాం.
"కానీ, ఒక్కసారి దాని మీద కూర్చుంటే మాత్రం ఒక్కొక్కసారి నెమ్మదిగా పైకి వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. కానీ, కిందకు రాగానే, నాకు ఉత్సాహంతో అరవాలని ఉంటుంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Dymphe Mensink
ఇలా అరవడం వల్ల తన భావాలన్నిటినీ వ్యక్తపరిచినట్లుగా ఉంటుందని డింఫ్ చెప్పారు.
ఇలా సాధారణ జీవితంలో అనుభవించలేం" అని అన్నారు.
"నేను అరిచినప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉంటాను. అంటే, అది నాకొక మంచి అనుభూతిని కలుగచేస్తుంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Aki Hayashi
ప్రపంచంలో ఉన్న రోలర్ కోస్టర్ లన్నిటినీ ఎక్కి వాటిలో దాగిన ఆనందాన్ని అనుభవించడమే తన జీవితకాలపు స్ఫూర్తి అని డిస్నీ ల్యాండ్ టోక్యో పుట్టినిల్లు యురేసులో పుట్టి పెరిగిన అకి హయాషి అన్నారు.
"రోలర్ కోస్టర్ లేకుండా నేను జీవితాన్ని ఆస్వాదించలేను" అని ఆయన అన్నారు.
ఈ 27 సంవత్సరాల వ్యక్తి 'కోస్టర్ రైడర్స్ జపాన్' అనే బృందానికి నాయకునిగా ఉన్నారు.
ఈ బృందంలో రోలర్ కోస్టర్ పట్ల ఆసక్తి ఉన్నవారు విషయాలు చర్చించుకుని, సభ్యులంతా కలిసి థీమ్ పార్కులకు వెళుతూ ఉంటారు.
ఒక్కొక్కసారి అరవకుండా ఉండటాన్ని ఆపుకోగలనని అన్నారు. ఆయన ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 350 కోస్టర్లను ఎక్కారు.

ఫొటో సోర్స్, Aki Hayashi
"నేను సొంతంగా రోలర్ కోస్టర్ నడుపుతున్నప్పుడు, నేనంత ఉత్సాహంగా లేనట్లు నటిస్తాను. లేదంటే, అందరూ నావైపే చూస్తారు. కానీ, నా లాంటి కోస్టర్ రైడర్లు అందరూ సమావేశమైనప్పుడు మాత్రం పార్టీలా ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి అరుస్తూ, గోల చేస్తూ ఉంటాం. అరుపుల శబ్దాలు పెరగడం, తగ్గడం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది" అని అన్నారు.
"అరుపును నియంత్రించుకోవడం సాధ్యమే" అని ప్రొఫెసర్ గుజోల్స్ అంటున్నారు.
"కానీ, కొంత మందికి అలా నియంత్రించుకోవడం సవాలుగా మారుతుంది. కొందరికి నియంత్రణ ఉంటే కొందరకి ఉండదు" అని అన్నారు.
"ప్రతీ విషయంలో మాదిరిగానే ఇందులో కూడా వ్యత్యాసాలు ఉంటాయి".
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








