టిండర్, బంబుల్, ఓకే క్యూపిడ్: డేటింగ్ యాప్‌లు పాతపడిపోయాయా? జోడీ అన్వేషణకు సంప్రదాయ పద్ధతులకు మళ్లుతున్నారా?

ఫొటో సోర్స్, linda jonsson
- రచయిత, మేడీ సావేజ్
- హోదా, బీబీసీ
డేటింగ్ యాప్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు ప్రజలకు తమ భాగస్వాములను వెతుక్కునే వీలు కల్పించాయన్నది పాత వార్త. కానీ, తమ డిజిటల్ డివైస్‌ల ద్వారా నిజమైన ప్రేమను కనుగొనే ప్రయత్నంలో ఓడిపోయిన ఎంతోమందికీ ఆ కొత్తదనం పాతదైపోయింది.
''నేను కొందరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను. తరువాత వారు స్నేహితులయ్యారు. కానీ, అవేవీ దీర్ఘకాలిక సంబంధాలుగా నిలవలేదు'' అన్నారు మెల్‌బోర్న్‌కు చెందిన 30 ఏళ్ల రచయిత మాడలీన్ డోరె. ఆమె న్యూయార్క్, కోపెన్‌హాగన్లలోనూ డేటింగ్ చేశారు.
గత అయిదేళ్లుగా టిండర్, బంబుల్, ఓకే క్యూపిడ్ వంటి యాప్స్ వాడుతున్న ఆమె అక్కడ తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ.. అందులో కొన్ని రొమాంటిక్ కామెడీ సినిమాల్లో దృశ్యాల్లా అనిపిస్తే మరికొన్ని భయంకరంగా అనిపించాయన్నారు.
డోరె స్నేహితులు కొందరు తమ భాగస్వాములను ఆన్‌లైన్‌లోనే కలుసుకున్నారు. ఆ విషయం తెలిసే డోరె కూడా పట్టుదలగా తన ప్రయత్నాలు సాగించింది.
కానీ, అక్కడ సంభాషలు ఊహించని విధంగా మారినప్పుడు ఆమె డేటింగ్ క్యాన్సిల్ చేసుకుని కొన్ని నెలల పాటు ఆ యాప్స్ ను తన మొబైల్ నుంచి డిలీట్ చేసేవారు.
ఇదంతా చాలామందికి తెలిసినవిషయమే. సరైన జోడీ దొరక్కపోవడమో లేకపోతే చాలా జోడీలు కుదరడమో.. తప్పుడు సమాచారంతో ఉన్న ప్రొఫైల్స్, జాతి వివక్ష వ్యాఖ్యలు వంటి ఎన్నో తలనొప్పులకు డేటింగ్ యాప్స్ వేదికలన్న విషయం చాలామందికి అనుభవంలోని వ్యవహారమే.
అమెరికా, బ్రిటన్లలోని 35 ఏళ్లలోపు వారిలో సగం మంది ఏదోరకమైన డిజిటల్ డేటింగ్ కోసం ప్రయత్నించినవారే. వేల కోట్ల వ్యాపారమైన డేటింగ్ యాప్‌ల రంగం 2014 నుంచి 2019 మధ్య 11 శాతం పెరిగింది. అయినప్పటికీ బ్రిటన్‌లోని 16 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కుల్లో చాలామంది కొత్త జోడీని కలుసుకోవడానికి తాము అనుసరించే మార్గాల్లో డిజిటల్‌కు తక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు 2018లో బీబీసీ చేసిన ఓ సర్వేలో తేలింది.

ఫొటో సోర్స్, Alamy
డిజిటల్ రొమాన్స్ నష్టాలపై దృష్టి
ఈ యాప్స్ వాడకుండా ఉండలేని స్థితికి చేరినవారు చివరికి ఒంటరితనంతో బాధపడుతున్నారని జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్ సెప్టెంబరులో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.
''ఒక జోడీ వెతకడానికి చాలా సెర్చ్ చేయాలి... ఒక నంబర్ పట్టడానికి అనేక జోడీలు వెతకాలి.. ఒక డేట్ కుదరడానికి చాలా నంబర్లు కావాలి'' అని ఆన్‌లైన్ డేటింగ్ రంగ పత్రిక 'గ్లోబల్ డేటింగ్ ఇన్‌సైట్స్' సంపాదకుడు స్కాట్ హార్వే అన్నారు.
భాగస్వామిని వెతుక్కోవడానికి ఇన్ని చేయడం ప్రయాసతోకూడిన పని మాత్రమే కాదు ఉద్రేకం కూడా కలుగుతుందన్నారాయన.
మరోవైపు 'ది అట్లాంటిక్' స్టాఫ్ రైటర్ జూలీ బెక్ మూడేళ్ల కిందటే డేటింగ్ యాప్స్‌తో కలుగుతున్న విసుగుపై కథనం రాయగా 2019లో ఈ యాప్స్‌తో కలిగే ఇబ్బందులపై చర్చ పెరిగింది.
మిలీనియల్ మీడియాగా పేరున్న గ్లామర్, వైస్ వంటివీ డేటింగ్ యాప్స్ అంశాలకు ప్రాధాన్యం తగ్గిస్తున్నాయి.
ఈ యాప్స్ నుంచి బయటపడాలనుకునేవారి కోసం అమెరికా డేటింగ్ కోచ్ కేమిలీ వర్జీనియా 'ది ఆఫ్‌లైన్ డేటింగ్ మెథడ్' పేరుతో ఒక పుస్తకం రాశారు.
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ వెరిటీ గీర్ ఎనిమిదేళ్ల పాటు ఆన్‌లైన్ డేటింగ్ చేసినా దీర్ఘకాలిక బంధం ఏర్పరుచుకోలేకపోవడంతో సెక్స్, రిలేషన్‌షిప్ నుంచి పూర్తిగా ఎలా బయటకొచ్చేశానన్నది వెల్లడించారు.

ఫొటో సోర్స్, kamila saramak
చాలామంది ఆన్‌లైన్ డేటింగ్ నుంచి ఆఫ్‌లైన్‌కు మళ్లుతున్నారు. పోలాండ్ రాజధాని వార్సాలో నివసించే వైద్యురాలు కమీలా సరామక్(30) ఆన్‌లైన్ డేటింగ్ కట్టిపెట్టి ఆఫ్‌లైన్ డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
రెండేళ్లు కలిసున్న భాగస్వామితో విడిపోయిన తరువాత రోజూ టిండర్‌లో గడిపానని.. ఆరేడు నెలల పాటు అనేక ప్రొఫైల్స్ చూస్తూ, వారికి మెసేజ్‌లు పెడుతూ ఉండేదాన్నని కమీలా చెప్పారు. చివరకు అది తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గుర్తించి టిండర్ నుంచి బయటకొచ్చేశానని చెప్పారు.
మరికొందరికి ఈ డేటింగ్ యాప్స్‌ను డిలీట్ చేయడమంటే తాము కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందడమే.
స్టాక్ హోంలో జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసే 27 ఏళ్ల లిండా జాన్సన్ మాట్లాడుతూ.. ''ప్రజలు వీటితో విసిగిపోతున్నారు' అన్నారు.
అంతవరకు ఎవరితోనూ డేట్ చేయని మిలీనియల్స్ కోసం ఈ డేటింగ్ యాప్‌లలో వెతకడమంటే గడ్డి వాములో సూది కోసం వెతికినట్లే. అలా అని అలాంటి ఉండరని కాదు, ఉంటారు.. కానీ, నూటికో కోటికో ఒక్కరు.
బయట ప్రపంచంలో వెతుక్కోగలరా
మరి, ఆన్‌లైన్ వదిలేసి సదృశ ప్రపంచంలో దీర్ఘకాలిక భాగస్వాములను వెతుక్కోవడం మిలీనియల్ యువతకు సాధ్యమేనా.. అందుకు గల అవకాశాలేమిటన్నదీ చర్చనీయమే.
ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతూ పాత తరాలతో పోల్చితే అపరిచితులతో మాటలు కలిపే అలవాటూ తగ్గిపోయిన ఈ తరంలోని అనేక మందికి బయటి ప్రపంచంలో తాము ఇష్టపడుతున్న వ్యక్తులను ఎలా సంప్రదించాలన్నది తెలుసా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే రిలేషన్‌షిప్ థెరపిస్ట్మాట్ లూండ్‌క్విస్ట్ తన పేషెంట్లలో ఒంటరిగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో సంబంధాలకే ప్రాధాన్యమిస్తుంటారని.. బయట ఇతర చోట్ల జోడీ కుదిరే అవకాశాలున్నా పట్టించుకోరని చెప్పారు.
చాలామంది బయట పార్టీలకు, బార్లకు వెళ్లేటప్పుడు అక్కడ డేటింగ్ అవకాశాల గురించి ఏమాత్రం ఆలోచించరని చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
సంబంధాలలో సందిగ్థత
ఆన్‌లైన్ డేటింగ్ పెరిగే కొద్దీ బయట జనం చేరే ప్రదేశాలు తగ్గిపోతున్నాయని.. గతంలో అలాంటి ప్రదేశాల్లోనే డేట్‌లను, లైంగిక భాగస్వాములను వెతుక్కునేవారని.. కానీ, ఆన్ లైన్ డేటింగ్ వల్ల అలాంటి ప్రదేశాలు తగ్గిపోతున్నాయని లూండ్‌క్విస్ట్ అన్నారు.
లండన్, స్టాక్‌హోం సహా ప్రపంచంలోని అనేక నగరాల్లో గే బార్‌లు వంటివి మూత పడుతున్నాయని.. లండన్‌లో 2005-15 మధ్య సగం నైట్ క్లబ్‌లు మూతపడ్డాయని 'బీబీసీ న్యూస్‌బీట్' అధ్యయనంలో తేలింది.
#MeToo ఉద్యమం నేపథ్యంలో ఆఫీసుల్లో ప్రేమ కథలు మొదలయ్యే అవకాశాలూ తగ్గిపోయాయి.
పదేళ్ల కిందటితో పోల్చితే సహోద్యోగులతో సంబంధాలు ఏర్పరుచుకోవడం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరోవైపు లూండ్‌క్విస్ట్ ఈ డేటింగ్ యాప్‌ల రాక వెనుక కారణాన్ని గుర్తు చేశారు. శృంగార భాగస్వాములను కలవడం, వారితో సంబంధాలేర్పచుకోవడంలో వెనుకబడినవారికి సహాయంగానే ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలు వచ్చాయని లూండ్‌క్విస్ట్ గుర్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, damona hoffman
యాప్‌లోనూ సోషల్‌గా
ఆన్‌లైన్ డేటింగ్‌లో కొనసాగేవారికి, ఆ యాప్స్ వాడేవారికి ఆయన సలహాలిస్తున్నారు. ప్రొఫైల్స్‌ను స్నేహితులకు షేర్ చేయడం ద్వారా యాప్స్ మరింత సోషల్‌గా మార్చొచ్చంటారాయన. అలాగే డేట్ కుదిరాక ఎక్కడికి వెళ్లాలి వంటివి నిర్ణయించడానికి మిత్రులతో ఆలోచనలు పంచుకోవడం వల్ల ఈ యాప్స్ మరింత సోషల్‌గా మారుతాయంటారాయన.
ఇప్పుడున్న పద్ధతిలో అంతా గుంభనంగా ఎవరికి వారు ఈ యాప్స్ వాడుతున్నారని లూండ్‌క్విస్ట్ అంటారు.
అనలాగ్ ప్రపంచంలో జోడీని వెతుక్కోవడానికీ అవకాశాలున్నా కూడా డేట్‌ను ఎంచుకోవడానికి అత్యంత శక్తిమంతమైన సాధనం యాపేనని అంటారు లాస్ ఏంజెల్స్‌కు చెందిన డేటింగ్ కోచ్ డమోనా హాఫ్‌మన్.
డేటింగ్‌కు ఒక స్థాయి ప్రణాళిక, కోరిక ఉండాలని.. కానీ, చాలామంది మిలీయన్లలో అది లోపించిందని డమోనా అభిప్రాయపడుతున్నారు.
డేటింగ్ విషయంలో ఆమె ఈ తరానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. జోడీలను కుదుర్చుకోవడానికి చేసే ఆన్‌లైన్ చాటింగ్‌కు కానీ నిజజీవితంలో వ్యక్తులను కలవడానికి కానీ వారానికి 5 గంటలు కేటాయించాలని.. ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారో స్పష్టతతో ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి వ్యక్తులను ఎక్కడ కలుసుకోవచ్చో అవగాహన కలిగి ఉండి అక్కడకు వెళ్తుండాలని సూచిస్తున్నారు.
ఇక స్తోమత ఉన్నవారైతే డేటింగ్ కోచ్‌ను పెట్టుకోవచ్చు. ఇందుకు నెలకు సుమారు వెయ్యి డాలర్లు తీసుకుంటారు.
ఐరోపా అంతటా ఇలాంటి డేటింగ్ కోచ్ సేవలందించే సంస్థలున్నాయి.
అయితే.. డేటింగ్ యాప్స్‌తో అలసిపోయామని, విసిగిపోయామని అనుకునేవారెవరైనా కొద్దిరోజులు వాటికి విరామమిచ్చి మళ్లీ అందులోకి రావాలని సూచించారు.

ఫొటో సోర్స్, Relate
డేటింగ్ తరువాత ఏమిటి?
డేటింగ్ యాప్స్ భవిష్యత్తు గురించి స్కాట్ హార్వే మాట్లాడుతూ.. వీడియో, కృత్రిమ మేధ ఈ రంగంలో ఇప్పుడు ప్రధానాంశాలుగా మారాయని చెప్పారు.
అమెరికా సహా 20 దేశాల్లో ఫేస్ బుక్ తీసుకొచ్చిన డేటింగ్ ఫీచర్లోనూ వీడియో, ఫొటో ఆధారిత కథనాలు షేర్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీన్ని వచ్చే ఏడాది యూరప్ దేశాల్లో అందుబాటులోకి తేనున్నారు.
యాప్‌లో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడడం వల్ల మరింత సన్నిహిత అనుభూతి కలుగుతుందన్నది డేటింగ్ యాప్స్ కంపెనీల మాట.
మరోవైపు నిక్కచ్చైన సంబంధాలు, కలయికల కోసం చూస్తున్న సింగిల్స్ సంఖ్య పెరుగుతోంది.. కానీ, అలాంటివి సొంతంగా ఏర్పరుచుకోవడం అంత సులభం కాదని రిలేట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఫిలిప్ జోన్జాన్ జార్ల్ చెబుతున్నారు. రిలేట్ సంస్థ సింగిల్స్‌కు పార్టీలు ఏర్పాటు చేస్తుంటుంది.
అయితే, ఇవి ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నా వీటన్నిటికోసం ఆన్‌లైన్ ప్రాసెస్ అవసరమంటోందా సంస్థ.
మొత్తానికి సింగిల్స్ మధ్య సంబంధాలు ఏర్పరచడానికి ఇలాంటి పార్టీలు మంచి ప్రయత్నమేనన్నది కొందరి భావన.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








