996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
చైనా బిలియనీర్, ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఆలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా "ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ ఆరు రోజులూ" పనిచేసే విధానం ఉండాలనే వాదనను కొనసాగిస్తున్నారు.
'996'గా పిలుస్తున్న ఈ విధానం గురించి ప్రస్తుతం చైనీస్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఈ విధానాన్ని జాక్ మా గట్టిగా సమర్థిస్తున్నారు. చైనాలో దీన్ని ప్రవేశపెట్టాలని ఆయన అంటున్నారు.
లేకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ సత్తువ కోల్పోయి, వృద్ధి వేగం కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నారు.
జాక్ మా నెలకొల్పిన ఇ-కామర్స్ సంస్థ అలీబాబా.. అమెజాన్, గూగుల్ వంటి వాటికి పోటీగా అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ సంస్థల్లో ఒకటిగా అవతరించింది.
ఆ సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ.34 లక్షల కోట్లు. జాక్ మా వ్యక్తిగత సంపద రూ.2.7 లక్షల కోట్లని అంచనా.

996 విధానం అంటే ఏంటి?
ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు... వారానికి ఆరు రోజులు పనిచేయడాన్ని ‘996 విధానం’ అని చైనాలో పిలుస్తున్నారు.
అంటే రోజుకు పన్నెండు గంటలు పని చేయాలన్నమాట.
దీనిపై చైనాలో కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
బీజింగ్ కేంద్రంగా పనిచేసే న్యాయ సలహాల కంపెనీ వుసాంగ్ నెట్‌వర్క్ టెక్నాలజీకి చెందిన సీనియర్ లీగల్ కౌన్సెల్ జంగ్ షియొలిన్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘996 పని విధానం చట్టానికి వ్యతిరేకం’’ అని చెప్పారు.

చైనాకే చెందిన మరో టెక్ ఎంట్రప్రెన్యూర్, జేడీ.కామ్ ఇ-కామర్స్ సంస్థ అధినేత రిచర్డ్ లియూ కూడా '996 విధానం'పై జాక్ మాతో గొంతు కలుపుతున్నారు.
ఆర్థిక వృద్ధి వేగం ఏళ్లపాటు కొనసాగడంతో చైనాలో 'పని ఎగ్గొట్టేవారు' ఎక్కువయ్యారని లియూ అంటున్నారు.
1970ల చివరి నుంచి 2000ల మధ్య కాలం వరకూ 25 ఏళ్లకు పైగా చైనా సగటు ఆర్థిక వృద్ధి 10 శాతం మించి నమోదైంది. ఆ తర్వాత కాలంలో మందగించి 6 శాతం దగ్గరికి వచ్చింది.
జేడీ.కామ్ ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలు వస్తున్న తరుణంలో లియూ తాజా వ్యాఖ్యలు చేశారు.
''గత నాలుగేళ్లలో మేం ఎవర్నీ తీసివేయలేదు. ఫలితంగా సిబ్బంది సంఖ్య బాగా పెరిగింది. ఆదేశాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారు. పనిచేసేవారు తగ్గిపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ మార్కెట్‌లో స్థానం కోల్పోవాల్సి వస్తుంది'' అని లియూ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- అలీబాబా అధినేత జాక్ మా సంచలన నిర్ణయం
- అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు
- పారిస్లో అగ్నిప్రమాదం: 850 ఏళ్ల నాటి చర్చిలో మంటలు
- వికీలీక్స్ సహ-వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అరెస్ట్
- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందున్న సవాళ్ళేమిటి...
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- మరోసారి దాడి చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తోందన్న పాక్, ఖండించిన భారత్
- వారమంతా తక్కువ నిద్ర, వారాంతాల్లో ఎక్కువ నిద్ర... బ్యాలెన్స్ అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








