35 సంవత్సరాల క్రితం అదృశ్యమైన విమానం జాడ ఇప్పుడు దొరికింది

కాలిఫోర్నియా

ఫొటో సోర్స్, Justin Sullivan

అమెరికాలోని కాలిఫోర్నియాలో వచ్చిన కరవు.. కనిపించకుండా పోయిన ఓ విమానాన్ని గుర్తించేలా చేసింది.

శాక్రమెంటో సమీపంలో ఫోల్సోమ్ సరస్సులోని లోతట్టు ప్రాంతంలో సోనార్‌ ద్వారా సర్వే చేస్తున్న సీఫ్లూర్‌ సిస్టమ్స్‌ సంస్థ గుర్తు తెలియని వస్తువు జాడకనుగొంది.

దానిని తొలుత 1965లో ప్రమాదానికి గురైన విమానంగా అధికారులు భావించారు.

కానీ ఆ తర్వాత 1986లో ప్రమాదానికి గురైన మరో విమానంగా ఒక అంచనాకు వచ్చారు.

పైపర్ కోమంచె 250

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పైపర్ కోమంచె 250

1965లో ఏం జరిగింది?

న్యూ ఇయర్‌ డే రోజున పైపర్ కోమంచె 250 రకానికి చెందిన విమానం ఆచూకీ తెలియకుండా పోయింది.

ఈ విమాన ప్రమాదంలో పైలెట్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మృతిచెందారు.

పైలట్‌ మృతదేహం అప్పుడే లభించగా, మిగిలిన ముగ్గురి మృతదేహాలు దొరకలేదు. సదరు విమానం కోసం 2014 వరకు చేపట్టిన గాలింపు చర్యలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు.

పైపర్ కోమంచె 250

ఫొటో సోర్స్, Getty Images

పైపర్ కోమంచె 250 కాదన్న అధికారులు..

సోనార్‌ టెక్నాలజీతో చూసినప్పుడు చెక్కు చెదరకుండా ఉన్న శకలాలు 1965నాటి విమానానివిగా భావించి, శకలాలకు మరింత దగ్గరగా వెళ్లడానికి అధికారులు ప్రయత్నించారు.

ప్లేసర్‌ కౌంటీ షెరీఫ్‌, ఎల్‌ డొరాడో కౌంటీ షెరీఫ్‌ కార్యాలయాలకు చెందిన గజ ఈతగాళ్ల బృందం సీఫ్లూర్‌ సిస్టమ్స్‌ సాంకేతిక నిపుణులతో కలిసి మరింత లోతు నుంచి విమాన ఫోటోలను సేకరించింది.

అయితే ఈ విమానం 1965లో ప్రమాదానికి గురైన విమానం కాదని, 1986లో ప్రమాదానికి గురైన మరో విమానంగా అంచనాకు వచ్చారు.

కాగా 1986లో జరిగిన విమానం ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ప్రస్తుతం ఈ విమానం ఇంకా సరస్సు లోపలే ఉంది.

నాటి విమాన శకలాల కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సిన పని లేదని, 1965 విమాన ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

తీవ్ర కరువు వల్ల ఫోల్సోమ్‌ సరస్సులో నీటి నిల్వ 38 శాతానికి పడిపోయింది. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ రాష్ట్రంలోని 41 కౌంటీలలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)