సరస్సు అడుగున బయటపడిన గ్రామం

రేసియా సరస్సు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రేసియా సరస్సు

దశాబ్దాల క్రితం నీటిలో మునిగిపోయిన ఒక గ్రామం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి.

ఇటలీలోని ఒక రిజర్వాయర్​‌ అడుగున ఇవి కనిపించాయి. ఉత్తరాన ఉండే రేసియా సరస్సు, దాని మధ్యలో ఉండే చర్చి టవర్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి.

ఆ పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒక పుస్తకం రాసేందుకు, నెట్​ఫ్లిక్స్​లో ఒక సిరీస్​ను నిర్మించేందుకు కూడా ఈ సుందర దృశ్యం ప్రేరణగా నిలిచింది.

నీటిలో మునిగిన గ్రామంలోని మెట్ల శిథిలాలు

ఫొటో సోర్స్, Luisa Azzolini

ఫొటో క్యాప్షన్, నీటిలో మునిగిన గ్రామంలోని మెట్ల శిథిలాలు

గ్రామం ఆనవాళ్లు ఎలా బయటపడ్డాయి?

రిజర్వాయర్​‌‌ మరమ్మత్తుల కోసం సరస్సులోని నీటిని వదిలేయడంతో క్యురన్​ అనే గ్రామం ఆనవాళ్లు కనిపించాయి.

ఒకప్పుడు ఈ గ్రామంలో వందలాది మంది నివసించేవారు.

1950లో హైడ్రోఎలక్ట్రిక్​ ప్లాంట్​ను నిర్మించడం వల్ల వరద నీరు చేరి క్యురన్​ గ్రామం నీట మునిగింది.

నీట మునిగిన గ్రామంలోని ఒక ఇల్లు

ఫొటో సోర్స్, Luisa Azzolini

ఫొటో క్యాప్షన్, నీట మునిగిన గ్రామంలోని ఒక ఇల్లు

సరస్సు అడుగున ఉన్న 14వ శతాబ్దానికి చెందిన చర్చి టవర్​తో పాటు గోడలు, సెల్లార్లు, మెట్ల ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

ఒకప్పటి గ్రామం నడిబొడ్డున నడుస్తున్నప్పుడు 'వింత అనుభూతి' కలిగిందని లూసియా అజోలినీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

నీట మునిగిన గ్రామం శిథిలాల్లో నడుస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, Luisa Azzolini

ఫొటో క్యాప్షన్, నీట మునిగిన గ్రామం శిథిలాల్లో నడుస్తున్న స్థానికులు

1950లో ఒక రిజర్వాయర్​ను నిర్మించాలని, దగ్గర్లోని రెండు సరస్సులను కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా క్యురన్​ గ్రామం నీట మునగాల్సిన పరిస్థితి వచ్చింది.దాదాపు 160 ఇళ్లు నీట మునిగాయి. క్యురన్ ప్రజలు నిర్వాసితులయ్యారు. కొందరు కొత్తగా నిర్మించిన గ్రామంలో స్ధిరపడ్డారు.

రేసియా సరస్సు

ఫొటో సోర్స్, Luisa Azzolini

రేసియా లేదా జర్మన్​లో రెస్​చెన్​సీ అని పిలిచే ఈ సరస్సు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్​ సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలోని దక్షిణ టైరోల్​లో ఉంది.

ప్రస్తుతం వేసవి కాలంలో సరస్సు వద్దకు హైకర్స్ వస్తుంటారు.

చలికాలంలో యాత్రికులు గడ్డ కట్టిన సరస్సుపై నడుస్తూ శిఖరాన్ని చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

వీడియో క్యాప్షన్, ఈ సరస్సుకు కేన్సర్ వచ్చింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)