చైనాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'.. పాకిస్తాన్ ప్రభుత్వ టీవీలో అక్షర దోషం

ఫొటో సోర్స్, EPA
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలో ప్రసంగాన్ని ప్రసారం చేసేటప్పుడు అక్షర దోషం దొర్లినందుకు పాకిస్తాన్ ప్రభుత్వ టీవీ ఛానెల్ క్షమాపణలు చెప్పింది.
చైనా రాజధాని బీజింగ్ నగరం నుంచి ఇమ్రాన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా ఆ టీవీ తెరమీద బీజింగ్‌కి బదులుగా 'బెగ్గింగ్' (అడుక్కోవడం) అని కనిపించింది.
పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు వందల కోట్ల రూపాయల సాయం అడిగేందుకు ఇమ్రాన్ ఖాన్ చైనా వెళ్లారు.
బీజింగ్‌లోని సెంట్రల్ పార్టీ స్కూల్‌లో ఇమ్రాన్ ప్రసంగిస్తుండగా పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీవీ) ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అప్పుడే ఆ 'అక్షర దోషం' దొర్లింది.
ఈ తప్పిదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీటీసీ తెలిపింది. అలా జరగడం "దురదృష్టకరం" అని ట్విటర్‌లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కొన్నేళ్లుగా 'బెల్ట్ అండ్ రోడ్డు' కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్‌లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఈ పరిస్థితుల్లోనే చైనా ఆర్థిక సాయం కోరేందుకు ఇమ్రాన్ బీజింగ్ వెళ్లారు.
చైనా మంత్రి లీ కెక్వియాంగ్‌తో ఇమ్రాన్ సమావేశం అనంతరం పాకిస్తాన్‌లో ప్రారంభించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు చైనా అంగీకరించింది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా ఇమ్రాన్ కలిశారు.
మరోవైపు, పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిలవుట్ ప్యాకేజీ కోరే ఆలోచన కూడా చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు ఆరు బిలియన్ డాలర్లు సహాయ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు గత నెలలో సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ డబ్బు ఏమాత్రం సరిపోదని పాక్ అధికారులు అంటున్నారు.
దాంతో, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1980 నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ నుంచి 12 సార్లు పాకిస్తాన్ బెయిలవుట్ ప్యాకేజీ అందుకుంది.
ఇవి కూడా చదవండి:
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు: బళ్లారిలో బీజేపీ ఓటమి... ‘గాలి’ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- భారతదేశ 'తొలి' కమ్యూనిటీ రేడియో దశాబ్ది వేడుక... ఇది తెలంగాణ దళిత మహిళల విజయ గీతిక
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








