చల్లని పదార్థాలు తిన్నప్పుడు దంతాలు, నరాలు జివ్వుమని ఎందుకు లాగుతాయి.. దీనికి పరిష్కారం ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
ఐస్‌క్రీం తింటున్నప్పుడు లేదా చల్లని కూల్‌డ్రింక్ తాగుతున్నప్పుడు కొందరికి దంతాలు జివ్వుమని లాగుతాయి. ఆ నొప్పి భరించలేనంతగా ఉంటుంది.
ఈ బాధను తట్టుకోలేక ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉంటుంటారు చాలామంది.
అయితే, ఇలా చల్లని పదార్థాలు తిన్నప్పుడు నోటిలోని నరాలు, దంతాలు జివ్వుమని ఎందుకు లాగుతాయో తెలిసిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు.
తినే పదార్థాల ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయినప్పుడు సెన్సిటివ్‌గా ఉండే దంతాల్లో కొన్ని కణాలు స్పందిస్తాయని, అవి మెదడుకు నొప్పి సంకేతాలను పంపిస్తాయని కనుగొన్నారు.
దంత క్షయం ఉన్నవారికి ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది.
నొప్పిని తగ్గించే టూత్‌పేస్ట్ వాడడం లేదా దంతాల్లో అతుకులు వేయించుకోవడం, చూయింగ్ గమ్ నమలడంలాంటి కొత్త రకం చికిత్సా విధానాల ద్వారా ఈ బాధను తగ్గించుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
"నొప్పి కలిగించే కణాన్ని గుర్తించగలిగితే చికిత్సకు అవకాశం ఉంటుంది" అని ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకులు క్యాథరీనా జిమ్మర్‌మాన్ తెలిపారు.
నొప్పిని కలిగించే నాడీ స్పందనను ‘టీఆర్‌పీసీ5’ అంటారు.
‘ఒడొంటోబ్లాస్ట్’ అనే ప్రత్యేక కణంలో ఈ టీఆర్‌పీసీ5 ఉంటుందని జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది.
దంతం కింద మృదువుగా ఉండే గుజ్జులాంటి పదార్థానికి, పైన డెంటీన్, ఎనామెల్‌తో కూడిన గట్టి పదార్థానికి మధ్యలో ఈ ప్రత్యేక కణం ఉంటుందని గుర్తించారు.

నొప్పి తగ్గడానికి..
ఎనామెల్ ఎలాంటి అనుభూతినీ కలిగించదు.
దాని కింది పొరలో ఉన్న డెంటీనే మనకు కలిగే అనుభూతులకు కారణం.
ఇది పంటి కింద లోపలి గుజ్జుతో అనుసంధానం అయి ఉంటుంది. ఆ ప్రాంతంలోనే నాడీ కణాలు ఉంటాయి.
దంత క్షయం లేదా చిగుళ్ళ వ్యాధి వలన ఈ డెంటీన్ బయటపడుతుంది.
హైపర్సెన్సిటివిటి పెరిగి చల్లని పదార్థాలు లేదా కొన్ని రకాల పానియాలు తాగినప్పుడు నొప్పిని కలిగిస్తాయి.
పదార్థాల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చినప్పుడు దంతాల లోపలి కణాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎలుకలు, మనుషులపై ప్రయోగాలు చేశారు.
చల్లటి పదార్థాలు నోట్లోకి వెళ్లినప్పుడు లోపలి కణాలు, నాడులు ఎలా స్పందిస్తున్నాయో రికార్డ్ చేశారు.
"మనుషుల్లో దంతాల వ్యాధి ఉన్నవారిలో టీఆర్‌పీసీ5 ఛానెళ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. స్ట్రిప్స్ లేదా చూయింగ్ గమ్‌లు వాడి ఈ టీఆర్‌పీసీ5ని పూడ్చడం ద్వారా నొప్పి కలగకుండా చేయవచ్చు. డెంటీన్ హైపర్‌సెన్సిటివిటీని తగ్గించవచ్చు" అని జిమ్మర్‌మాన్ తెలిపారు.
మనం ఇంట్లో వాడే లవంగాలు కూడా ఈ నొప్పికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. లవంగాల నూనెలో యూజెనాల్ అనే రసాయన పదార్థం ఉంటుంది. అది టీఆర్‌పీసీ5 ద్వారాన్ని మూసివేస్తుంది.
అయితే, పంటినొప్పికి సొంతంగా చికిత్సలు చేసుకోవడం మంచిది కాదని, డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

నొప్పి నిరోధించడం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుందని, మూల కారణం కనిపెట్టి చికిత్స చేయడమే దీన్ని శాశ్వతంగా తగ్గించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అని బ్రిటిష్ డెంటల్ అసోసియేష్‌కు చెందిన ప్రొఫెసర్ డామెయిన్ వాంస్లేయ్ అంటున్నారు.
"ఈ పరిశోధన ఆసక్తికరమే కానీ దంతాలు సెన్సిటివ్‌గా ఎందుకు మారుతున్నాయో, కారణాలు ఏమిటో కనుక్కోవడం ముఖ్యం. దంత క్షయానికి గురైన దంతాలను తొలగించడం లేదా సెన్సిటివ్ దంతాల కోసం ప్రత్యేకమైన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం మెరుగైన ఫలితాలను ఇస్తుంది" అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో టీఆర్‌పీసీ5ను నిరోధించే పదార్థాలను టూత్‌పేస్టుల్లో, ఇతర దంత సంబంధ ఉత్పత్తుల్లో కలిపే అవకాశం ఉందని ప్రొఫెసర్ డామెయిన్ తెలిపారు.
మనం తినే పదార్థాల్లో ఉండే చక్కెరలోని ఆమ్లం దంతాలపై ఉండే ఎనామెల్, డెంటీన్‌లపై దాడి చేసి, వాటిని సున్నితంగా మారుస్తుంది. అందుకే దంత క్షయం వస్తుంది.
ఆ తర్వాత ఈ ఆమ్లం ఆ ప్రాంతంలో క్యావిటీకి కారణమవుతుంది.
ఎంత తరుచుగా చక్కెర పదార్థాలు, ఆమ్ల పదార్థాలు తీసుకుంటామో అంత ఎక్కువగా దంత క్షయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి ఈ పదార్థాలను పరిమితంగా తీసుకోవడం మేలు.
తిన్న తరువాత శుభ్రంగా పళ్లు తోముకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- బాత్ సోప్‌లు, టూత్ పేస్టులు, కాస్మెటిక్స్‌లో వాడే ట్రైక్లోసాన్... నరాలను దెబ్బతీస్తోందా?
- భవిష్యత్తులో భారత్, చైనాలలో పెరగనున్న కవలలు
- రెడ్ ఆపిల్ అంతరించిపోతుందా? అసలు ఆపిల్ ఎక్కడ పుట్టింది? దానికి ఆ రంగు ఎలా వస్తుంది?
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- కలరా వ్యాధి ఎప్పుడు, ఎక్కడ వ్యాపిస్తుందో అంతరిక్షం నుంచి చూసి పసిగట్టేస్తున్నారు
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- సెక్స్ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారిన డాక్టర్ అనుభవాలేంటి?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








