బీటిల్ మీద బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్: తాజా ఆవిష్కరణ

బీటిల్

ఫొటో సోర్స్, MARK STONE/UNIVERSITY OF WASHINGTON

బీటిల్ వంటి సజీవ కీటకాలు కూడా మోసుకెళ్లగలిగేలా పరిశోధకులు ఒక చిన్న వైర్‌లెస్ కెమెరాను తయారు చేశారు.

తక్కువ శక్తితో నడిచే ఈ కెమెరా వ్యవస్థను తయారు చేసిన అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ, దానికి కీటకాల నుంచే స్ఫూర్తి పొందింది.

బీటిల్ మీద కెమెరా

ఫొటో సోర్స్, MARK STONE/UNIVERSITY OF WASHINGTON

ఫొటో క్యాప్షన్, ఈ బుల్లి కెమెరాతో తీసిన వీడియోలు, ఫొటోలు బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అందుతాయి

కీటకాలపై ఉన్న ఈ కెమెరాతో, దగ్గర్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు బ్లాక్ అండ్ వైట్‌లో సెకనుకు ఐదు ఫ్రేముల రిజల్యూషన్‌తో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వవచ్చు.

ఈ పరిశోధన గురించి సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ కెమెరా మొత్తం బరువు కేవలం 250 మిల్లీగ్రాములు ఉంటుంది. అంటే అది ప్లేయింగ్ కార్డ్ బరువులో పదో వంతు.

బిటిల్ మీద కెమెరా

ఫొటో సోర్స్, MARK STONE/UNIVERSITY OF WASHINGTON

దీనికి ఉన్న సెన్సర్ తక్కువ రిజల్యూషన్‌తో ఉంటుంది. అది 160 బై 120 పిక్సెల్ ఫొటోలు కాప్చర్ చేస్తుంది. ఒక పక్క నుంచి మరో పక్కకు తిరిగే ఒక మెకానికల్ చేతికి ఈ కెమెరాను బిగిస్తారు.

ఆ చేయి సాయంతో ఈ కెమెరాను అటూ ఇటూ తిప్పి చూడవచ్చు. పరిసరాలను స్కాన్ చేయవచ్చు. అధిక రిజల్యూషన్ ఉన్న స్పష్టమైన ఫొటోలు తీయవచ్చు.

బీటిల్ మీద కెమెరా

ఫొటో సోర్స్, UNIVERSITY OF WASHINGTON

ఫొటో క్యాప్షన్, ఈ చిత్రంలో కుడివైపు పైభాగంలో ఉన్న ఫొటో.. రూబిక్స్ క్యూబ్ పక్కన ఉన్న బీటిల్ తీసింది

దీని బ్యాటరీ ఎక్కువ సమయం వచ్చేలా పరిశోధకులు ఈ సిస్టంలో ఒక ఆక్సిలోమీటర్ కూడా అమర్చారు. దాని సాయంతో కీటకం కదులుతున్నప్పుడు కెమెరా ఫొటోలు మాత్రమే తీస్తుంది.

అలా, ఫుల్ చార్జింగ్‌తో ఈ కెమెరా ఆరు గంటలపాటు పనిచేయగలుగుతుంది.

“ఈ పరిశోధనలో పేడపురుగులకు ఎలాంటి ప్రమాదం కలగలేదు. అవి దాదాపు ఏడాది పాటు జీవించాయి” అని పరిశోధనల తర్వాత వారు చెప్పారు.

బుల్లి కెమెరా

ఫొటో సోర్స్, MARK STONE/UNIVERSITY OF WASHINGTON

ఫొటో క్యాప్షన్, ఈ పరిశోధకులు ఒక బుల్లి కెమెరా రోబోను కూడా తయారు చేశారు

ఈ పరిశోధకులు తాము నేర్చుకున్న వాటిని స్వతంత్రంగా నడిచే కీటకం సైజున్న ఒక కెమెరా రోబోను తయారుచేయడానికి ఉపయోగించారు.

“ప్రపంచంలో వైర్‌లెస్ విజన్‌తో స్వయం శక్తి ద్వారా భూమిపై నడిచే అతి చిన్న రోబోట్ ఇది ఒక్కటే” అని ఈ టీమ్ చెబుతోంది.

బుల్లి కెమెరా రోబో

ఫొటో సోర్స్, MARK STONE/UNIVERSITY OF WASHINGTON

ఫొటో క్యాప్షన్, ఈ బుల్లి కెమెరా రోబో వైబ్రేషన్ ద్వారా కదులుతుంది

చక్రాలు లేని ఈ రోబో వైబ్రేషన్ ద్వారా కదులుతుంది. అది సెకనుకు మూడు సెంటీమీటర్ల దూరం వెళ్లగలదు.

ఈ చిన్నకెమెరా రోబోలు కొత్త నిఘా సమస్యలను సృష్టించవచ్చని ఈ పరిశోధనలు చేసిన సీనియర్ ఆథర్ శ్యామ్ గొల్లకోట గుర్తించారు.

“పరిశోధకులుగా ఇలాంటి వాటి గురించి పబ్లిక్ డొమైన్లో పెట్టడం చాలా ముఖ్యం అని మేం బలంగా నమ్ముతున్నాం. అప్పుడే, జనాలకు వాటి నష్టాల గురించి తెలుస్తుంది. అలా, జనం వాటికి పరిష్కారాలతో ముందుకు రావడం మొదలవుతుంది” అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)